ఆపిల్ చౌకైన ఐఫోన్‌పై భారీ తగ్గింపు.. iPhone Air కొనేందుకు బెస్ట్ డీల్స్ ఇవే
iPhone Air Discount Price | కొత్త సంవత్సరం కొత్త ఫోన్ కొనేవారికి ఐఫోన్ ఎయిర్ మంచి ఛాయిస్ కానుంది. తాజాగా ఐఫోన్ ఎయిర్ మొబైల్ పై డిస్కౌంట్ సేల్ నడుస్తోంది.

Apple iPhone Air Price in India: కొత్త సంవత్సరం వచ్చిందంటే ఎన్నో విషయాల్లో పాత వాటికి స్వస్తి పలికి, కొత్తవి తీసుకోవాలని ప్రజలు భావిస్తుంటారు. కొందరు తమ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలని అనుకుంటారు. కొందరు ఎక్కువ స్టోరేజ్ కోరుకుంటే, మరిరికొందరు వేరే ఎకోసిస్టమ్‌లోకి మారాలనుకుంటారు. తేలికైన, సౌకర్యవంతమైన ఫోన్ కోసం కొందరు చూస్తారు. స్మార్ట్‌ఫోన్లు మన జీవితంలో ఎప్పుడో భాగంగా మారాయి. ఈ సమయంలో, రిటైలర్లు కూడా ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తారు. తద్వారా కస్టమర్లు కొత్త ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
iPhone Air ఎందుకు అందరినీ ఆకట్టుకుంటోంది?
Apple కంపెనీకి చెందిన iPhone Air, ప్రీమియం iPhone అనుభవాన్ని కోరుకునే వినియోగదారులకు ప్రత్యేకమైనది. కానీ ఐఫోన్ Pro మోడల్స్ అధిక ధరలకు వెళ్లకూడదనుకునే వారికి ఇది సరైన ఛాయిస్. ఈ ఫోన్ చాలా తేలికైనది, శక్తివంతమైనది. అలాగే రోజూ ఉపయోగించేది కనుక కస్టమర్లు ఇలాంటివి కొనుగోలు చేయాలని భావిస్తారు.
256GB స్టోరేజ్ వేరియంట్, ముఖ్యంగా ఫొటోగ్రఫీ ఇష్టపడి ఎక్కువ ఫోటోలు, వీడియోలు తీసేవారికి, ఆఫ్‌లైన్ కంటెంట్‌ను సేవ్ చేసుకునేవారికి లేదా స్టోరేజ్ టెన్షన్ లేకుండా ఎక్కువ కాలం ఫోన్‌ను ఉపయోగించాలనుకునే వారికి చాలా ఉపయోగకరం.
iPhone Air లో ఏం ఉంటాయి?
iPhone Air ప్రీమియం అనుభూతితో పాటు నమ్మకమైన పనితీరు కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో పెద్ద, స్పష్టమైన OLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది వీడియోలు చూడటానికి, సోషల్ మీడియాలో బ్రౌజింగ్ చేయడానికి.. ఏదైనా టెక్ట్స్ చదవడానికి బాగుంటుంది.
Apple ప్రాసెసర్ రోజువారీ పనులతో పాటు గేమింగ్, ఫోటోగ్రఫీ వరకు సున్నితమైన పనితీరును అందిస్తుంది. కెమెరా సిస్టమ్ ఇతర ఫోన్లతో పోల్చితే చాలా నమ్మకమైనది. ఇది పోర్ట్రెయిట్, నైట్ ఫోటోగ్రఫీలో మంచి ఫలితాలను ఇస్తుంది. బ్యాటరీ ఒక రోజు వరకు వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
ధర ఎంత, ఆఫర్ డీల్స్
Vijay Sales లో iPhone Air (256GB, స్కై బ్లూ కలర్) ధర ₹1,19,900 గా ఉంది. కానీ వివిధ ఆఫర్లను కలిపితే దీని ధర చాలా తక్కువ అవుతోంది. ముందుగా, ఫోన్‌పై నేరుగా ₹24,910 తగ్గింపు ఇచ్చారు. ఆ తర్వాత, మీరు ICICI Bank లేదా Axis Bank సంబంధిత కార్డులతో చెల్లిస్తే, అదనంగా ₹4,000 బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది. ఈ డిస్కౌంట్ తర్వాత, ఫోన్ ధర ₹91,990 కి తగ్గుతుంది.
ఎక్స్ఛేంజ్‌తో మరింతగా ఆదా
మీ వద్ద పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే, దానిని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఈ డీల్ మరింత లాభదాయకం. పాత ఫోన్ విలువ కొత్త iPhone ధర నుంచి తగ్గుతుంది.
Samsung Galaxy S24 పై భారీ డిస్కౌంట్
ఈ-కామర్స్ సైట్ Flipkart లో Samsung Galaxy S24 5G పై భారీ తగ్గింపు ఇచ్చారు. ఈ ఫోన్ 8+128GB వేరియంట్ అసలు ధర 74,999 రూపాయలు. డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్ ఇక్కడ 49,999 రూపాయలకు లిస్ట్ చేశారు. ఈ ఫోన్‌ను కేవలం 5553 రూపాయల ప్రతినెలా ఈఎంఐ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో అద్భుతమైన కెమెరా సెటప్, స్టైలిష్ డిజైన్ ఉంటుంది.






















