Blockbuster Utsavam Promo: కుక్కర్ గొడవ నుంచి యష్మి - నిఖిల్ - గౌతమ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వరకు... శ్రీముఖి ట్రోలింగ్ మామూలుగా లేదుగా
Blockbuster Utsavam Promo : 'బిగ్ బాస్ 8'లో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరూ మరోసారి 'బీబీ ఉత్సవం'లో సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది.

గత ఏడాది పూర్తయిన 'బిగ్ బాస్ సీజన్ 8' విన్నర్ గా నిఖిల్ నిలిచిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 15న జరిగిన గ్రాండ్ ఫినాలే ఈవెంట్ లో నిఖిల్ విజేతగా నిలవగా, గౌతమ్ కృష్ణ రన్నరప్ గా నిలిచారు. తాజాగా బుల్లితెర షో 'బీబీ ఉత్సవం' వేదికపై వీళ్లంతా మరోసారి కలిశారు. బిగ్ బాస్ హౌస్ లో ముందుగా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ తో పాటు వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కూడా తాజాగా ఈ షోలో మరోసారి కలిశారు.
'బీబీ ఉత్సవం' లేటెస్ట్ ప్రోమో
"బిగ్ బాస్ షోలో మీరు చూసిన 106 రోజుల ఎంటర్టైన్మెంట్ ని ఒక్కసారి చూస్తే ఎలా ఉంటుందో, ఈ బీబీ ఉత్సవం కూడా అలాగే ఉండబోతోంది" అంటూ 'బీబీ ఉత్సవం' షోని మొదలు పెట్టింది యాంకర్ శ్రీముఖి. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా, అందులో ముందుగా 22 మంది బిగ్ బాస్ కంటెస్టల్లో ను వేదికపైకి ఆహ్వానించింది. మొదట్లోనే "విన్నర్ తో మాట్లాడిన తర్వాత నేను రన్నర్ తో మాట్లాడాలి అనుకుంటున్నాను" అంటూ శ్రీముఖి అడగ్గా... "థాంక్యూ" అంటూ ముక్కు అవినాష్ మైక్ తీసుకుని సందడి చేయడం మొదలుపెట్టారు. దీంతో శ్రీముఖి "నేను రన్నర్ అన్నాను" అంటూ డైలాగ్ వేయడంతో మైక్ ని తీసి గౌతమ్ కృష్ణకి ఇచ్చాడు.
"నేను బిగ్ బాస్ హౌస్ లో ఫైనాలిస్ట్ అయ్యింది కేవలం నీవల్లే అంటూ నబీల్ కి తను తీసుకొచ్చిన గిఫ్ట్ ఇచ్చాడు అవినాష్. అంతలోనే ఎవిక్షన్ షీల్డ్ వల్ల ఆ వీక్ ఉన్నావు. దానివల్ల నీకు వచ్చిన పారితోషకం ఇంత, నువ్వు తెచ్చిన గిఫ్ట్ ఇంత" అంటూ పంచ్ వేసింది విష్ణు. కానీ అవినాష్ వదులుతాడా ? "థాంక్యూ, అది కట్ చేయండి" అని చెప్పి అందరూ మొహాల్లో నవ్వులు పూయించాడు.
ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు విష్ణు ప్రియ- పృథ్వి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. పృథ్వీ తనకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదని ఎన్నిసార్లు చెప్పినా, విష్ణు చివరిదాకా పట్టు వదలలేదు. మరోసారి బీబీ ఉత్సవంలో వీరిద్దరూ కలిసి ఒకే చోట కూర్చోవడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అలాగే నిఖిల్, గౌతమ్ లతో రోహిణి చేసిన ఫన్నీ ఫ్లర్టింగ్, ఇంకా బిగ్ బాస్ హౌస్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపిన యష్మి, గౌడ, నిఖిల్ 'బ్లాక్ బస్టర్ ఉత్సవం' వేదికపై సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయ్యారు. అలాగే షోలో జరిగిన గొడవలపై తాజా ఎపిసోడ్లో ఫన్నీగా రోస్టింగ్ చేశారు. కుక్కర్ నుంచి మొదలు పెడితే బిగ్ బాస్ సీజన్ ముగిసే వరకు జరిగిన అన్ని గొడవలను ఈ షోలో హైలెట్ చేశారు.
అనిల్ రావిపూడి, సందీప్ కిషన్ 'మజాకా'
అనిల్ రావిపూడి, సందీప్ కిషన్ ఈ షోకి గెస్ట్ లుగా విచ్చేశారు. 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ సక్సెస్ సందర్భంగా అనిల్ రావిపూడి 'బీబీ ఉత్సవం'లో ముఖ్య అతిథిగా విచ్చేసి, తనదైన శైలిలో బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఆట ఆడుకున్నారు. ఇక 'మజాకా' మూవీ ప్రమోషన్లలో సందర్భంగా సందీప్ కిషన్, ;లైలా' ప్రమోషన్ల కోసం విశ్వక్ సేన్ 'బీబీ ఉత్సవం' లేటెస్ట్ ఎపిసోడ్లో దర్శనమిచ్చారు. చివరగా గంగవ్వ ఇచ్చిన విందు భోజనం, ఆ తర్వాత 'బిగ్ బాస్' షోలో తన ప్రవర్తనకు క్షమించమని ఒకరినొకరు అడగడం, అందరూ మళ్ళీ కలిసిపోవడంతో ప్రోమో ముగిసింది.
Also Read: 'ఛావా' రివ్యూ: శివాజీ తనయుడు శంభాజీ సింహగర్జన... దేశభక్తులకు పూనకాలే, మరి ప్రేక్షకులకు?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

