Group-3 Results: గ్రూప్-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
TGPSC: తెలంగాణలోగ్రూప్-3 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల మార్కుల జాబితాను కమిషన్ అందుబాటులో ఉంచింది.

TGPSC Group3 Results: తెలంగాణలో 1,365 గ్రూప్-3 సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ మార్చి 14న ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల జనరల్ ర్యాంకు జాబితాను అందుబాటులో ఉంచింది. ఈ ఫలితాల ఆధారంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్, అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
గ్రూప్-3 అభ్యర్థుల మార్కుల వివరాల కోసం క్లిక్ చేయండి..
గ్రూప్-3 మాస్టర్ క్వశ్చన్ పేపర్, ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..
గ్రూప్-3 ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా 5.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి నవంబరు 17, 18 తేదీల్లో రాతపరీక్షలు నిర్వహించారు. మొదటిరోజైన నవంబరు 17న రెండు సెషన్లలో.. అంటే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్‌లో పేపర్-1(జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్), మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు రెండో సెషన్‌లో పేపర్-2(హిస్టరీ, పాలిటీ & సొసైటీ) పరీక్ష నిర్వహిస్తారు. ఇక నవంబరు 18న ఉదయం సెషన్‌లో పేపర్-3(ఎకానమీ & డెవలప్‌మెంట్) పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1401 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 50.24 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మార్చి 10, 11 తేదీల్లో గ్రూప్-1, గ్రూప్-2 రాతపరీక్షల మార్కులను వెల్లడించిన కమిషన్ తాజాగా గ్రూప్-3 ఫలితాలను ప్రకటించింది.
* గ్రూప్-3 పోస్టుల వివరాలు..
పోస్టుల సంఖ్య: 1363
1) జూనియర్ అసిస్టెంట్: 655 పోస్టులు
2) సీనియర్ అకౌంటెంట్: 436 పోస్టులు
3) ఆడిటర్: 126 పోస్టులు
4) సీనియర్ ఆడిటర్: 61 పోస్టులు
5) అసిస్టెంట్ ఆడిటర్: 23 పోస్టులు
6) జూనియర్ అకౌంటెంట్: 61 పోస్టులు
7) అకౌంటెంట్: 01 పోస్టు
ALSO READ:
గ్రూప్-1 ఫలితాల కోసం క్లిక్ చేయండి..





















