DC vs LSG Match Highlights IPL 2025 | సంచలన రీతిలో లక్నోపై గెలిచేసిన ఢిల్లీ | ABP Desam
ఎవ్వరూ ఊహించనిది జరిగింది. 210పరుగుల టార్గెట్ పెట్టింది లక్నో. ఛేజింగ్ లో ఢిల్లీ 65 కే 5 వికెట్లు కోల్పోయింది. మిగిలిన ఆశాకిరణం ట్రిస్టన్ స్టబ్స్ కూడా సర్దేశాడు. ఇంకేముంది మ్యాచ్ లక్నోదే అనుకున్నారు అంతా. కానీ ఒక్కడు అంతా మార్చేశాడు. ఆడి పేరు అశుతోష్ వర్మ. వైజాగ్ లో లక్నో ప్లేయర్లకు తినిపించాడు షెవర్మా. లాస్ట్ లో ఊహించని రీతిలో అశుతోష్ సంచలన బ్యాటింగ్ తో లక్నోను మట్టి కరిపించింది ఢిల్లీ. మరి ఈ నెయిల్ బైటింగ్ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం.
1. అద్భుత వీరుడు అశుతోష్ శర్మ
అబ్బా ఏమన్నా బ్యాటింగా అది. లాస్ట్ ఇయర్ చూశాం పంజాబ్ లో ఆఖర్లో వచ్చి పిచ్చకొట్టుడు కొట్టేవాడు. ఇప్పుడు ఢిల్లీకి మారిపోయాడు అన్నీ వదిలేసి ఉంటాడు అనుకుంటే ఆ దూకుడు నా బ్లడ్ లో ఉందిరా బచ్చా అన్నట్లు లక్నో బౌలర్లను ఊతకొట్టుడు కొట్టాడు. ఎవ్వరూ ఊహించనిరీతిలో 31బంతుల్లో 5ఫోర్లు 5సిక్సర్లతో 61 పరుగులు చేసి విన్నింగ్ షాట్ సిక్సర్ బాది సంచలన రీతిలో ఢిల్లీకి విజయాన్ని కట్టబెట్టాడు అశుతోష్ శర్మ.
2. ట్రిస్టన్ స్టబ్స్ & విప్రాజ్ నిగమ్ షో
ఈ మ్యాచ్ లో ఢిల్లీ గెలవటానికి అశుతోష్ శర్మ ఎంత కారణమో అంతే కారణం ట్రిస్టన్ స్టబ్స్, విప్రాజ్ నిగమ్. 65 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా...ఆదుకుంటాడు అనుకున్న ఫాప్ డుప్లెసీ అయిపోనా స్టబ్స్ ఆ తర్వాత నిగమ్ తగ్గలేదు. స్టబ్స్ 22 బాల్స్ లో 34 పరుగులు చేస్తే...విప్రాజ్ నిగమ్ 15 బంతుల్లోనే 5ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేసి అవుటయ్యాడు. వీళ్లిద్దరూ కొట్టింది తక్కులానే కనిపించొచ్చు ఆ తేడానే అశుతోష్ శర్మ టార్గెట్ ఛేజ్ చేయగలననే కొండంత ధైర్యం ఇచ్చింది.
3. మార్వెలెస్ మిచ్ మార్ష్
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో బ్యాటర్లలో... మార్ క్రమ్ త్వరగానే అవుటైనా మరో ఓపెనర్ మిచ్ మార్ష్ మాత్రం చెలరేగిపోయాడు. ఢిల్లీ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. మిచెల్ స్టార్క్ తో మొదలుపెట్టి కుల్దీప్ యాదవ్ అందరినీ ఈక్వెల్ గా కుమ్మేసిన మార్ష్ 36 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 72 పరుగులు చేసి ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు.
4. పూనకాల పూరన్
మిచ్ మార్ష్ కొట్టింది చాలదన్నట్లు పూరన్ కూడా తగులుకోవటంతో లక్నో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 30 బంతుల్లో 6 ఫోర్లు 7 సిక్సర్లతో 75 పరుగులు బాదుకున్నాడు పూరన్. ఫలితంగా లక్నో స్ట్రాంగ్ పొజిషన్ కి వెళ్లిపోయింది. చివర్లో డేవిడ్ మిల్లర్ కూడా చేయి వేయటంతో 210 పరుగుల టార్గెట్ ఢిల్లీకి ఇవ్వగలిగింది లక్నో.
5. అటు పంత్, ఇటు JFM అట్టర్ ఫ్లాప్
వాస్తవానికి ఈ మ్యాచ్ ను చాలా మంది చూసింది. లక్నో 27కోట్లు పెట్టి కొనుక్కుని కెప్టెన్సీ ఇచ్చిన పంత్ బాబు ఏ రేంజ్ లో విరుచుకుపడతాడో అని కానీ అనూహ్యంగా 6 బాల్స్ ఆడి డకౌట్ అయి వెనుదిరిగాడు పంత్. అటు ఆస్ట్రేలియా యువ సంచలనం జాక్ ఫ్రేజర్ మెక్ గర్క్ కూడా అంతే. లాస్ట్ ఐపీఎల్లో ధనా ధన్ బాదుడుతో ఢిల్లీ కి కొండంత అండగా ఉంటాడు అనుకుంటే 1 పరుగుకే అవుటై నిరాశపరిచాడు. ఏదేమైనా అశుతోష్ శర్మ అద్భుతమైన ఢిల్లీ తమ సెకండ్ హోం గ్రౌండ్ వైజాగ్ లో మ్యాచ్ గెలిచి టోర్నీ ని విజయంతో ఆరంభించింది.





















