చాలా మంది కాస్త జ్వరం అనిపిస్తే పారాసిటమాల్ వేసుకుంటారు.
కొంచెం బాడీ పెయిన్స్ ఏర్పడినా పారసిటమాల్ తీసుకుంటారు.
అదే పనిగా పారాసిటమాల్ వాడితే తీవ్ర ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు.
పారాసిటమాట్ బాడీలోని కీలక అవయవాలను డ్యామేజ్ చేసే అవకాశం ఉందంటున్నారు.
పారాసిటమాల్ అధికంగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుందన్నారు.
కాలేయంతో పాటు కిడ్నీల పైనా తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.
దీర్ఘకాలిక నొప్పులతో బాధపడేవారు రోజుకు 4 గ్రామలకు మించి పారాసిటమాల్ తీసుకోవద్దంటున్నారు.
మోతాదుకు మించి పారాసిటమాల్ తీసుకోవడం వల్ల లేని అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com