94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
అమెరికా పౌరసత్వం కోసం ప్రపంచమంతా క్యూ కడుతుంటే.. ఒక 94 ఏళ్ల తెలుగు బామ్మ మాత్రం ఆ లగ్జరీని కాలదన్ని, ‘భారతీయురాలిగా చావడమే నా ఆఖరి కోరిక’ అంటూ మాతృభూమికి తిరిగివచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఆమె పేరే కొండ్రగుంట మహాలక్ష్మమ్మ. బాపట్ల జిల్లా చింతగుంపల గ్రామానికి చెందిన ఈమె.. తన భర్త చనిపోయాక, అమెరికాలో అంకాలజిస్ట్‌గా పనిచేస్తున్న కొడుకు వద్దకు వెళ్లింది. జూలై 2000 లో యూఎస్ సిటిజన్‌షిప్ తీసుకుని, దాదాపు 18 ఏళ్లు అక్కడే లగ్జరీ లైఫ్ గడిపింది. కానీ మాతృభూమిపై మమకారంతో 2018 లో మళ్లీ స్వగ్రామానికి వచ్చేసింది.
ఇటీవల ఆమె తన కొడుకుతో కలిసి బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళిని స్వయంగా కలిసింది. “కలెక్టర్ గారు, నా వయసు 95 ఏళ్లకు చేరువవుతోంది.. నా ఆఖరి శ్వాస మన దేశంలోనే విడవాలని, పుట్టిన ఊర్లోనే నా అంతిమ సంస్కారాలు జరగాలని కోరుకుంటున్నాను. నా అమెరికా పౌరసత్వాన్ని కూడా వదిలేశాను, దయచేసి నాకు వీలైనంత త్వరగా ఇండియన్ సిటిజన్‌షిప్ వచ్చేలా హెల్ప్ చేయండి” అంటూ ఎమోషనల్ రిక్వెస్ట్ పెట్టింది. స్పందించిన కలెక్టర్, వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేసి కేంద్రానికి నివేదిక పంపుతామని హామీ ఇచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















