Kidney Health : కిడ్నీల ఆరోగ్యాన్ని నాశనం చేసే ఫుడ్స్ ఇవే.. మరి ఏవి తింటే మూత్రపిండాలు సేఫ్‌గా ఉంటాయో తెలుసా?
Healthy Food for Kidney : మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. అలాగే కిడ్నీల ఆరోగ్యానికి కూడా కొన్ని ఫుడ్స్ మేలు చేస్తే.. మరికొన్ని వాటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అవి ఏంటంటే..

Best Foods for Kidney Disease : కిడ్నీలు మంచి కండీషన్లో లేకుంటే శరీరంలో టాక్సిన్లు పేరుకుపోయి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే కిడ్నీలను కాపాడుకోవడానికి హెల్తీ లైఫ్‌స్టైల్‌తో పాటు హెల్తీ ఫుడ్‌ని కూడా డైట్లో చేర్చుకోవాలి. అలా మూత్రపిండాల సమస్యలను పెంచే కొన్ని ఫుడ్స్‌ని డైట్ నుంచి తీసేయాలి. ఇంతకీ కిడ్నీల ఆరోగ్యం కోసం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి. వేటిని తినకూడదో ఇప్పుడు చూసేద్దాం.
హెల్తీ ఫుడ్స్
కొన్నిరకాల ఫుడ్స్ సహజమైన క్లెన్సర్లుగా పనిచేస్తాయి. అందుకే కిడ్నీల ఆరోగ్యం కోసం వాటిని డైట్లో తీసుకోవాలి. ఉసిరికాయ, లెట్యూస్, కాలీఫ్లవర్, కీరదోస, పాలకూర, మెంతికూర వంటి వాటిలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరానికి అంది.. వాపును కంట్రోల్ చేయడంలో, రక్తంలోని చక్కెర నిల్వలను నియంత్రించడానికి హెల్ప్ అవుతాయి. అలాగే కిడ్నీల ఆరోగ్యాన్ని పాడు చేసే సోడియం కూడా వీటిలో తక్కువగా ఉంటుంది.
క్యారెట్లు, చిలగడదుంపలు, అల్లం, పసుపు వంటివి కూడా రోగనిరోధక శక్తిని అందిస్తాయి. శరీరాన్ని బలంగా చేయడంతో పాటు.. మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దుంపలలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కిడ్నీల పనితీరును మెరుగుపరిచే పోషకాలు ఉంటాయి. కేవలం కూరగాయలే కాదు.. కొన్నిరకాల పండ్లు కూడా మూత్రపిండాలకు మేలు చేస్తాయి.
ఈ పండ్లు బెస్ట్
దానిమ్మ, యాపిల్, బెర్రీలు, సిట్రస్ పండ్లలలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ సితో నిండి ఉంటాయి. దానిమ్మల్లోని ఫోలేట్, పొటాషియం, విటమిన్ కెతో నిండి ఉండి కిడ్నీల్లో వాపును తగ్గిస్తాయి. ఇతర సమస్యలను కూడా దూరం చేస్తాయి. నట్స్, సీడ్స్ గుండె ఆరోగ్యానికే కాకుండా కిడ్నీల ఆరోగ్యానికి మంచివి. పుదీనా, తులసి వంటివి కిడ్నీలపై ఒత్తిడిని తగ్గిస్తాయి.
హెల్తీ ఫ్యాట్స్
అవకాడో, ఆలివ్‌నూనె, నెయ్యి వంటివాటిలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ధాన్యాలు, బీన్స్ ద్వారా ప్రోటీన్ లభిస్తుంది. కొబ్బరి నీరు ఎలక్ట్రోలైట్లను అందించడంతో పాటు హైడ్రేషన్‌ని అందిస్తుంది. నీరు సమృద్ధిగా తీసుకుంటే టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి.
వీటిని తినకపోవడమే మంచిది..
కిడ్నీ సమస్యలను దూరం చేసుకోవడానికి, అసలు రాకుండా ఉండేందుకు కొన్ని ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. సోడియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినకూడదు. సెరల్స్, ఇన్స్టాంట్ సూప్స్, జంక్‌ఫుడ్ తినకూడదు. ఇవి బీపీని పెంచి కిడ్నీలపై ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. ప్రాసెస్ చేసిన మీట్, సోడాలు బోన్స్ని వీక్ చేయడంతో పాటు గుండె సమస్యలకు దారితీస్తాయి. కిడ్నీ సమస్యలను మరింత పెంచుతాయి. షుగర్ ఫుడ్స్‌కి కూడా వీలైనంత దూరంగా ఉండాలంటున్నారు.
కిడ్నీ సమస్యలు రాకూడదన్నా.. వచ్చిన వాటిని దూరం చేసుకోవాలన్నా ఈ ఫుడ్స్‌ని డైట్లో చేర్చుకుని.. తినకూడని ఫుడ్స్‌కి బాయ్ చెప్పాలి. అలాగే రెగ్యులర్‌గా వ్యాయామం, మెరుగైన నిద్ర.. హెల్తీ లైఫ్‌స్టైల్‌ని లీడ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

