అన్వేషించండి

Bhu Bharati Registration Scam: భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు నమోదు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు

Telangana News | భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై సుమోటోగా కేసు నమోదు చేసిన లోకాయుక్త సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పలు కీలక శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.

Bhu Bharati Portal Registration Scam: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై లోకాయుక్త సీరియస్‌గా స్పందించింది. ఈ కుంభకోణానికి సంబంధించి మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా లోకాయుక్త సుమోటోగా కేసు నమోదు చేసి, సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS), రెవెన్యూ భూ పరిపాలన శాఖ చీఫ్ కమిషనర్ (CCLA), స్టాంపులు  రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఐజీ, మీ-సేవా కమిషనర్, జనగామ జిల్లా రిజిస్ట్రార్‌లకు నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది.

ఎలా మోసం చేస్తారంటే..

ఈ అక్రమాల తీరు పరిశీలిస్తే, భూభారతి పోర్టల్‌ను అడ్డాగా చేసుకుని ఒక ముఠా భారీ కుంభకోణానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ చార్జీలను ప్రభుత్వానికి చేరకుండా ఈ ముఠా కాజేస్తోంది. థర్డ్ పార్టీ అప్లికేషన్ల సహాయంతో అసలు చలాన్ మొత్తాన్ని ఎడిట్ చేస్తూ, తక్కువ మొత్తాన్ని చూపిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. జనగామలో ఒకే రోజు 10 చలాన్లకు సంబంధించి దాదాపు 8,55,577 రూపాయలను (8 లక్షల 55 వేల 5 వందల 77 రూపాయలు) పక్కదారి పట్టించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

చలాన్లు ఎడిట్ చేసి మోసాలు
ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు లోతైన విచారణకు ఆదేశించగా, జనగామ తహసిల్దార్ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. యాదాద్రికి చెందిన ఒక ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు చలాన్లను ఎడిట్ చేసి, పేమెంట్ జరిగినట్లుగా నకిలీ పత్రాలు సృష్టిస్తున్నట్లు గుర్తించారు. అయితే, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సిబ్బంది సహకారం లేకుండా ఈ స్థాయి మోసం సాధ్యం కాదని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో సీసీఎల్ఏ (CCLA) టెక్నికల్ టీమ్ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ధరణి స్లాట్ బుకింగ్ సమయం నుండే ఈ తరహా మోసాలు కొనసాగుతున్నట్లు సమాచారం.

టెక్నికల్ లోపాలను వాడుకుని కోట్లు కాజేస్తున్నారు

రిజిస్ట్రేషన్ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న భద్రతా లోపాలను కేటుగాళ్లు ఆసరాగా చేసుకుంటున్నారు. చలాన్ వెరిఫికేషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ అక్రమాలు జరుగుతున్నట్లు  భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి గండి: ఇలాంటి అక్రమాల వల్ల రాష్ట్ర ఖజానాకు అందాల్సిన కోట్లాది రూపాయల స్టాంప్ డ్యూటీ ఆదాయం ప్రైవేటు వ్యక్తుల పరమవుతోంది. ఇప్పటికే ధరణి పోర్టల్‌లోని లోపాలపై ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం సమీక్ష నిర్వహిస్తుండగా, ఇప్పుడు భూభారతి అక్రమాలు బయటపడటం రెవెన్యూ శాఖలో కలకలం రేపుతోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Embed widget