అన్వేషించండి

Apple iphone 17 Pro: 3 రోజులపాటు బురదలో ఉండిపోయిన ఐఫోన్ 17 ప్రో.. బయటకు తీసి షాకైన కస్టమర్

Iphone 17 pro News | కల్మెగి తుపాను వల్ల భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఒక వ్యక్తి ఐఫోన్ బురదలో పడినా, మూడు రోజుల తర్వాత ఏ ప్రాబ్లం లేకుండా పనిచేయడం వైరల్ అవుతోంది.

ఇటీవల ఫిలిప్పీన్స్, వియత్నాంలో కల్మెగి తుఫాను బీభత్సం సృష్టించడం తెలిసిందే. ఈ తుఫాను కారణంగా 100 మందికి పైగా మరణించగా, భారీగా ఆస్తి నష్టం సైతం సంభవించింది. కల్మెగి తుఫాను తర్వాత, ఒక ఐఫోన్ యూజర్ ఆశ్చర్యకరమైన సంఘటనను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. 3 రోజుల పాటు బురద, వరద నీటిలో తన ఐఫోన్ కూరుకుపోయిందని రెడిట్‌‌లో యూజర్ తెలిపాడు. ఆ తర్వాత అతను దాన్ని ఆన్ చేసినప్పుడు, ఎలాంటి సమస్య లేకుండా ఆన్ అయిందని, మంచి వర్క్ అవుతుందని చెప్పడం ట్రెండ్ అవుతోంది. 

చేతి నుండి జారి నీటిలో పడిపోయిన ఫోన్

కల్మెగి తుఫాను కారణంగా చాలా విధ్వంసం జరిగిందని యూజర్ పేర్కొన్నాడు. తన ఇల్లు కూలిపోయిందని, ఇంట్లోని సామాగ్రి కొట్టుకుపోయిందని తెలిపాడు. తుఫాను వచ్చిన 15 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో తనకు అర్థమైందన్నాడు. ఈ సమయంలో ఐఫోన్ చేతి నుంచి జారి వరద నీటిలో పడిపోయింది. తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత, అతను తన వస్తువులను వెతకడం ప్రారంభించినప్పుడు, బురదలో ఐఫోన్ దొరికింది. వెంటనే ఫోన్‌ను శుభ్రం చేసి ఛార్జింగ్‌లో పెట్టాడు. ఛార్జింగ్ తరువాత అనుమానంగానే ఆన్ చేయగా ఐఫోన్ 17 ప్రో ఏ ప్రాబ్లం లేకుండా వర్క్ అయినట్లు తెలిపాడు. ఆన్ చేయడానికి ఛార్జింగ్ పెట్టానని, బురదలో మూడు రోజులు కూరుకుపోయినప్పటికీ బాగా పనిచేస్తుందని, దానిపై ఎటువంటి గీతలు పడలేదు. ఇతర సమస్యలు కూడా రాలేదని హర్షం వ్యక్తం చేశాడు.  

ఐఫోన్ 17 ప్రో ఎంత మన్నికైనది?

Apple తీసుకొచ్చిన iPhone 17 Pro IP68 రేటింగ్ కలిగి ఉంది. అంటే ఇది వాటర్, డస్ట్, తేలికపాటి నీటి నిల్వను తట్టుకుని పనిచేస్తుంది. 30 నిమిషాల వరకు 6 మీటర్ల లోతు వరకు నీటిలో ఉంచినా సమస్య లేదని Apple చెబుతోంది. కానీ వాటర్ రెసిస్టెన్స్ శాశ్వతం కాదు. నిరంతరం ఉపయోగించిన తర్వాత కొంతకాలం తర్వాత దీని కెపాసిటీ తగ్గుతుంది. Apple లిక్విడ్ డ్యామేజ్‌ను వారంటీలో కవర్ చేయదని గుర్తుంచుకోండి. అంటే.. నీళ్లు లేదా ఇతర ద్రవాల వల్ల కలిగే డ్యామేజీని వారంటీలో కవర్ చేయరు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget