Crime News: విద్యార్థుల గొడవ, బాలికను రెండవ అంతస్తు నుంచి కిందకు తోసేసిన తోటి విద్యార్థి

Tirupati Crime News | తిరుపతి: కాలేజీ విద్యార్థులే కాదు స్కూలు విద్యార్థులు సైతం వింతగా ప్రవర్తిస్తున్నారు. దురుసుగా ప్రవర్తిస్తూ టీచర్లపైకి దూసుకెళ్లి దాడులు చేసేవారు కొందరు. తోటి విద్యార్థులపై దాడులు చేస్తూ కేసుల్లో ఇరుక్కుంటున్నారు కొందరు. తిరుపతిలో విద్యార్థుల మధ్య జరిగిన స్వల్ప వివాదం పెరిగి పెద్దదైంది. ఈ క్రమంలో తోటి విద్యార్థినిని ఏకంగా రెండో అంతస్తు నుంచి తోసేయడంతో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తిరుపతిలోని శ్రీ చైతన్య టెక్నో స్కూలులో జరిగింది.
అసలేం జరిగిందంటే..
తిరుపతిలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో దారుణం జరిగింది. విద్యార్థుల మధ్య ఏదో విషయంపై గొడవ జరిగింది. ఈ క్రమంలో ఓ విద్యార్థిని తోటి విద్యార్థినిని స్కూల్ బిల్డింగ్ రెండవ అంతస్తు నుంచి కిందకు తోసేసింది. కింద పడిన 14 సంవత్సరాల బాలికకు తీవ్ర గాయాలు కాగా, స్కూల్ యాజమాన్యం బాధిత విద్యార్థిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి సీక్రెట్‌గా వైద్య చికిత్స అందిస్తోందని సమాచారం. ఈ ఘటన గురించి తెలుసుకున్న తిరుపతి అర్బన్ తహసీల్దార్ ఆసుపత్రికి చేరుకుని విచారణ వ్యక్తం చేశారు. అసలేం జరిగింది, గొడవకు కారణంపై పోలీసులను ఆరా తీశారు. తిరుపతి ఈస్ట్ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. బాధితురాల్ని పాడిపేటకు చెందిన 9వ తరగతి విద్యార్థి స్నేహ అని తెలిపారు. ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు, వివాదానికి కారణం ఏంటన్న పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గత ఏడాది డిసెంబర్‌లో టీచర్ మృతి
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ జడ్పీ ఉన్నత పాఠశాలలో గత ఏడాది డిసెంబర్ నెలలో విషాదం చోటుచేసుకుంది. ప్రవర్తన సరిగ్గా లేదని, మంచి దారిలో వెళ్లాలని తమకు క్లాస్ పీకాడని.. విద్యార్థులు ఆయన మీదకు ఎదురు తిరగడంతో ఉపాధ్యాయుడు మృతి చెందడం కలకలం రేపింది. సత్ప్రవర్తనతో మెలగాలని సూచిస్తే టీచర్ ప్రాణాలు పోవడానికి విద్యార్థులు కారణం కావడం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

