అన్వేషించండి

Virat Kohli Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీని ఊరిస్తున్న 5 రికార్డులు ఇవే

Ind vs NZ 1st ODI | భారత్ న్యూజిలాండ్ ODI సిరీస్ ఆదివారం (జనవరి 11న) ప్రారంభం కానుంది. కోహ్లీ ఈ సిరీస్ లో ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడో అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఈ ఏడాది భారత జట్టుకు మొదటి సవాలు న్యూజిలాండ్ సిరీస్. నేటి (జనవరి 11) నుండి భారత్ vs న్యూజిలాండ్ 3 ODI మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభమవుతుంది. మొదటి వన్డే మ్యాచ్ వడోదరలోని BCA స్టేడియంలో జరుగుతుంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మపైనే అందరి దృష్టి ఉంది.

విరాట్ కోహ్లీ గత 6 వన్డే ఇన్నింగ్స్‌లలో ఏకంగా 584 పరుగులు చేశాడు. ఈ సమయంలో కోహ్లీ 3 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు సాధించాడు. ఇదే అద్భుతమైన ఫామ్‌తో విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో 5 రికార్డులను బద్దలు కొట్టగలడు. అయితే ఈ రికార్డులు ఏంటో ఇక్కడ  తెలుసుకోండి.

న్యూజిలాండ్‌పై అత్యధిక ODI పరుగులు

ఇప్పటివరకు విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌పై 33 ఇన్నింగ్స్‌లలో 1657 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌పై అత్యధిక ODI పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్. అతను కివీస్ జట్టుపై 41 ఇన్నింగ్స్‌లలో 1750 పరుగులు చేశాడు. టెండూల్కర్‌ను అధిగమించడానికి విరాట్ కోహ్లీకి 94 పరుగులు కావాలి. కోహ్లీ ఫాం చూస్తే ఇది పెద్ద విషయం కాదు. ఒకవేళ ఈ రికార్డు చేరినా.. తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ నమోదు చేసిన భారత ఆటగాడిగా నిలుస్తాడు.

న్యూజిలాండ్‌పై అత్యధిక ODI సెంచరీలు

న్యూజిలాండ్‌పై అత్యధిక సెంచరీల రికార్డును తన పేరిట లిఖించుకోవాలంటే విరాట్ కోహ్లీ మరో సెంచరీ చేయాలి. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, రికీ పాంటింగ్ కివీస్ జట్టుపై 6 సెంచరీలు సాధించారు.

అతి తక్కువ సమయంలో 28,000 అంతర్జాతీయ పరుగులు

విరాట్ కోహ్లీ 25 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర తర్వాత 28,000 పరుగులు పూర్తి చేసిన మూడవ క్రికెటర్ అవుతాడు. సచిన్ 644 ఇన్నింగ్స్‌లలో, సంగక్కర 666 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించారు. విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 624 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాడు.

న్యూజిలాండ్‌పై అత్యధిక సెంచరీలు

 సచిన్ టెండూల్కర్, జో రూట్, విరాట్ కోహ్లీ, జాక్వెస్ కలిస్ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్‌పై 9 సెంచరీలు సాధించారు. కోహ్లీ కనుక మరో సెంచరీ సాధిస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్‌పై 10 సెంచరీలు సాధించిన మొదటి బ్యాటర్‌గా నిలుస్తాడు.

న్యూజిలాండ్‌పై అత్యధిక అంతర్జాతీయ పరుగులు

విరాట్ కోహ్లీ ప్రస్తుతం న్యూజిలాండ్‌పై అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు. కోహ్లీ పేరిట 2,927 పరుగులు ఉన్నాయి. కివీస్ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ 3345 పరుగులతో అగ్ర స్థానంలో ఉన్నాడు. సచిన్ రికార్డును దాటాలంటే నాలుగు వందలకు పైచిలుకు పరుగులు చేయాల్సి ఉంటుంది. 

Also Read: Rishabh Pant: న్యూజిలాండ్‌తో తొలి వన్డేకి ముందే భారత్‌కు షాక్! ప్రాక్టీస్ సెషన్లో రిషబ్ పంత్ ‌కు గాయం

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Nirmal Road Accident: బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
Advertisement

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Nirmal Road Accident: బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
Embed widget