iPhone 14 Discount Offer: ఐఫోన్ 14 పై భారీ తగ్గింపు.. Reliance Digital ఆఫర్ చెక్ చేసి కొనుగోలు చేసేయండి
iPhone 14 huge discount offer | యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ 14 పై భారీ తగ్గింపు ఆఫర్ ఇచ్చారు. Reliance Digital లో మీరు తక్కువ ధరకు ఐఫోన్ కొనే అవకాశం లభించింది.

iPhone 14 Discount Offer: మీరు ఎప్పటి నుంచో ఆపిల్ iPhone కొనాలని ఎదురుచూస్తున్నారా, అందుకు ఇదే మీకు సరైన సమయం. Apple కంపెనీ ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 14 ప్రస్తుతం దాని అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ప్రత్యేకత ఏమిటంటే ఈ అద్భుతమైన ఆఫర్ Amazon లేదా Flipkart ఈ కామర్స్ వెబ్‌సైట్స్ కాదు, Reliance Digital లో లభిస్తుంది. ఇందులో బ్యాంక్ ఆఫర్లు, ఈజీ EMI ప్రయోజనాలు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి.
Reliance Digital లో భారీ డిస్కౌంట్ మీ సొంతం
Reliance Digital వెబ్‌సైట్‌లో iPhone 14 ప్రారంభ ధర 48,403 రూపాయలుగా ఉంది. దీంతో పాటు ఎంచుకున్న బ్యాంక్ కార్డులతో చెల్లింపు చేస్తే 3,000 రూపాయల వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ విధంగా ఐఫోన్ 14 ధర 45,403 రూపాయలకు దిగొస్తుంది. గమనించాల్సిన విషయం ఏమిటంటే, Apple ఈ ఫోన్‌ను ప్రారంభంలో రూ. 79,900 ధరకు విడుదల చేసింది. కొనుగోలుదారులకు మొత్తం మీద ప్రస్తుతం 34,000 రూపాయలకు పైగా ఆదా అవుతుంది.
స్టోరేజ్ ఆప్షన్లు, డిజైన్
iPhone 14 దాని క్లాసిక్ నాచ్ డిజైన్‌తో వస్తుంది. ఈ ఐఫోన్ 128GB, 256GBతో పాటు 512GB స్టోరేజ్ వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. ప్రీమియం ఫినిష్, స్ట్రాంగ్ బాడీ, బెస్ట్ ఫీచర్లు, క్వాలిటీ దీనిని ఈ రోజుకీ ఆకర్షణీయమైన ఎంపికగా మారుస్తాయి.
అద్భుతమైన డిస్‌ప్లే, పనితీరు
ఈ ఐఫోన్ 14లో 6.1 అంగుళాల Super Retina XDR డిస్‌ప్లే ఉంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్‌తో అద్భుతమైన రంగులు, నలుపు టోన్‌లను చూపుతుంది. ఇందులో Apple కంపెనీ నమ్మకమైన A15 Bionic చిప్‌సెట్ ఉంది. ఇది మల్టీటాస్కింగ్, గేమింగ్‌ను తేలిక చేస్తుంది. ఈ ఫోన్ iOS 16 తో ప్రారంభించారు. రాబోయే iOS 26 తో సహా కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లకు కూడా మద్దతు ఇస్తుంది.
కెమెరా నాణ్యతలో రాజీ లేదు
ఫోటోగ్రఫీ కోసం iPhone 14 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 12MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. ఇందులో పోర్ట్రెయిట్ మోడ్, డెప్త్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం, 12 MP TrueDepth ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది ఫొటోగ్రఫీలో మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.
బ్యాటరీ, ఛార్జింగ్, సేఫ్టీ ఫీచర్లు
iPhone 14 వైర్డ్, వైర్‌లెస్ ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. MagSafe తో పాటు Qi2 వంటి ఆధునిక వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ వాటర్, డస్ట్ రెసిస్టెంట్. అలాగే భద్రత కోసం Face ID, అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేసే Crash Detection ఫీచర్ కూడా ఉంది.
Flipkart లో శాంసంగ్ గెలాక్సీ S25 ఆల్ట్రాపై భారీ తగ్గింపు
ఈ-కామర్స్ సైట్ Flipkart లో Samsung Galaxy S25 Ultra 12+256GB వేరియంట్‌పై భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ వేరియంట్ అసలు ధర సుమారు 1,29,999 రూపాయలు, కానీ డిస్కౌంట్ తర్వాత కేవలం 1,08,999 రూపాయలకు లిస్ట్ చేశారు. ఒకేసారి 21 వేలు తగ్గించారు. బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీనితో ఫోన్ మరింత చౌకగా మారవచ్చు. మీరు ఈ ఫోన్‌ను కేవలం 3832 రూపాయల EMI తో కొనుగోలు చేయవచ్చు.






















