స్మార్ట్‌ఫోన్‌ల ఫ్రేమ్‌లకు అల్యూమినియం, స్క్రూలకు స్టీల్, సర్క్యూట్ బోర్డులకు రాగి ఉపయోగిస్తారు. మెగ్నీషియం వంటి తేలికైన లోహాలు బరువును తగ్గిస్తాయి.
Gold and Silver in Your Phone: మీ ఫోన్‌లో బంగారం, వెండి నిధి ఉంది! మీ ఫోన్‌లోని ఏ భాగంలో ఏ లోహం ఉందో తెలుసా?
Gold and Silver in Your Phone: మీరు ప్రతిరోజూ మీ చేతిలో పట్టుకునే స్మార్ట్‌ఫోన్ కేవలం టెక్నాలజీ అద్భుతం మాత్రమే కాదు, లోహాల గని కూడా అని ఎప్పుడైనా అనుకున్నారా?

- స్మార్ట్‌ఫోన్‌ల బాడీలు బలానికి అల్యూమినియం, తేలికకు మెగ్నీషియం వాడతారు.
- సర్క్యూట్ బోర్డులకు రాగి, బంగారం, వెండి పూత తుప్పు పట్టకుండా కాపాడుతుంది.
- లిథియం-అయాన్ బ్యాటరీలు ఎక్కువ శక్తిని, మన్నికను అందిస్తాయి.
- స్పీకర్లు, మోటార్లు నియోడైమియం అయస్కాంత శక్తితో పనిచేస్తాయి.
Gold and Silver in Your Phone: మీరు ప్రతిరోజూ పట్టుకునే స్మార్ట్‌ఫోన్ కేవలం టెక్నాలజీ అద్భుతం మాత్రమే కాదు, లోహాల చిన్న గని అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అనేక విలువైన, ప్రత్యేకమైన లోహాలు ఫోన్‌ను వేగంగా, స్ట్రాంగ్‌గా, తేలికగా ఉండటంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఒక చిన్న ఫోన్ బంగారం, వెండి నుంచి లిథియం వరకు ప్రతిదీ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లోని ఏ భాగాలలో ఏ లోహాలను ఉపయోగిస్తారనే దానిపై మీకు ఆసక్తి ఉంటే, ఈ సమాచారం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
మీరు ఫోన్‌ను పట్టుకున్నప్పుడు, లోపల డజన్ల కొద్దీ భాగాలు ఉన్నప్పటికీ అది బరువుగా అనిపించదు. ఫోన్ బాడీలో ఉపయోగించే ప్రత్యేక లోహాల కారణంగా ఇది జరుగుతుంది. స్మార్ట్‌ఫోన్ ఫ్రేమ్‌లు సాధారణంగా అల్యూమినియంతో తయారు చేస్తారు. ఇది ఫోన్‌ను స్ట్రాంగ్‌గా చేస్తుంది. పడిపోయినప్పుడు దెబ్బతినకుండా సెక్యూర్ చేస్తుంది.
మెగ్నీషియం వంటి తేలికైన లోహాలను ఉపయోగించడం వల్ల ఫోన్ బరువు తగ్గుతుంది. అంతేకాకుండా, ఫోన్ లోపల ఉన్న చిన్న స్క్రూలు, సపోర్ట్ స్ట్రక్చర్లకు స్టీల్ ఉపయోగిస్తారు. అన్ని భాగాలు గట్టిగా కనెక్ట్ అయ్యేలా చేస్తారు.
ఫోన్ నిజమైన శక్తి దాని సర్క్యూట్రీలో ఉంది. సర్క్యూట్ బోర్డ్‌ను నిర్మించడానికి రాగిని ఉపయోగిస్తారు ఎందుకంటే ఇది విద్యుత్తును త్వరగా, కచ్చితంగా మేనేజ్ చేస్తుంది. ముఖ్యంగా, కొన్ని సర్క్యూట్ భాగాలు బంగారం, వెండి పొరతో పూత పూస్తారు. ఫోన్‌లోని బాగాలు తుప్పు పట్టకుండా ఉండేందుకు బంగారపు పూతను వాడతారు. ఇది చాలా కాలం పాటు ఫోన్ పనితీరు దెబ్బ తినకుండా చూస్తుంది. వెండి కూడా ఒక అద్భుతమైన కండక్టర్, కాబట్టి ఇది సిగ్నల్, కనెక్షన్‌ను మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు.
బ్యాటరీల విషయానికి వస్తే, లిథియం కీలక పాత్ర పోషిస్తుంది. నేడు దాదాపు ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది, ఇది ఎక్కువ శక్తిని నిల్వ చేయడమే కాకుండా వాటిని తేలికగా, మన్నికగా చేస్తుంది. ఇది ఫోన్ చార్జింగ్ ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది.
ఫోన్ స్పీకర్లు - వైబ్రేషన్ మోటార్లు కూడా కొన్ని లోహాలు లేకుండా పనిచేయలేవు. అవి నియోడైమియం అనే లోహంతో తయారు అవుతుంది. ఇందులో చిన్న శక్తివంతమైన అయస్కాంతాలను కలిగి ఉంటాయి. ఈ అయస్కాంతాలు ధ్వనిని స్పష్టంగా, గట్టిగా వినిపించేలా చేస్తాయి. ఫోన్ వైబ్రేషన్‌ను ప్రభావితం చేస్తాయి.
ఈ విధంగా, స్మార్ట్‌ఫోన్ అనేది కేవలం ఒక గాడ్జెట్ కాదు, వివిధ విలువైన, ముఖ్యమైన లోహాల ప్రత్యేకమైన కలయిక. బహుశా అందుకే పాత ఫోన్‌లను రీసైక్లింగ్ చేయడం గురించి చాలా చర్చ జరుగుతోంది, ఎందుకంటే వాటిలో దాచిన బంగారం వెండి ఉండవచ్చు.
Frequently Asked Questions
స్మార్ట్‌ఫోన్‌లను ఏ లోహాలతో తయారు చేస్తారు?
ఫోన్‌లలో బంగారం, వెండి ఎందుకు ఉపయోగిస్తారు?
సర్క్యూట్‌లలోని భాగాలకు తుప్పు పట్టకుండా నిరోధించడానికి బంగారం పూత ఉపయోగిస్తారు. వెండి సిగ్నల్‌ను, కనెక్షన్‌ను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలలో ఏ లోహం కీలక పాత్ర పోషిస్తుంది?
లిథియం-అయాన్ బ్యాటరీలలో లిథియం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఎక్కువ శక్తిని నిల్వ చేయగలదు, బ్యాటరీలను తేలికగా, మన్నికగా చేస్తుంది.
స్పీకర్లు, వైబ్రేషన్ మోటార్లలో ఏ లోహం ఉపయోగిస్తారు?
స్పీకర్లు, వైబ్రేషన్ మోటార్లలో నియోడైమియం అనే లోహాన్ని ఉపయోగిస్తారు. ఇది శక్తివంతమైన అయస్కాంతాలను కలిగి ఉంటుంది, స్పష్టమైన ధ్వనికి సహాయపడుతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















