Bandi Sanjay VS BRS: బండి సంజయ్ మానసిక స్థితి సరిగాలేదు, బీఆర్‌ఎస్ ఆగ్రహం, క్రిమినల్ కేసులు పెట్టాలని ఫిర్యాదులు
Telangana Latest News: మాజీ సీఎం కేసీఆర్ దొంగనోట్లు ముద్రించారన్న బండి సంజయ్‌పై బీఆర్‌ఎస్ యుద్ధం ప్రకటించింది. నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసులు కూడా పెడుతున్నారు.

Telangana Latest news: తెలంగాణ రాష్ట్ర సాధకులు, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్‌ని కించపరుస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో కెపి.వివేకానంద్, సంజయ్ విజయుడు మాట్లాడారు.
బండి సంజయ్ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు. బాధ్యత గల పదవిలో ఉండి కెసిఆర్ పట్ల చేసిన వ్యాఖ్యలు పార్టీతో పాటు తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. బిజెపి అధ్యక్ష పదవి దక్కించుకోవడం కోసమే బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. హోంశాఖ సహాయక మంత్రిగా ఉండి ఈ వ్యాఖ్యలు చేయడం ఆ పదవిని కించపరిచేలా ఉందన్నారు.
బండి సంజయ్ మానసిక పరిస్థితి సరిగా లేదని ఎమ్మెలేయ కెపి.వివేకానంద్ అన్నారు. కేంద్ర మంత్రిగా ఉండి ఆయన చేస్తున్న ఈ వ్యాఖ్యలు దేశ గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. బండి సంజయ్‌కి దమ్ముంటే హైదరాబాద్‌కు ఒక నేషనల్ పార్క్, నిధులు తీసుకురావాలని సవాల్ చేశారు. అలాంటి దమ్ము, ధైర్యం లేకపోవడంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియా సమావేశం నిర్వహించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు @kp_vivekanand మరియు @drsanjayBRS
— BRS Party (@BRSparty) March 24, 2025
♦️ బండి సంజయ్ మా పార్టీ అధినేత కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు
♦️ ఆధారాలు లేకుండా తీవ్ర ఆరోపణలు చేశారు
♦️ బాధ్యతగల పదవిలో ఉండి కేసీఆర్ పట్ల చేసిన వ్యాఖ్యలను… pic.twitter.com/HzdIRH4dyA
రెచ్చగొట్టే మాటలతో రాజకీయాలు చేయాలని బండి సంజయ్ చూస్తున్నారన్నారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు. రెచ్చగొట్టే మాటలతో ప్రజలను, ఇతర పార్టీల నాయకులను కించపరిచే ఇలాంటి నాయకులను ఇప్పటికైనా ప్రధాని మోడీ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఆయన చేసిన కామెంట్స్‌కు భగ్గుమంటున్న బీఆర్‌ఎస్ పలు ప్రాంతాల్లో కేసులు నమోదు చేస్తోంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌తోపాటు పలువురు నేతలు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసుపెట్టారు.
స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన బీఆర్‌ఎస్ నేతలు కేంద్ర మంత్రిగా బాధ్యతాయుతంగా మాట్లాడటం లేదని మండిపడ్డారు. వైషమ్యాలు సృష్టించి రాజకీయపబ్బం గడుపుకునేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
ఇంతకీ బండి సంజయ్ ఏమన్నారు?
కేసీఆర్ దొంగ నోట్లు ముద్రించి ఎన్నికల్లో పంచాడని కేంద్రంమంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయనకు బీదర్‌లో దొంగ నోట్లు ప్రింటింగ్ చేసే మిషన్ ఉందని అన్నారు.
TRS chief was once involved in fake currency and fake passport rackets.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 24, 2025
Back then, Congress leaders staged protest.
Their silence on KCR now speaks a lot about BRS & Congress understanding & cooperation.
Don’t ask his history to the chamchas around him, the real leaders know… pic.twitter.com/VD9cbkwBC4
ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో ఉన్న ప్రవీణ్ కుమార్ గతంలో చేేసిన కామెంట్స్‌ను తాజాగా బండి సంజయ్ పోస్టు చేశారు. ఆయన దొంగనోట్లు ముద్రించారని బీఎస్పీలో ఉన్నప్పుడు ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు.
Hi @RSPraveenSwaero garu,
— 𝐒𝐚𝐟𝐟𝐫𝐨𝐧 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 (@Sagar4BJP) March 24, 2025
This is ur speech Dated : 02-Nov-2023 where you referred to KCR as an accused in a fake currency notes racket in a FIR at Kachiguda Police Station.
Praveen garu, @bandisanjay_bjp iterated what you said in the past.
Do you deny that it was you who… https://t.co/9sBHLx2Jpj pic.twitter.com/5mRoMVlfeE
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

