Visakha Holika Dahan | ఉత్తరాది హోళికా దహన్ సంప్రదాయం ఇప్పుడు విశాఖలో | ABP Desam
మీకు డౌట్ వచ్చిందా భోగి మంటలు వేసినట్లు హోళీకి కూడా పెద్ద పెద్ద మంటలు వేస్తారు ఎందుకు అని. ఉదాహరణకు విశాఖపట్నంలో చేసిన ఈ సంబరాలే చూడండి. ఆర్కే బీచ్ లో అంగరంగ వైభవంగా హోళీ దహన్ ను నిర్వహించారు. ఈ హోళీ దహన్ పండుగ ఎక్కువగా రాజస్థాన్ ,మధ్యప్రదేశ్, బీహార్ ,గుజరాత్, యూపీ, ప్రాంతాలు వారు చేసుకుంటారు. బట్ ఈ కల్చర్ విశాఖపట్నంకు కూడా వచ్చింది.
పురుషులు కర్రలతో దాండియా ఆడుతూ...ఆ తర్వాత కర్రలను పేర్చి దాని మీద పిడకలు పెట్టి ఇంత పెద్ద ఎత్తున మంట కోసం ఏర్పాటు చేస్తారు. తర్వాత ఓ దారం తీసుకుని ఆ పిడకలు చుట్టూ చుడుతూ ప్రదక్షిణాలు చేస్తారు. పూజలు తర్వాత అగ్గి రాజేసి ఆ నిలువెత్తు మంటలు మండేలా చేస్తారు. తర్వాత ఒకరికి ఒకరు రంగులు పుసూకుంటూ హోళీ వేడుకలను షురూ చేస్తారు.
మండుతున్న పిడకలను తీసుకుని వాటి నిప్పు రవ్వలపై అప్పడాలను కాలుస్తారు. ఇది ప్రత్యేకంగా అనిపించే ఆచారం. అంతేకాదు హోలీ దహన్ మధ్యలో ఒక చెట్టు కొమ్మని నిలబెడతారు హోలీ దహన్ పూజ నిర్వహించిన తర్వాత యువకులందరూ ఆ మంటల్లో ఉన్న చెట్టును లాక్కుని పరుగులు పెడతారు. దాని చివరన ఉన్న చిగురును తెంపుకుని దుకాణాల్లో ఇంట్లో పెట్టుకుంటే మంచిదనే ఆచారాన్ని పాటారు..
అసలు భోగి మంటలా ఇలా హోళీ దహన్ ఎందుకు అంటే... హోళీ సందర్భంగా వెలిగించిన అగ్ని హోళికా అనే రాక్షసి దహనానికి ప్రతీక. ప్రహ్లాదుడు తన విష్ణు భక్తిని వదులుకోవట్లేదని తన తండ్రి అయిన హిరణ్యకశిపుడు హోళికా రాక్షసి పిలుస్తాడట. అయితే ప్రహ్లాదుడి నుంచి కించిత్తు విష్ణు భక్తి పోకపోవటంతో అతన్ని చంపాలనుకున్న రాక్షసి ఓ పెద్ద మంటను వేస్తుందట. కానీ ప్రహ్లాదుడి భక్తి కారణంతో ఆమె ఆ మంటల్లో పడి దహనం అయిపోయిందని...చెడుపై మంచి విజయం సాధించటం తథ్యం అనే కథ ఇందులో ఉంది. దీన్నే కామ దహనం కూడా అంటారు. భోగి మంటలను తలపించేలా కర్ర పోగులు, పిడకలు వేసి కాముడు ని దహనం చేస్తారు కాబట్టి ఆ పేరు వచ్చిందని చెబుతారు.




















