ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ 2025 షెడ్యూలు విడుదల - పరీక్షల టైమ్ టేబుల్ ఇదే
TOSS Exams: తెలంగాణలో సార్వత్రిక పది, ఇంటర్ పరీక్షల షెడ్యూలును ఓపెన్ స్కూల్ సొసైటీ విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 20 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి.

TOSS Exams Time Table: తెలంగాణ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షల షెడ్యూలును అధికారులు మార్చి 13న విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల టైమ్ టేబుల్‌ను అందుబాటులో ఉంచారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్ 20 నుంచి 26 వరకు టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్; మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.
ఏప్రిల్ 26 నుంచి మే 5 మధ్య ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూలును సబ్జెక్టులవారీగా తర్వాత విడుదల చేస్తారు. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను త్వరలోనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. హాల్‌టికెట్ లేనిదే పరీక్ష కేంద్రంలోనికి అనుమతించరు. అభ్యర్థులకు నిర్దేశించిన పరీక్ష కేంద్రంలో మాత్రమే పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ప్రకటించిన తేదీల్లో సెలవుదినంగా ప్రకటించినప్పటికీ.. షెడ్యూలు ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తారు.
పదోతరగతి పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ 20.04.2025
ఉదయం సెషన్: తెలుగు/కన్నడ/తమిళం.
మధ్యాహ్నం సెషన్: సైకాలజీ, మరాఠి.
➥ 21.04.2025
ఉదయం సెషన్: ఇంగ్లిష్.
మధ్యాహ్నం సెషన్: ఇండియన్ కల్చర్ & హెరిటేజ్.
➥ 22.04.2025
ఉదయం సెషన్: మ్యాథమెటిక్స్.
మధ్యాహ్నం సెషన్: బిజినెస్ స్టడీస్.
➥ 23.04.2025
ఉదయం సెషన్: సైన్స్ & టెక్నాలజీ.
మధ్యాహ్నం సెషన్: హిందీ.
➥ 24.04.2025
ఉదయం సెషన్: సోషల్ స్టడీస్.
మధ్యాహ్నం సెషన్: ఉర్దూ.
➥ 25.04.2025
ఉదయం సెషన్: ఎకనామిక్స్.
మధ్యాహ్నం సెషన్:హోంసైన్స్.
➥ 26.04.2025
ఉదయం సెషన్: వొకేషనల్ సబ్జెక్టులు.
మధ్యాహ్నం సెషన్: వొకేషనల్ సబ్జెక్టులు (ప్రాక్టికల్స్)
ఇంటర్ పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ 20.04.2025
ఉదయం సెషన్: తెలుగు/ఉర్దూ/హిందీ.
మధ్యాహ్నం సెషన్: అరబిక్.
➥ 21.04.2025
ఉదయం సెషన్: ఇంగ్లిష్.
మధ్యాహ్నం సెషన్: సోషియాలజీ.
➥ 22.04.2025
ఉదయం సెషన్: పొలిటికల్ సైన్స్.
మధ్యాహ్నం సెషన్: కెమిస్ట్రీ, పెయింటింగ్.
➥ 23.04.2025
ఉదయం సెషన్: కామర్స్/బిజినెస్ స్టడీస్.
మధ్యాహ్నం సెషన్: ఫిజిక్స్, సైకాలజీ.
➥ 24.04.2025
ఉదయం సెషన్: హిస్టరీ.
మధ్యాహ్నం సెషన్: మ్యాథమెటిక్స్, జియోగ్రఫీ.
➥ 25.04.2025
ఉదయం సెషన్: ఎకనామిక్స్, మాస్ కమ్యూనికేషన్.
మధ్యాహ్నం సెషన్: బయాలజీ, అకౌంటెన్సీ, హోంసైన్స్.
➥ 26.04.2025
ఉదయం సెషన్: వొకేషనల్ సబ్జెక్టులు (థియరీ).
మధ్యాహ్నం సెషన్: ఎలాంటి పరీక్ష లేదు.
ప్రాక్టికల్ పరీక్షలు..
➥ జనరల్ & వొకేషనల్ సబ్జెక్టులు: 26.04.2025 - 03.05.2025.























