Ramam Raghavam Trailer: తండ్రీ కొడుకుల మధ్య వివాదం అను'బంధం'గా మారేనా! - ఏడ్పించేసిన కమెడియన్ ధన్‌రాజ్, 'రామం రాఘవం' ట్రైలర్ రిలీజ్
Dhanraj Movie: ఓ మిడిల్ క్లాస్ ఫాదర్, మిడిల్ క్లాస్ కొడుకు మధ్య సంఘర్షణ ప్రధానాంశంగా తెరకెక్కింది 'రామం రాఘవం'. కమెడియన్ ధన్ రాజ్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ట్రైలర్‌ను హీరో నాని రిలీజ్ చేశారు.

Ramam Raghavam Trailer Released By Hero Nani: జబర్దస్త్ కమెడియన్ ధన్ రాజ్ (Dhan Raj) స్వీయ దర్శకత్వంలో ప్రముఖ దర్శకుడు సముద్రఖని కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'రామం రాఘవం' (Ramam Raghavam). ఈ సినిమాలో ధన్ రాజ్, సముద్రఖని (Samuthirakani) తండ్రీకొడుకులుగా నటించారు. ఈ మూవీ ట్రైలర్‌ను ప్రముఖ హీరో నాని రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. కొడుకు గొప్పగా సెటిలై మంచి పేరు తెచ్చుకోవాలనుకుని ఆశించే ఓ తండ్రి.. తండ్రిని అర్థం చేసుకోకుండా అప్పులు చేసుకుంటూ తిరిగే ఓ కొడుకు. ఇద్దరి మధ్య జరిగే సంఘర్షణ.
కొడుకు మంచిగా సెటిల్ కాకుంటే.. ప్రతీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ప్రతి రోజూ జరిగే తండ్రీ కొడుకుల వార్.. కొడుకు వేస్ట్ అంటూ చెప్పే తండ్రి.. తండ్రి తనను అర్థం చేసుకోవడం లేదంటూ కోప్పడే కొడుకు. ఇలా ట్రైలర్‌లో ఎమోషన్స్ బాగా పండించారు. మిడిల్ క్లాస్ ఫాదర్‌గా సముద్రఖని, కొడుకుగా ధన్‌రాజ్ ట్రైలర్‌లోనే ఏడ్పించేశారు. తండ్రి మాట వినని కొడుకు.. ఆయన మీద పంతంతో ఏ పనులు చేశాడు.?, కొడుకు కోసం తండ్రి ఏం చేశాడు.?. వీళ్లిద్దరూ మళ్లీ కలిశారా.? అన్నది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకూ ఆగాల్సిందే. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఎమోషన్స్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మూవీ రూపొందించినట్లు తెలుస్తోంది.
Here’s #RamamRaghavam Telugu & Tamil Trailer, looks promising.
— Nani (@NameisNani) February 14, 2025
To khani anna @thondankani and actor turned director @DhanrajOffl and the rest of the team. All the very best.
Telugu ▶️ https://t.co/1tg1rzUcdL
Tamil ▶️ https://t.co/xyVFiSxjFi#RR In theatres on Feb 21st pic.twitter.com/2mZQdn3c5f
'రామం రాఘవం' ట్రైలర్‌ను తన చేతుల మీదుగా విడుదల చేయటం ఆనందంగా ఉందని హీరో నాని అన్నారు. ' ధన్‌రాజ్ టాలెంట్ రేంజ్ ఏంటో నాకు తెలుసు. అందుకే ‘రామం రాఘవం’ సినిమాని దర్శకత్వం వహించాడంటే నాకు పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు. ధన్‌రాజ్ కామెడీ సినిమా తీస్తాడేమో అనుకున్నా. ట్రైలర్ చూపించి ఎమోషనల్ డ్రైవ్‌లోకి తీసుకెళ్లాడు. సముద్రఖని అన్న వర్క్ అంటే వ్యక్తిగతంగా నాకు ఎంతో ఇష్టం. ఆయన నేను ఫ్యామిలీలా ఉంటాం. 21వ తేదీ కోసం ఎదురు చూస్తున్నా.' అని పేర్కొన్నారు. ఫాదర్ – సన్ ఎమోషనల్ డ్రామాలో ఇప్పటివరకు ఎవరు ట్రై చేయని యూనిక్ కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమాను చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నట్లు నటుడు, దర్శకుడు ధన్ రాజ్ అన్నారు.
Also Read: మమ్ముట్టి సినిమాకు అరుదైన గుర్తింపు - ప్రతిష్టాత్మక లండన్ ఫిలిం స్కూల్లో పాఠంగా 'భ్రమయుగం'
ఇక ఇప్పటికే 'రామం రాఘవం' నుంచి విడుదలైన గ్లింప్స్, 'నాన్న' సెంటిమెంట్ సాంగ్ మంచి వ్యూస్ సాధించాయి. ఈ సినిమాను స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ అరిపాక సమర్ఫణలో నిర్మిస్తున్నారు. 'విమానం' దర్శకుడు యానాల శివప్రసాద్ కథ అందించారు. సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, వాసు ఇంటూరి, సత్య, పృథ్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, సునీల్, రాకెట్ రాఘవ, రచ్చ రవి కీలక పాత్రలు పోషించారు. కాగా, తెలుగు కామెడీ షో 'జబర్దస్త్'లో కమెడియన్‌గా ధన్‌రాజ్ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలాగే, టాప్ హీరోల సరసన ముఖ్య పాత్రలు పోషించారు. పిల్ల జమిందార్ సినిమాలో నటుడు నానికి స్నేహితుడిగా నటించి మెప్పించారు. ఇన్నాళ్లు తన నటనతో ఎంటర్‌టైన్ చేసిన ధన్ రాజ్.. 'రామం రాఘవం'లో తన దర్శకత్వంతో మెప్పించేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 21న సినిమా థియేటర్లలోకి రానుంది.
Also Read: 'తండేల్' టీం జోష్ మామూలుగా లేదుగా! - సాయిపల్లవితో అల్లు అరవింద్ డ్యాన్స్ అదుర్స్, వైరల్ వీడియో
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

