Horoscope Today: ఈ రాశులవారు పనితీరు మార్చుకోవద్దు..అలానే కొనసాగించండి మంచి ఫలితాలు పొందుతారు!
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మార్చి 15 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు మీరు అక్రమ కేసులలో చిక్కుకునే ప్రమాదం ఉంది జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగులకు ఉన్నతాధికారులతో సత్సంబంధాలుంటాయి. నూతన వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు. స్నేహితుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. ( మేష రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
వృషభ రాశి
మీరున్న రంగంలో ఈ రోజు పురోగతి సాధిస్తారు. నూతన నైపుణ్యాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. తల్లిదండ్రులతో మంచిగా వ్యవహరించండి. పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. కుటుంబంలో ఆనందం ఉంటుంది. రాజకీయ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.(వృషభ రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
మిథున రాశి
ఈ రోజు మీరు సరికాని పనులపై ఆసక్తి చూపిస్తారు. ఖర్చులు తగ్గుతాయి. పిల్లల తప్పులను విస్మరించవద్దు. ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి. (మిథున రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
కర్కాటక రాశి
ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలిగి ఉంటారు. రహస్యంగా మీరు తెలుసుకున్న విషయాలు మీకు ప్రయోజనం కలిగిస్తాయి. ఉద్యోగం, వ్యాపారంలో సాధారణ ఫలితాలుంటాయి. వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమికులు పెళ్లికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటారు.(కర్కాటక రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
సింహ రాశి
ఈ రోజు మీరు అనుకోని ఖర్చులు అధికంగా చేస్తారు. వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. పాత తప్పుల నుంచి పాఠం నేర్చుకునేందుకు ప్రయత్నించండి. కొంతమంది బంధువులు మీపై అసూయ కలిగి ఉంటారు. ముఖ్యమైన పత్రాలు పోగొట్టుకునే అవకాశం ఉంది జాగ్రత్త. (సింహరాశి ఉగాది 2025 ఫలితాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
కన్యా రాశి
ఈ రోజు మీ పనికి ప్రాధాన్యత ఇవ్వండి. సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించండి. పెళ్లి సంబంధాలు వెతుకుతున్నవారి ప్రయత్నం ఫలించవచ్చు. వ్యాపారంలో అధిక ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. మీ పనితీరు మార్చుకోవద్దు..అలానే కొనసాగించండి
తులా రాశి
ఈ రోజు విరోధాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. చేపట్టిన పనిని మధ్యలోనే వదిలేయవద్దు. జీవిత భాగస్వామి భావాలు గౌరవించండి. ఎక్కువ సేపు ఆలోచించడం కారణంగా మీ ఆరోగ్యం, పనిపై ఆ ప్రభావం పడుతుంది.
వృశ్చిక రాశి
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామికి సమయం కేటాయిస్తారు. పనిలో పారదర్శకత ఉండేలా చూసుకోండి. సామాజిక పనులు చేయాలనే ఆలోచన కలుగుతుంది. ప్రేమ వ్యవహారాలకు మంచిరోజు అవుతుంది.
ధనస్సు రాశి
ఈ రోజు ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆస్తి లావాదేవీలు సులభంగా పూర్తవుతాయి. అనవసరమైన పనులకు ఎక్కువ సమయం కేటాయించవద్దు. కొత్త ప్రాజెక్టులలో పనిని ప్రారంభించవచ్చు. మిత్రులు మీకు సహాయం చేస్తాయి. మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తారు.
మకర రాశి
ఈ రోజు మీ వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది. చాలా రోజుల క్రితం ఆగిన పని మళ్లీ మొదలవుతుంది. బంధువులను కలుస్తారు. సహోద్యోగులు మీకు సహాయం చేస్తారు. చట్టపరమైన వివాదాలనుంచి బయటపడతారు. వ్యాపారానికి సంబంధించి చేసే ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది
కుంభ రాశి
ఈ రోజు మీరు వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. అనుకోని ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీ వ్యక్తిగతజీవితంలో బయటివ్యక్తుల జోక్యాన్ని నివారించండి.
మీన రాశి
స్నేహితులతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. ప్రశాంతంగా ఉంటారు. చేపట్టిన పనులు సులభంగా పూర్తిచేస్తారు. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు.
గమనిక: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

