Janasena Pithapuram Sabha Arrangements | పిఠాపురంలో భారీ రేంజ్ లో జనసేన సభ | ABP Desam
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో ఎస్బీ వెంచర్స్‌లో మరికొద్ది గంటల్లో ఆవిర్భావ సభ జరగనుంది.. ఈ భారీ సభకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు.. జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సభా ప్రాంగణానికి సుమారు 4 గంటలకు చేరుకుంటారని, ఆయన ప్రసంగం 6 గంటల నుంచి ఉంటుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఏపీ ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారన్న విషయంపై అందరి ఆసక్తి నెలకొంది మరో వైపు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్... ఆవిర్భావ సభ ఏర్పాట్లును దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.. ఈ పరిస్థితుల ల లో పిఠా పురం నియోజకవర్గం చిత్రాడలోని ఎస్బీ వెంచర్స్‌లోని జయ కేతనం సభావేదిక, అక్కడి ఏర్పాట్ల గురించి ఏబీపీ దేశం ప్రతినిధి సుధీర్ గ్రౌండ్ రిపోర్ట్





















