Bandi Sanjay: పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ పేర్లను తొలగిస్తారా?.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Bandi Sanjay : తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరామలు పేరును తొలగించడం పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఆంధ్రా మూలాలున్నాయని పొట్టి శ్రీరామలు పేరు తొలగించారు.

Bandi Sanjay : తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును తొలగించడం పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కరీంనగర్లో ఆయన విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం సభ్యులు పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ..‘‘పొట్టి శ్రీరాములు గొప్ప దేశభక్తుడు. దేశ స్వాతంత్ర్యం కోసం అనేకసార్లు జైలుకు పోయిన వ్యక్తి. హరిజనులను ఆలయాల్లోకి ప్రవేశం కల్పించాలని ఉద్యమించి శాసనం చేయించిన వాడు. పొట్టి శ్రీరాములు లాంటోళ్లు పది మంది ఉంటే ఎప్పుడో స్వాతంత్ర్యం తెచ్చేటోడినని అన్నారంటే ఆయన గొప్పతనం అర్థం చేసుకోవాలి. అట్లాంటి నేత పేరును తొలగించి అవమానిస్తారా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డికి సవాల్
ఆంధ్రా మూలాలున్నాయని పొట్టి శ్రీరామలు పేరు తొలగించారు. మరి ఆ మూలాలు ఉన్నాయని ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మనందరెడ్డి పేర్ల మీద అనేకం ఉన్నాయి. వారి పేర్లను కూడా తీసేస్తారా అని సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు.బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆత్మీయ సమ్మేళం నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ ఆర్యవైశ్యుల వ్యతిరేక పార్టీ. దళిత వ్యతిరేక పార్టీ అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి ఈరోజు.మద్రాస్ రాష్ట్రం నుండి ఆంధ్రాను వేరు చేయాలని మాత్రమే కోరిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. అంతే తప్ప తెలంగాణకు వ్యతిరేకం కాదే.. అలాంటి వ్యక్తిని అవమానించడం ఎంత వరకు కరెక్ట్ అన్నారు. ఆర్యవైశ్య సమాజమంతా ప్రస్తుతం ఆగ్రహంతో ఉంది. హిందూ సమాజమంతా మరోసారి ఆలోచించాలి. ఈ దేశం కోసం పోరాటాలు చేసిన వారి త్యాగాలను స్మరించుకోవడం వారి విగ్రహాలు పెట్టి గౌరవించుకోవడం మన సంస్కారమన్నారు.
రానున్నవి కార్యకర్తల ఎన్నికలు
సిరిసిల్ల కార్యకర్తలు పోరాట యోధులు. బీఆర్ఎస్ పాలనలో యువరాజు సిరిసిల్లకు వస్తుంటే అడుగడుగునా అడ్డుకుని ప్రజా వ్యతిరేక పాలనపై పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. ఆ భయానికే యువరాజు తాను వచ్చే ముందు బీజేపీ కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ లు చేసే వారన్నారు బండి సంజయ్. రానున్నవి కార్యకర్తల ఎన్నికలే. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించాల్సిన బాధ్యత మాదే అన్నారు.
పది లక్షల కోట్ల అప్పు
కాంగ్రెస్ తెలంగాణను శ్రీలంకలా మారుస్తోంది. రాష్ట్రంలో అరాచక, అవినీతి పాలన కొనసాగుతోంది. 15 నెలల్లోనే లక్షన్నర కోట్ల అప్పు చేసి ప్రజలపై భారం మోపింది. రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పు భారం మోపబోతున్నారు. జీతాలివ్వడానికి, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేందుకు పైసల్లేవంటున్నారు. కానీ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని తబ్లిగీ జమాతే వంటి సమావేశాలు నిర్వహిస్తున్నారు. 6 గ్యారంటీలను నెరవేరిస్తే బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందన్నారు. రైతు భరోసా, రుణమాఫీ పైసలన్నీ ఇస్తేనే బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని బండి సంజయ్ సూచించారు. మహిళలకు తులం బంగారం, స్కూటీ, నెలకు రూ.2500 ఇస్తేనే బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. అట్లాకాకుండా అవినీతి, అరాచక పాలన చేస్తూ... ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి బ్రాండ్ ఇమేజ్ పేరుతో లేనిపోని కార్యక్రమాలు నిర్వహిస్తే ఏ విధంగా ఇమేజ్ పెరుగుతుందని బండి సంజయ్ ప్రశ్నించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

