iPhone Fold Phone: మడతపెట్టే ఐఫోన్.. భారతదేశంలో ధర ఎంత ? ఎప్పుడు లాంచ్ అవుతుంది
iPhone latest News | ఈ సంవత్సరం సెప్టెంబర్లో Apple తన మొదటి ఫోల్డబుల్ ఐఫోన్ విడుదల చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఫోల్డుబల్ ఐఫోన్ ఫీచర్లు, ధర లీక్ అయ్యాయి.

ఈ సంవత్సరం Apple కంపెనీ తమ మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ మార్కెట్ లోకి తీసుకొస్తుందని అంచనాలు ఉన్నాయి. పలు అంచనాల ప్రకారం, దీనిని ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఐఫోన్ ఫోల్డ్ పేరుతో ప్రారంభించవచ్చు. దీని గురించి Apple ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే నివేదికలు, లీక్‌ల నుండి ఈ ఫోన్‌లో ఏం లభిస్తుందో స్పష్టమైంది. ఫోల్డబుల్ ఐఫోన్ స్పెసిఫికేషన్‌లు ఏమిటి, ఇది ఎప్పుడు ప్రారంభవుతుంది. భారతదేశంలో దీని ధర ఎంత ఉండవచ్చు అని ఇక్కడ తెలుసుకుందాం.
ఐఫోన్ ఫోల్డ్ స్పెసిఫికేషన్‌లు
లీక్‌ల ప్రకారం చూస్తే, Apple ఈ కొత్త ఆఫర్‌లో 7.8 అంగుళాల ఇన్నర్, 5.5 అంగుళాల ఔటర్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ పరిమాణంతో Apple ఫోల్డబుల్ ఐఫోన్‌లో ఫోన్ సౌలభ్యం, iPad ఉత్పాదకతను అందించాలని కోరుకుంటోంది. డిస్‌ప్లే కోసం, Apple Samsung కు చెందిన CoE OLED సాంకేతికతను ఉపయోగిస్తుంది. ఇది మన్నికను పెంచుతుంది. ఇది ప్రో మోడల్‌ల వలె రిఫ్రెష్ రేట్, బ్రైట్ నెస్ సపోర్ట్ కలిగి ఉండవచ్చు అని తెలుస్తోంది.
కెమెరా, బ్యాటరీ
ఐఫోన్ ఫోల్డ్‌లో ప్రో మోడల్ లాంటి కెమెరా సెటప్ ఉంటుందని భావిస్తున్నారు. దాని వెనుక వైపున వైడ్, అల్ట్రా వైడ్, టెలిఫోటో లెన్స్‌లతో ట్రిపుల్ కెమెరా సెట్ ఇవ్వవచ్చు. ముందు వైపు రెండు లెన్స్‌లు ఉంటాయి. వాటిలో ఒకటి కవర్, మరొకటి మెయిన్ డిస్‌ప్లేలో ఉంచుతారు. దీని బ్యాటరీ సామర్థ్యం గురించి ఎటువంటి సమాచారం బటయకు రాలేదు. అయితే ఇది ఒకరోజు పూర్తి వినియోగం కోసం పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
ఎప్పుడు ప్రారంభం.. ధర ఎంత ఉంటుంది?
ఐఫోన్ ఫోల్డ్‌ను ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్‌తో పాటు ప్రారంభించే అవకాశం ఉంది. దాని ధర అంచనా విషయానికి వస్తే.. దీనిని అమెరికాలో $1,800-2,399 మధ్య ధరతో మార్కెట్‌లోకి విడుదల చేయవచ్చు. భారతదేశంలో అన్ని పన్నులు, సుంకాలు కలిపి దీని ధర రూ. 2.25 లక్షల వరకు ఉండవచ్చు. అయితే, దీనికి ఇంకా అధికారిక నిర్ధారణ రాలేదు. అయితే ఈ ఏడాది కచ్చితంగా ఫోల్డబుల్ ఐఫోన్ మార్కెట్లోకి వస్తుందని వినిపిస్తోంది. ఒకవేళ ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్లు తీసుకువస్తే ఈ మోడల్ సైతం భారీగా విక్రయాలు జరుపుకుంటాయి.






















