Sanju Samson Catch in Ind vs NZ | సూపర్ క్యాచ్ పట్టిన సంజూ
టీమ్ ఇండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ ( Sanju Samson ) మొదటి టీ20 మ్యాచ్ లో అద్భుతమైన క్యాచ్ పట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ సూపర్ డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. దాంతో న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ ( Devon Conway ) కాన్వే పరుగులు చేయకుండానే వెనుదిరిగాడు.
సంజూ క్యాచ్ పట్టుకోగానే స్లిప్‌లో ఉన్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav ) ఎగిరి గంతేసాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. 239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది న్యూజిలాండ్. అర్ష్‌దీప్ సింగ్ ( Arshdeep Singh ) వేసిన తొలి ఓవర్‌లోనే డెవాన్ కాన్వే అవుట్ అయ్యాడు.
అర్ష్‌దీప్ సింగ్ వేసిన బాల్ ను కాన్వే కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ కు తగిలిన బాల్, కీపర్ సంజూ శాంసన్‌కు ఎడమవైపు దూరంగా వెళ్ళింది. సంజూ వెంటనే డైవ్ చేసి ఒంటి చేత్తో బాల్ ను అందుకున్నాడు. సంజు ఆ క్యాచ్ పట్టడంతో స్టేడియంలోని ఫ్యాన్స్ అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ క్యాచ్ తో సంజు శాంసన్, ధోనిని గుర్తు చేసాడని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.





















