బొప్పాయిని వర్షాకాలంలో తింటే కలిగే ప్రయోజనాలివే
బొప్పాయి మంచి రుచిని అందించడమే కాకుండా ఆరోగ్యానికి ఎన్ని బెనిఫిట్స్ అందిస్తుంది.
దీనిలో విటమిన్స్ ఏ, సి, ఈ పుష్కలంగా ఉంటాయి. అందానికి, ఆరోగ్యానికి ప్రయోజనాలు అందిస్తాయి.
ఈ విటమిన్స్ హెల్తీ స్కిన్‌ని ప్రమోట్ చేయడమే కాకుండా.. కంటిచూపును మెరుగుపరుస్తాయి.
ఇమ్యూనిటీని పెంచి.. సీజనల్ వ్యాధులను దూరం చేస్తాయి. దగ్గు, జలుబు, ఫ్లూ, ఫీవర్ వంటివి కంట్రోల్ అవుతాయి.
వర్షాకాలంలో వచ్చే జీర్ణ సమస్యలను ఇది దూరం చేస్తుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం తగ్గుతాయి.
హెల్తీ, గ్లోయింగ్ స్కిన్ కోసం బొప్పాయిని తినొచ్చు. ప్యాక్ వేసుకోవచ్చు. ముడతలను కూడా ఇది దూరం చేస్తుంది.
బొప్పాయిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థ్రరైటిస్ వంటి సమస్యలను తగ్గేలా చేస్తాయి.
దీనిని సలాడ్స్‌గా లేదా నేరుగా మీ డైట్లో చేర్చుకుని తినొచ్చు.
ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణులు సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Enavto)