కిడ్నీ ఆరోగ్యానికి ఈ ఫుడ్స్ చాలా మంచివట
కిడ్నీలు శరీరంలోని వ్యర్థాలను, విషాన్ని ఫిల్టర్ చేసి.. మూత్ర రూపంలో వాటిని బయటకు పంపిస్తాయి.
కిడ్నీలు సరిగ్గా పని చేయకుంటే ఈ వ్యర్థాలు శరీరంలో పేరుకుపోయి ఆరోగ్య సమస్యల్ని కలిగిస్తాయి. అంతేకాకుండా శరీరంలోని ద్రవం సమతుల్యమవదు.
అందుకే కొన్ని ఫుడ్స్ని రెగ్యూలర్గా తమ డైట్లో చేర్చుకోవాలంటున్నారు. వీటివల్ల కిడ్నీలు డీటాక్స్ అవుతాయి. పని తీరు మెరుగవుతుంది. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటంటే..
యాపిల్స్ రోజూ తింటే ఆరోగ్యానికి చాలామంచిది. ముఖ్యంగా కిడ్నీల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనిలోని ఫైబర్, ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కిడ్నీలను డీటాక్స్ చేస్తాయి. హెల్తీగా ఉంచుతాయి.
వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు, యాసిడ్ లక్షాలు కిడ్నీలను డీటాక్స్ చేస్తాయి. లోపలి నుంచి వాటిని క్లెన్స్ చేస్తాయి.
నిమ్మకాయలు రెగ్యూలర్గా తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంతేకాకుండా దీనిలోని సిట్రిక్ యాసిడ్.. కిడ్నీ స్టోన్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. కిడ్నీలను డీటాక్సిఫై చేస్తుంది.
అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కిడ్నీ ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి శరీరంతో పాటు కిడ్నీలను డిటాక్సిఫై చేస్తాయి.
పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కిడ్నీల ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి లోపలని నుంచి కిడ్నీలను డీటాక్సిఫై చేసి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
కీర దోసల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరంలోని టాక్సిన్లను బయటకి పంపిస్తాయి. అలాగే కిడ్నీలను కూడా డీటాక్స్ చేసి హెల్తీగా ఉంచుతాయి.
ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు పాటిస్తే మంచి ఫలితాలుంటాయి. (Imgaes Source : Envato)