By: Arun Kumar Veera | Updated at : 16 Mar 2025 09:38 AM (IST)
మ్యూచువల్ ఫండ్స్ రకాలు ( Image Source : Other )
Highest Return On Mutual Funds: మార్కెట్లో చాలా రకాల మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, వాల్యూ ఫండ్స్ వంటివి వాటిలో కొన్ని. ఒక పెట్టుబడిదారుడి ముందు ఇన్ని ఆప్షన్స్ కనిపిస్తుంటే, అతను దేనిని ఎంచుకోవాలి?. ఈ మ్యూచువల్ ఫండ్ల గురించి వివరంగా తెలుసుకుంటే, ఏ ఫండ్‌లో పెట్టుబడి సురక్షితమో సులభంగా అర్ధం చేసుకోవచ్చు.
లార్జ్ క్యాప్ ఫండ్స్
పేరుకు తగ్గట్లుగా ఈ ఫండ్ పెద్ద కంపెనీల కోసం ఉద్దేశించినది. లార్జ్ క్యాప్ కేటగిరీలో దేశంలోని టాప్ 100 కంపెనీలు ఉన్నాయి, వాటి మార్కెట్ క్యాప్ అత్యధికంగా ఉంటుంది. లార్జ్ క్యాప్ ఫండ్లను బ్లూ చిప్ స్టాక్స్ అని కూడా అంటారు. లార్జ్ క్యాప్‌లో పెట్టుబడి పెట్టడం అంటే దేశంలోని టాప్ 100 కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టడమే. మార్కెట్‌లో వచ్చే హెచ్చుతగ్గులకు స్టాక్స్ స్మాల్ & మిడ్ క్యాప్ కంపెనీలు ప్రభావితమైనంతగా లార్జ్ క్యాప్ స్టాక్స్ ప్రభావితం కావు. లార్డ్ క్యాప్ కావడం వల్ల మార్కెట్లో వాటికి పట్టు బలంగా ఉంటుంది, వృద్ధి కూడా సమతుల్యంగా ఉంటుంది. మార్కెట్ దిద్దుబాటు సమయంలో వీటిలో పెద్దగా అస్థిరత ఉండదు. కొత్త పెట్టుబడిదారులు లేదా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని పెట్టుబడిదారులు లార్జ్ క్యాప్స్‌లో పెట్టుబడి పెట్టమని నిపుణులు సలహా ఇస్తారు.
మిడ్ క్యాప్ ఫండ్స్
మార్కెట్ క్యాప్ ఆధారంగా 101 నుంచి 250 వరకు ర్యాంకింగ్ ఉన్న కంపెనీలు మిడ్ క్యాప్ ఫండ్స్‌లోకి వస్తాయి. ఈ కంపెనీలు మార్కెట్లో మధ్యస్థ స్థానంలో ఉన్నాయి. ఈ ఫండ్లలో పెట్టుబడి పెడితే మంచి రాబడిని పొందవచ్చు. కానీ మిడ్ క్యాప్ ఫండ్ లార్జ్ క్యాప్ కంటే ఎక్కువ రిస్క్ కలిగి ఉంటుంది & అదే సమయంలో స్మాల్ క్యాప్ కంటే తక్కువ రిస్క్ కలిగి ఉంటుంది. రిస్క్ - రిటర్న్ మధ్య సమతుల్యతను సృష్టించే ఫండ్‌గా మిడ్ క్యాప్‌ను పరిగణిస్తారు. మిడ్ క్యాప్ కంపెనీలు భవిష్యత్తులో లార్జ్ క్యాప్ కంపెనీలుగా మారే అవకాశం ఉంది.
స్మాల్ క్యాప్ ఫండ్స్
స్మాల్ క్యాప్‌లో 250 కంటే ఎక్కువ ర్యాంకింగ్ ఉన్న కంపెనీలు ఉన్నాయి, ఈ కంపెనీలు మిడ్ క్యాప్‌గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కంపెనీల వృద్ధి రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ, ఈ కంపెనీలు మార్కెట్ హెచ్చుతగ్గులకు చాలా త్వరగా స్పందిస్తాయి, అందువల్ల వాటిలో ఎక్కువ అస్థిరత ఉంటుంది. స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది. ఎక్కువ రిస్క్ తీసుకుని ఎక్కువ డబ్బు సంపాదించాలనుకునే వారు ఈ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చని నిపుణులు చెబుతారు.
ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్
తక్కువ రిస్క్ & మెరుగైన రాబడికి పేరుగాంచిన ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఒక ఓపెన్-ఎండ్ ఫండ్. ఈ ఫండ్‌లో, ఏ కేటగిరీలో ఎంత పెట్టుబడి పెట్టాలో ఫండ్ మేనేజర్ తప్పనిసరిగా నిర్ణయించాల్సిన అవసరం లేదు. ఫండ్ మేనేజర్, మార్కెట్ పరిస్థితులు & అప్పటి అవసరాన్ని బట్టి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ లేదా స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడి పెడతాడు. ఈ ఫండ్ ద్వారా పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచవచ్చు. ఈ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి మార్కెట్ గురించి మంచి అవగాహన కలిగి ఉండటం అవసరం. నిపుణుల సాయంతో పెట్టుబడిదారులు వీటిలో పెట్టుబడి పెట్టవచ్చు.
వాల్యూ ఫండ్స్
సాధారణ విలువ కంటే తక్కువ విలువతో దొరుకుతున్న స్టాక్స్‌తో కూడిన ఫండ్లను వాల్యూ ఫండ్స్ అంటారు. వీటిలోని స్టాక్ ధరలు మార్కెట్ పరిస్థితులు లేదా ప్రతికూల సెంటిమెంట్‌లపై ఆధారపడి ఉంటాయి. ఈ ఫండ్స్ ఫోలియోలో ఉండే స్టాక్స్ భవిష్యత్తులో వాటి అసలు విలువను తిరిగి పొందే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి, పెట్టుబడిదారులకు మంచి రాబడిని అందిస్తాయి. దీర్ఘకాలంలో అధిక రాబడిని కోరుకునే వారికి వాల్యూ ఫండ్లు ప్రయోజనకరంగా ఉంటాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Today Gold and Silver Prices: నేడు బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో చూడండి! 10 గ్రాముల పసిడి కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది?
PF Salary Limit: పీఎఫ్ జీతాల పరిమితి 25-30 వేలకు పెంచే యోచనలో ప్రభుత్వం! దీని వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం?
World Cheapest Silver Price: ప్రపంచంలో అత్యంత చౌకగా వెండి లభించే దేశం ఏదీ? భారత్ కంటే 40 వేల రూపాయల వరకు తక్కువ!
Gold and Silver Prices: నేటి బంగారం ధర: బంగారం, వెండి ధరలు తగ్గాయి, జనవరి 8న బంగారం ఎంత చౌకగా వచ్చిందో తెలుసుకోండి
YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే
Teeth Enamel: దంతాల ఎనామిల్ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?
Beer Bottle Colors : బీరు సీసా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయి? కారణం ఇదే
Simple Ways to Keep Rats Away : ఇంట్లో ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయా? Ratsని తరిమేసే ఇంటి చిట్కాలు ఇవే
Adilabad Murder Case: ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం