అన్వేషించండి

Inflation in India: 7 నెలల కనిష్టానికి చిల్లర ద్రవ్యోల్బణం, దేశంలో వడ్డీ రేట్లు మరింత తగ్గొచ్చు!

Retail Inflation Rate: 2023 మే నెల తర్వాత, 2025 ఫిబ్రవరిలో ఆహార ద్రవ్యోల్బణం అత్యల్ప స్థాయికి చేరుకుంది. 2025 జనవరి నెలతో పోల్చినా ఇది 222 బేసిస్ పాయింట్లు తక్కువ.

Retail Inflation In India In February 2025: హోలీ, ఉగాది, రంజాన్‌ పండుగల సమయంలో దేశ ప్రజలకు పెద్ద శుభవార్త. గత నెల (2025 ఫిబ్రవరి‌)లో, భారతదేశ రిటైల్ ఇన్‌ఫ్లేషన్‌ రేటు 7 నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారంగా లెక్కించే చిల్లర ద్రవ్యోల్బణం రేటు (CPI Inflation Rate) ఫిబ్రవరిలో 3.61 శాతంగా నమోదైంది. ఇది జనవరి కంటే 0.65 శాతం తక్కువ. గత ఏడాది జులైలో నమోదైన 3.54 శాతం తర్వాత, ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైన సంఖ్యే అత్యల్పం.  దేశంలో ద్రవ్యోల్భణం ఏడు నెలల కనిష్ట స్థాయికి దిగి రావడానికి ప్రధాన కారణం ఆహార ధరలు తగ్గడం. నెల క్రితం, 2025 జనవరిలో రిటైల్‌ ఇన్‌ఫ్లేషన్‌ 4.26 శాతంగా ఉండగా; ఏడాది క్రితం, 2024 ఫిబ్రవరిలో ఇది 5.09 శాతంగా ఉంది. 

ఆహార ద్రవ్యోల్బణం తగ్గుదల

2025 ఫిబ్రవరిలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం  (Food Inflation) 3.75 శాతానికి తగ్గింది. ఈ ఏడాది జనవరిలోని 5.53 శాతంతో పోలిస్తే ఇప్పుడు ఏకంగా 222 బేసిస్‌ పాయింట్లు తగ్గడం విశేషం. 2023 మే నెల తర్వాత, మళ్లీ 2025 ఫిబ్రవరిలో ఇది అత్యల్ప స్థాయికి చేరుకుంది. ఫిబ్రవరిలో కూరగాయలు, గుడ్లు, మాంసం, చేపలు, పప్పుధాన్యాలు, పాలు, పాల ఉత్పత్తుల ధరలు తగ్గడం ఈ తగ్గుదలలో ముఖ్యమైన పాత్ర పోషించింది.

2024 ఫిబ్రవరితో పోలిస్తే 2025 ఫిబ్రవరిలో అత్యధికంగా తగ్గిన ఆహార ఉత్పత్తులు - అల్లం (-35.81%), జీలకర్ర (-28.77%), టమోటా (-28.51%), కాలీఫ్లవర్ (-21.19%), వెల్లుల్లి (-20.32%).

గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంధన ధరల్లోనూ ఉపశమనం లభించింది, ఇంటి బడ్జెట్లపై ఒత్తిడి తగ్గింది. ఇంధన ద్రవ్యోల్బణం రేటు 1.33 శాతం తగ్గింది.

2024 ఫిబ్రవరితో పోలిస్తే 2025 ఫిబ్రవరిలో కొన్ని ధరలు పెరిగాయి. అవి - కొబ్బరి నూనె (+54.48%), కొబ్బరి (+41.61%), ఉల్లిపాయలు (+30.42%), పసిడి (35.56%), వెండి (+30.89%).

ప్రాంతాల వారీగా ద్రవ్యోల్బణం గణాంకాలు

పట్టణ ప్రాంత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 3.32 శాతానికి దిగి వచ్చింది, ఇది జనవరిలో 3.87 శాతంగా ఉంది.
ఫిబ్రవరిలో, గ్రామీణ ప్రాంత ద్రవ్యోల్బణం 3.79 శాతానికి పరిమితమైంది, జనవరిలో ఇది 4.59 శాతంగా నమోదైంది.
రాష్ట్రాల వారీగా చూస్తే - ఫిబ్రవరిలో, కేరళలో అత్యధికంగా 7.31 శాతంగా ఉంటే, తెలంగాణలో అత్యల్పంగా 1.31 శాతంగా నమోదైంది.

ఆర్‌బీఐకి కూడా ఇది శుభవార్తే

రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతూ ఆర్‌బీఐ లక్ష్యమైన 4 శాతం కంటే తక్కువగా నమోదు కావడం ఉండటంతో కేంద్ర బ్యాంక్‌పై ఒత్తిడి తగ్గినట్లైంది. ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడానికి & ఉపాధిని పెంచడానికి వడ్డీ రేట్లను (RBI Repo Rate) మరింత తగ్గించే నిర్ణయం తీసుకోవడానికి RBIకి స్వేచ్ఛ దొరికింది. గత నెలలో జరిగిన ద్రవ్య విధాన సమీక్షలో (RBI MPC), ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పాలసీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. దీంతో, రెపో రేటు 6.25 శాతానికి దిగి వచ్చింది. ద్రవ్యోల్బణాన్ని గమనిస్తూనే వృద్ధికి మద్దతు ఇచ్చే 'తటస్థ వైఖరి'ని కొనసాగించాలని ఆ భేటీలో MPC నిర్ణయించింది. దీని అర్థం ద్రవ్యోల్బణం రేటు మరింత తగ్గితే, పాలసీ రేట్లను ఆర్‌బీఐ మరింత తగ్గించగలదు, ఇది ఆర్థిక వ్యవస్థలో వేగం పెంచుతుంది.

ద్రవ్యోల్బణం రేటు తగ్గడం సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించడమే కాకుండా, పెట్టుబడి & వినియోగదారుల వ్యయం పెరగడానికి కూడా దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతం.

టాప్ హెడ్ లైన్స్

15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Embed widget