iphone 17 Price Hike: భారీ డిమాండ్‌తో ఐఫోన్ 17 ధరలకు రెక్కలు! ఎంత మేర పెరుగుతాయంటే..
iphone 17 in India | ఐఫోన్ 17 కు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లో డిమాండ్ పెరిగింది. స్టాక్ తక్కువగా ఉండటంతో ధర పెరిగే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి.

iphone 17 Price hike In India | ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ కు ఉండే క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే మీరు iPhone 17 కొనాలనుకుంటే, వెంటనే కొనాలి. లేకపోతే భారీ డిమాండ్ కారణంగా Apple దాని ధరలను పెంచవచ్చు అని ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్‌లో భారత మార్కెట్లోకి విడుదలైన iPhone 17 ధరలను పెంచవచ్చని పలు నివేదికలు చెబుతున్నాయి. కొన్ని రోజుల కిందట Apple దానిపై లభించే క్యాష్‌బ్యాక్‌ను తగ్గించింది. ఈ ఫోన్ పలు అద్భుతమైన అప్‌గ్రేడ్‌లతో వచ్చింది. దీని కారణంగా ఐఫోన్ 17కు చాలా డిమాండ్ ఉంది. మరోవైపు మార్కెట్లో ఐఫోన్ 17 స్టాక్ తక్కువగా ఉందని నివేదికలు చెబుతున్నాయి.
iPhone 17 ధర ఎంత ఉండవచ్చు?
భారతదేశంలో ఈ iPhone 17 256GB బేస్ మోడల్ ధర రూ. 82,900, కాగా 512GB మోడల్ ధర రూ. 1,02,900 వరకు ఉంటుంది. ఇప్పుడు ఐఫోన్ 17 ధరను రూ. 7,000 పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ యాపిల్ అలాంటి నిర్ణయం తీసుకుంటే తరువాత ఐఫోన్ 17 ధరలు వరుసగా రూ. 89,900, రూ. 1,09,900 అవుతాయి. అయితే టెక్ దిగ్గజం Apple సంస్థ నుండి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. పెరిగిన ధరల ప్రభావాన్ని నేరుగా కస్టమర్‌లపై పడకుండా ఉండటానికి, Apple దీనిపై కొన్ని డిస్కౌంట్లను అందించే అవకాశాలున్నాయి. దీనితో పాటు, బ్యాంక్ ఆఫర్‌లు, క్యాష్‌బ్యాక్ డీల్స్ కూడా కస్టమర్‌ల జేబులకు కొంత ఊరట కలిగిస్తాయి.
ధర పెరగడానికి కారణం ఏంటి..
ఐఫోన్ 17 ధర పెరగడానికి సంబంధించిన సమాచారం ఇంకా అధికారికంగా రాలేదు. కానీ భారీ డిమాండ్‌తో పాటు మెమరీ పరకరాల ధర పెరగడం వల్ల Apple ఈ నిర్ణయం తీసుకుంటోందని నిపుణులు, విశ్లేషకులు భావిస్తున్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, గ్లోబల్ మార్కెట్‌లో మెమరీ పరికరాల కొరత ఉంది. దీని కారణంగా వాటి ధరలు 20 నుండి 50 శాతం వరకు పెరిగాయి. అందువల్ల ఇతర కంపెనీలు కూడా ప్రభావితం కానున్నాయి. వాటి కొత్త స్మార్ట్‌ఫోన్‌లు అధిక ధరలకు విడుదల కానున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే, ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు, లేటెస్ట్ మొబైల్స్ త్వరలో మరింత ఖరీదు కానున్నాయి.





















