iPhone 16 Discount: ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. iPhone 16 పై బిగ్ డిస్కౌంట్, 27,000 కంటే ఎక్కువ తగ్గింపు
iPhone 16 Plus | ఐఫోన్ 16 ప్లస్ కొనాలి అనుకునేవారికి ఆఫర్ వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ మీద 27 వేల వరకు ప్రయోజనం దక్కనుంది.

iPhone 16 ని తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి శుభవార్త. ప్రస్తుతం యాపిల్ కంపెనీకి చెందిన ఈ ఐఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తుంది. మీరు దాని కొనుగోలుపై భారీగా ఆదా చేయవచ్చు. రిలయన్స్ డిజిటల్ షాపింగ్ సెంటర్ల ద్వారా ఐఫోన్ 16ను రూ. 27,000 కంటే ఎక్కువ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. కనుక మీరు ఈ ప్రీమియం ఐఫోన్‌ను తక్కువకు కొనుగోలు చేయాలని ఎదురు చూస్తుంటే, ఇది మీకు గొప్ప అవకాశం. ఈ ఐఫోన్ ఫీచర్లు, దానిపై లభిస్తున్న డీల్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
iPhone 16 Plus స్పెసిఫికేషన్స్
ఈ ఐఫోన్ 16ను గత సంవత్సరం సెప్టెంబర్‌లో 6.7 అంగుళాల పెద్ద Super Retina XDR OLED డిస్‌ప్లేతో యాపిల్ ప్రారంభించింది. ఇందులో Apple A18 చిప్‌సెట్ ఉంది. ఇది Apple ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను, మల్టీ టాస్కింగ్‌ను నిర్వహిస్తుంది. అల్యూమినియం ఫ్రేమ్‌తో ఉన్న ఈ ఐఫోన్‌కు నీరు, ధూళి నిరోధకత (Water and Dust Proof) కోసం IP68 రేటింగ్ లభించింది. ఫోటోలు, వీడియోల కోసం దీని వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48MP ప్రైమరీ లెన్స్, 12MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 12MP కెమెరా అమర్చారు. దీని బ్యాటరీ 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ ఇవ్వగలదని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
రిలయన్స్ డిజిటల్‌లో భారీ తగ్గింపు
భారతదేశంలో iPhone 16 Plus రూ. 89,900 ధరకు ప్రారంభించారని తెలిసిందే. ఇప్పుడు రిలయన్స్ డిజిటల్‌లో ఈ ఐఫోన్ రూ. 19,000 తగ్గింపుతో రూ. 69,990కి లిస్ట్ చేశారు. ఈ తగ్గింపుతో పాటు, బ్యాంక్ ఆఫర్ ద్వారా మీరు రూ. 7,500 అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు, ఆ తర్వాత దీని ధర కేవలం రూ. 62,490కి దిగొస్తుంది. ఈ విధంగా మీరు ఈ ఐఫోన్ 16పై మొత్తం రూ. 27,410 తగ్గింపు పొందవచ్చు.
Google Pixel 10 పై కూడా మంచి డీల్
భారతదేశంలో రూ. 79,999 ధరకు ప్రారంభించిన Google Pixel 10 ప్రస్తుతం ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌లో రూ. 69,500కి లిస్ట్ అయింది. దాదాపు రూ. 10,500 తగ్గింపుతో పాటు, ఈ ఫోన్‌పై ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌లపై రూ. 1,500 వరకు అదనపు డిస్కౌంట్, రూ. 2085 వరకు క్యాష్‌బ్యాక్ కూడా పొందే అవకాశం ఇచ్చారు. ఈ విధంగా, మీరు గూగుల్ పిక్సెల్ 10 ఫోన్‌పై మొత్తం రూ. 14,000 వరకు ఆదా చేసుకోవచ్చు.






















