వార ఫలాలు ( మార్చి 24 - 30): ఈ రాశులవారికి అనారోగ్య సూచన - వాహనం నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి!
Your Weekly Horoscope For March 24 to 30 ,2025 : మార్చి 24 సోమవారం నుంచి మార్చి 30 ఆదివారం వరకూ ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల వారఫలితాలు ఇక్కడ తెలుసుకోండి

Saptahik Rashifal 24 to 30 march 2025 : ధనస్సు రాశివారు అత్యవసరం అయితే కానీ ఈవారంలో ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. మకర రాశివారు చాలా ఉత్సాహంగా ఉంటారు. కుంభ రాశివారు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీన రాశివారు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఈ వారం మీ రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి
ధనుస్సు రాశి (Sagittarius Weekly Horoscope)
ధనుస్సు వారు ఈ వారం మంచి అవకాశాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో చాలా మంచి సమయం గడుపుతారు. సమయాన్ని అర్ధవంతమైన ఉపయోగించుకుంటారు. ఉద్యోగులకు శుభసమయం. పిల్లల పురోగతితో మీరు సంతోషిస్తారు. అప్పులిచ్చిన డబ్బులు తిరిగి పొందుతారు. మీరు వారం మధ్యలో కొన్ని శుభవార్తలు పొందవచ్చు. స్నేహితులను కలుస్తారు. అత్యవసరం అయితే తప్ప ఎక్కువ దూరం ప్రయాణించవద్దు. ఇతరులపై మీ బాధ్యతలు రుద్దొద్దు. ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి. ముఖ్యమైన పనుల గురించి కొంత గందరగోళం ఉండవచ్చు. ఇన్ -లాస్ వైపు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దిగుమతి-ఎగుమతి వ్యాపారంలో అసౌకర్యాలుంటాయి.
ఉగాది పంచాంగం 2025 ధనస్సు రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
మకర రాశి (Capricorn Weekly Horoscope)
ఈ వారం మీరు పని విషయంలో చాలా ఉత్సాహంగా ఉంటారు. మీ కలలు నిజం చేసేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. ఉద్యోగులు పనిచేసే ప్రదేశంలో ప్రమోషన్ సంబంధిత సమాచారం వింటారు. తక్కువ ప్రయత్నాల్లో మంచి విజయం సాధిస్తారు. స్నేహితులు అవసరం అయిన సమయంలో మీకు అండగా ఉంటారు. ఈ వారం విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. ప్రేమ సంబంధాలలో సానుకూల అభివృద్ధి ఉంటుంది. రియల్ ఎస్టేట్ తో సంబంధం ఉన్న వ్యాపారవేత్తలు నగదు కొరత సమస్యలను ఎదుర్కొంటారు. నూతన పెట్టుబడి పెట్టడానికి ముందు అనుభవజ్ఞులైన వ్యక్తులను సంప్రదించడం మర్చిపోవద్దు.
ఉగాది పంచాంగం 2025 మకర రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
కుంభ రాశి (Aquarius Weekly Horoscope)
కుంభం రాశివారికి ఈ వారం శుభసమయం. తోబుట్టువుల మద్దతు మీకుంటుంది. మీరు చాలా మంచి సమాచారాన్ని పొందవచ్చు. వివాహ జీవితంలో అనుకూలత ఉంటుంది. కుటుంబంలో సందడి నెలకొంటుంది. కెరీర్‌లో ముందుకు సాగడానికి జీవిత భాగస్వామి ప్రోత్సాహం మీకుంటుంది . ప్రేమికులు పెళ్లి కోసం పెద్దలను సంప్రదిస్తారు. సంగీతం , లలిత కళలపై ఆసక్తి కలిగి ఉంటారు. ఈ వారం మీపై అసూయపడే వ్యక్తులు మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నిస్తారు. తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలను తీవ్రంగా తీసుకోండి. రుణ లావాదేవీల విషయలో స్పష్టంగా వ్యవహరించండి. అనవసర చర్చలకన్నా పనిపై దృష్టి పెట్టండి
మీన రాశి (Pisces Weekly Horoscope)
ఈ వారం మీన రాశి వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. మీరున్న రంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. అనవసర విషయాలపై చర్చలు పెట్టొద్దు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వ్యక్తులు ఉద్యోగాలు మారేందుకు ప్రయత్నాలు చేయొచ్చు. ప్రేమ వ్యవహారాల గురించి చాలా సంతోషంగా ఉంటారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించండి. అనవసరమైన విషయాలపై వివాదాన్ని పెంచవద్దు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఈ వారం అనుకోని ఖర్చులు పెరుగుతాయి.
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

