Kidney Damage : ఉదయాన్నే ముఖం ఉబ్బినట్టు కనిపిస్తోందా? అయితే కిడ్నీ సమస్యలు కావొచ్చు, ఇవి కూడా దాని లక్షణాలే
Kidney Issues Symptoms : మీ డైలీ రొటీన్లో ఉదయాన్నే కొన్ని లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. అవి కిడ్నీ సమస్యలకు సంకేతాలని హెచ్చరిస్తున్నారు.

Kidney Failure Signs : శరీరంలో మూత్రపిండాలు అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. ఇవి శరీరంలో pH స్థాయిలను, సోడియం, పొటాషియం వంటివాటితో పాటు మరిన్నెంటినో నియంత్రించడానికి హెల్ప్ చేస్తాయి. రక్తంలోని టాక్సిన్లను వడపోసి.. శుభ్రం చేస్తాయి. రక్తంలో ఎక్కువున్న నీటిని, టాక్సిన్లను వడకట్టి బయటకు పంపిస్తాయి. అందుకే వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతేకాకుండా కొన్ని లక్షణాలు గుర్తిస్తే వెంటనే వైద్యుల సహాయం తీసుకోవాలి.
కిడ్నీలపై వివిధ వ్యాధులు, జీవనశైలి అలవాట్లు, జన్యుపరమైన కారణాలు వాటి పనితీరును నెగిటివ్‌గా ప్రభావితం చేస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటు ఉంటే కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే కిడ్నీలో మార్పులను, వ్యాధులు వచ్చే ముందు కొన్ని సూచనలను శరీరం ఇస్తుందట. ఉదయాన్నే కొన్ని సంకేతాల రూపంలో చూపిస్తుందట. వాటిని గుర్తిస్తే వెంటనే వైద్యుల సహాయం తీసుకుని సమస్యను దూరం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ సమస్యలేంటి?
మూత్రంలో మార్పులు
మూత్రంలో మార్పులు కూడా కిడ్నీ సమస్యలను సూచిస్తాయి. ఉదయాన్నే మొదటి మూత్ర విసర్జన (Foamy Urine) చిన్న చిన్న బుడగలు, నురుగుగా ఉంటే అది కిడ్నీ సమస్యలకు సంకేతం. మూత్రపిండాలు రక్తాన్ని సరిగ్గా ఫిల్టర్ చేయకపోవడం వల్ల ప్రోటీన్ అనేది ఇతర భాగాలకు పంపిణీ అవుతుంది. అలా మూత్రంలోకి చేరి ఈ మార్పును సూచిస్తుంది. దీనిని ప్రోటీన్యూరియా అని అంటారు.
ముఖం ఉబ్బడం
ఉదయం నిద్రలేచిన వెంటనే మీ ముఖం ఉబ్బినట్టు, వాపుగా ఉన్నట్లు కనిపిస్తుందా? అయితే మీరు అలెర్ట్ అవ్వాలి. ఇది కిడ్నీల వ్యాధికి సంకేతంగా చెప్తున్నారు. అంటే కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల కూడా ఫేస్ ఉబ్బినట్లు కనిపిస్తుంది. అది ఇది ఒకటి కాకపోవచ్చు. కానీ రెగ్యులర్‌గా ఈ డిఫరెన్స్ కనిపిస్తూ.. ముఖ్యంగా చీలమండలు, పాదాల దగ్గర కూడా వాపు గమనిస్తే కచ్చితంగా వైద్యుల సహాయం తీసుకోవాలి. మూత్రపిండాలు రక్తాన్ని సరిగ్గా ఫిల్టర్ చేయనప్పుడు ఈ పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల ముఖంతో సహా ఇతర శరీరభాగాల్లో వాపు కనిపిస్తుంది.
పొడి చర్మం, దురద
చర్మం పొడిగా మారి, విపరీతంగా దురద పెడుతుంటే అది కిడ్నీ సమస్యలను సూచిస్తుందట. మూత్రపిండాలు టాక్సిన్లు, వ్యర్థాలను ఫిల్టర్ చేయకుండా శరీరంలో పేరుకుపోయే పరిస్థితిని తీసుకువస్తాయి. దీనివల్ల చెమట గ్రంధులు తగ్గి.. నెమ్మదిగా చర్మం పొడిబారేలా చేస్తుందట. ఇది అధిక దురదను కూడా ప్రమోట్ చేస్తుంది. ఎంత హైడ్రేటెడ్‌గా ఉన్నా, కేర్ తీసుకున్న ఈ సమస్య తగ్గదు. దీనిని ఎప్పుడు గుర్తిస్తే అప్పుడు.. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.
తలనొప్పి
వివిధ కారణాలతో మార్నింగ్ తలనొప్పి రావొచ్చు. కానీ రోజూ.. ఉదయాన్నే తలనొప్పి వస్తుందంటే అది కిడ్నీల్లో మార్పులకు సంకేతమే. కిడ్నీలు దెబ్బతినడం వల్ల అధికరక్తపోటు వస్తుంది. ఇది తలనొప్పికి దారితీస్తుంది. అలసట, బలహీనంగా మార్చుతుంది. ఇది రక్తహీనతకు సంకేతం. మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారిలో ఇది కామన్‌గా కనిపిస్తుంది.
నోటి దుర్వాసన
నోటి దుర్వాసన చాలా కారణాలతో వస్తుంది. ముఖ్యంగా ఉదయాన్నే దీనిని కొందరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అయితే ఈ దుర్వాసన ఉదయాన్నే రోజూ వస్తుంటే.. అది కూడా అమ్మోనియా వంటి డిఫరెంట్ వాసనను ఇస్తుంటే వైద్యుడిని కచ్చితంగా సంప్రదించాలి. ఇది మూత్రపిండాలకు సంబంధించిన సంకేతంగా చెప్తున్నారు. టాక్సిన్లు రక్తంలో పేరుకుపోయి.. శ్వాస ద్వారా బయటకు చెడు వాసనకు దారి తీస్తాయట. అలాగే నోటి రుచి కూడా మారిపోతుందట.
ఇవేకాకుండా వాంతులు, కళ్లు తిరగడం వంటి సంకేతం కూడా దానిలోని భాగమే. బీపీ ఉన్నవారిలో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుందట. ఇవన్నీ రోజూ ఉంటే కచ్చితంగా మీ కిడ్నీలు ప్రాబ్లమ్‌లో ఉన్నాయని అర్థమంటున్నారు. వీటిని గుర్తిస్తే వెంటనే వైద్యసహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆలస్యం చేస్తే డయాలిసిస్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది.
Also Read : కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్‌ని డైట్లో చేర్చుకోవాలట
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.






















