అన్వేషించండి

iPhone 18 సిరీస్ లో అద్భుతమైన ఫీచర్.. ఏళ్ల నిరీక్షణకు యాపిల్ తెరదించుతోందా..

iphone 18 Mobiles Features | టెక్ దిగ్గజం యాపిల్ తమ ఐఫోన్ 18 సిరీస్ లో అండర్-డిస్ప్లే ఫేస్ ID ని పరీక్షించడం మొదలుపెట్టింది. దాంతో కొత్త మోడల్ లో ఈ ఫీచర్ వచ్చే అవకాశాలున్నాయి.

ఐఫోన్ 18 సిరీస్‌లో ఆపిల్ చాలా కాలం తర్వాత ఒక అద్భుతమైన ఫీచర్‌ను తీసుకురానుంది. తాజా లీక్‌ల ప్రకారం, ఆపిల్ తన రాబోయే సిరీస్‌లో అండర్ డిస్‌ప్లే ఫేస్ ID రావొచ్చు. గత 4-5 సంవత్సరాలుగా ఈ ఫీచర్ కోసం ఐఫోన్ యూజర్లు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆపిల్ చివరకు దీనిని పరీక్షించడం ప్రారంభించింది. అదే సమయంలో తన సరఫరాదారులను కూడా కాంపోనెంట్లను తయారు చేయాలని కోరింది.  ఐఫోన్ 18 సిరీస్‌లో అండర్ డిస్‌ప్లే ఫేస్ ఐడీ ఫీచర్ కనిపించే అవకాశం ఉందని సూచిస్తుంది.

టెస్టింగ్ మొదలుపెట్టిన ఆపిల్ 

ఒక చైనీస్ టిప్‌స్టర్ ప్రకారం, ఆపిల్ మైక్రో-ట్రాన్స్‌పరెంట్ గ్లాస్ చుట్టూ ఉన్న ఇన్-డిస్‌ప్లే ప్రమాణీకరణ వ్యవస్థను పరీక్షిస్తోంది. ఈ విధంగా ట్రూడెప్త్ ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ స్క్రీన్ లోపల నుంచి పనిచేస్తుంది. ఇది డిస్‌ప్లేపై ఎటువంటి ప్రభావాన్ని చూపదు. ఈ టెక్నాలజీ కోసం ఎదురుచూస్తూ, ఆపిల్ ఇప్పటివరకు ఈ ఫీచర్‌ను విడుదల చేయలేదు. ఐఫోన్ 18 సిరీస్‌లో ఈ ఫీచర్ వస్తుందని లీక్‌లో పేర్కొన్నారు. అయితే లైన్‌అప్‌లోని అన్ని మోడల్‌లు ఈ ఫీచర్‌తో వస్తాయా లేదా ఇది ప్రో మోడల్‌లలో మాత్రమే ఇస్తారా అనే దానిపై సైతం క్లారిటీ రాలేదు.

డైనమిక్ ఐలాండ్‌కు సెలవు ఇవ్వాలని ఆపిల్ కోరుకుంటోంది

ఆపిల్ 2027లో పూర్తి డిస్‌ప్లేతో ఐఫోన్ 20ని విడుదల చేస్తుంది. దీని స్క్రీన్‌పై ఎలాంటి కటౌట్ ఉండదు. ఆ దిశలో కదలడానికి, ఆపిల్ డైనమిక్ ఐలాండ్‌కు గుడ్ బై చెప్పాలనుకుంటోంది. ఈ సిరీస్‌లో భాగంగా, ఐఫోన్ 18 సిరీస్‌లో డైనమిక్ ఐలాండ్ పరిమాణం తగ్గించనునంది. ఫేస్ ID సెన్సార్‌ను అండర్ డిస్‌ప్లేకి తరలించిన తర్వాత, టాప్ నాచ్‌లో తక్కువ సెన్సార్లు మిగిలి ఉంటాయి. యాపిల్ కంపెనీ దీనిని చిన్నదిగా చేయడానికి చూస్తుంది. ఐఫోన్ 18ప్రో మోడల్స్‌లో డైనమిక్ ఐలాండ్ స్థానంలో కేవలం కెమెరా నాచ్ మాత్రమే ఇవ్వవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. 

ఐఫోన్ 18 సిరీస్ విడుదల ఎప్పుడు..

ఆపిల్ కొత్త లాంచ్ షెడ్యూల్ ప్రకారం, 18 సిరీస్ ప్రో మోడల్స్, ఫోల్డబుల్ ఐఫోన్ వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో విడుదల కానున్నాయి. అయితే స్టాండర్డ్ ఐఫోన్ 18 మోడల్ 2027 ప్రారంభంలో ఐఫోన్ 18తో విడుదల చేసే అవకాశం ఉందని మార్కెట్లో వినిపిస్తోంది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Jhandu Kumar In Commonwealth Games: కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
Prime Minister Modi:
"రీల్స్ చేయండి, ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండండి" కేబినెట్ మంత్రులకు మరోసారి ప్రధాని మోదీ సలహా 
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Jhandu Kumar In Commonwealth Games: కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
Prime Minister Modi:
"రీల్స్ చేయండి, ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండండి" కేబినెట్ మంత్రులకు మరోసారి ప్రధాని మోదీ సలహా 
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Jana Nayagan Box Office Collection Day 2: 'జన నాయకుడు' కలెక్షన్లు... రెండో రోజు ఢమాల్... విజయ్ సినిమాకు భారీ డ్రాప్! 
కలెక్షన్లలో విజయ్‌కు భారీ దెబ్బ... వంద కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... కానీ రెండో రోజు అంతేనా?
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
కన్వర్ యాత్రలో నిజమైన ప్రేమ: దివ్యాంగుడైన భర్తను 180 కి.మీ మోసిన భార్య!
కన్వర్ యాత్రలో నిజమైన ప్రేమ: దివ్యాంగుడైన భర్తను 180 కి.మీ మోసిన భార్య!
తొలి ఏకాదశి పూజా విధానం, ఉపవాస నియమాలు తెలుసుకోండి!
తొలి ఏకాదశి పూజా విధానం, ఉపవాస నియమాలు తెలుసుకోండి!
Embed widget