Hyderabad Crime News: టెన్త్ క్లాస్ విద్యార్థినికి లైంగిక వేధింపులు- ముగ్గురు బాలుర అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
Hyderabad News | టెన్త్ క్లాస్ విద్యార్థినిని మార్ఫింగ్ వీడియోలతో ఒక బాలుడు, ప్రైవేట్ వీడియోలు ఉన్నాయంటూ వేధిస్తున్న ఇద్దరు బాలురను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

School Students | హైదరాబాద్: గచ్చిబౌలిలోని ఒక స్కూల్లో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో టెన్త్ క్లాస్ విద్యార్థినిని అదే తరగతికి చెందిన బాలుడు వేధిస్తున్నాడు. అతడితో పాటు మరో ఇద్దరు బాలురు వీడియోలు, ఫొటోలతో బాలికను లైంగికంగా వేధిస్తున్నారు. ప్రేమను నిరాకరించడంతో మార్ఫింగ్ ఫోటోలతో ఒకరు లైంగిక దాడికి పాల్పడగా.. ఈ వీడియో రికార్డు చేశామంటూ మరో ఇద్దరు బాలురు సైతం టెన్త్ క్లాస్ విద్యార్థినిని వేధింపులకు గురిచేస్తున్నారు. కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగింది..
హైదరాబాదులోనే గచ్చిబౌలిలో ఓ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో అదే తరగతికి చెందిన బాలుడు కొంత కాలం నుంచి వేధిస్తున్నాడు. బాలిక అతడి ప్రేమను నిరాకరించడంతో ఆమె ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేశాడు. తనతో గడపాలని, లేకపోతే ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్లో పెడతానని బ్లాక్ మెయిల్ చేశాడు. భయపడిన బాలికపై బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. వీరిద్దరూ ఏకాంతంగా గడుపుతున్నప్పుడు మరో విద్యార్థి సీక్రెట్‌గా ఫోన్లో వీడియో తీశాడు. తనతో గడపాలని లేకపోతే నీ ప్రైవేట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని మరో విద్యార్థి బాలికను వేధించాడు.
సెల్‌ఫోన్ పగలగొట్టిన బాలిక
ఇప్పటికే ప్రేమ పేరుతో వేధింపులు ఎదుర్కొంటున్న బాలికకు మరో క్లాస్మేట్ వీడియో ఉందని చూపించడంతో ఆందోళనకు గురైంది. అతడి సెల్ ఫోన్ తీసుకొని నేలకేసి కొట్టింది. తన జోలికి రావొద్దని అతడికి చెప్పింది. ఇదంతా గమనించిన అదే క్లాస్ కు చెందిన మరో విద్యార్థి వీడియో తన వద్ద కూడా ఉందని బ్లాక్ మెయిల్ చేశాడు. తనతో గడపకపోతే అందరికీ చూపిస్తానని, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించి లొంగదీసుకున్నాడు.
గత కొంతకాలం నుంచి ఈ ముగ్గురు క్లాస్మేట్స్ ఆ బాలికను లైంగికంగా వేధిస్తున్నారు. విషయం గమనించిన బాలిక స్నేహితులు ఆమె ఎందుకు ఆందోళన గురవుతుంతో తెలుసుకున్నారు. బాధిత బాలిక ఇంటికి వెళ్లి మొత్తం విషయం చెప్పారు. బాలిక తల్లిదండ్రులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలం నుంచి అదే తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులు తన కుమార్తెను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు పేర్కొన్నారు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాలికను వేధించిన ముగ్గురు మైనర్ బాలురను అదుపులోకి తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు వారిని రిమాండ్ కు తరలించారు. ఈ విషయం హైదరాబాదులో కలకలం రేపుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

