అన్వేషించండి

Most popular iphone in India: ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడుపోతున్న ఐఫోన్ ఏదో తెలుసా, ఐఫోన్ 17 మాత్రం కాదు

popular iphone in India | భారత్ లో ఐఫోన్ 16 విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వరుసగా రెండు త్రైమాసికాల నుండి విక్రయాల్లో ఐఫోన్ 16 అగ్రస్థానంలో ఉంది. ఈ ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ అవుతుంది.

Most popular iphone in India | వరుసగా రెండో త్రైమాసికంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ మోడల్‌గా ఐఫోన్ 16 నిలిచింది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ప్రకారం.. మెట్రో నగరాలతో పాటు చిన్న పట్టణాల్లో కూడా ఐఫోన్ 16కు మంచి డిమాండ్ ఉంది. దీపావళికి ముందు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ సమయంలో కూడా ఇదే మోడల్ అత్యధికంగా అమ్ముడైంది. ఇప్పుడు ఏడాది పూర్తికావడానికి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ సంవత్సరం భారతదేశంలో యాపిల్ కంపెనీ నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన ఐఫోన్ మోడల్ ఐఫోన్ 16 అని చెప్పవచ్చు. 

చిన్న పట్టణాల్లోనూ పెరిగిన డిమాండ్ 

మీడియా నివేదికల ప్రకారం, కౌంటర్‌పాయింట్ రీసెర్చ్‌లోని రీసెర్చ్ అనలిస్ట్ శుభమ్ సింగ్ మాట్లాడుతూ.. వరుసగా రెండో త్రైమాసికంలో ఐఫోన్ 16 అత్యధికంగా షిప్ చేయబడిన పరికరంగా నిలిచింది. చిన్న పట్టణాల్లో కూడా ఐఫోన్ 16కు డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు ప్రో మోడల్స్ అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి.

భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ 16 క్రేజ్

ఐఫోన్ 16 మోడల్‌పై భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అదే స్థాయిలో క్రేజ్ ఉంది. భారతదేశంలో ఇది రెండు త్రైమాసికాల నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న ఐఫోన్ మోడల్‌గా దూసుకెళ్తోంది. అయితే ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ మోడల్‌గా నిలిచింది. ఆఫ్రికా, జపాన్, మిడిల్-ఈస్ట్ దేశాలలో కూడా ఐఫోన్ అమ్మకాలు భారీగా పెరిగాయి. దీని కారణంగా దాదాపు 2 సంవత్సరాల తర్వాత, ఏదైనా ఐఫోన్ సిరీస్ బేస్ మోడల్ అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ గా iphone 16 నిలిచింది. 

ఐఫోన్ 16 ఫీచర్లు ఏమిటి?

యాపిల్ సెప్టెంబర్ 2024లో ఈ ఐఫోన్ 16ని లాంచ్ చేసింది. ఇది 6.1 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది HDR కంటెంట్ సపోర్ట్ మరియు 2,000 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో A18 ప్రాసెసర్ అమర్చారు. ఇది మల్టీ టాస్కింగ్, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను సులభంగా నిర్వహిస్తుంది. అధిక పనితీరుతో పాటు, ఈ ప్రాసెసర్ సమర్థవంతమైనది. రాబోయే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లకు ప్రాసెసర్ అనుకూలంగా ఉంటుంది. 

కెమెరా, బ్యాటరీ

ఐఫోన్ 16 వెనుక భాగంలో 48MP ఫ్యూజన్ కెమెరా, 12MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ముందు భాగంలో 12MP కెమెరా ఇచ్చారు. బ్యాటరీ విషయానికి వస్తే పూర్తి ఛార్జింగ్‌ పెడితే ఈ ఐఫోన్ 22 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను సపోర్ట్ చేస్తుందని యాపిల్ చెబుతోంది. 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

AP Recruitment Age Limit: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
AP Congress new incharge: ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు - పీసీ మోహన్ రాకతో జాతకం మారుతుందా? ఓటు బ్యాంకు తిరిగొస్తుందా?
ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు - పీసీ మోహన్ రాకతో జాతకం మారుతుందా? ఓటు బ్యాంకు తిరిగొస్తుందా?
Saifabad పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
Dhiraj Bommadevara Wins Gold: స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Recruitment Age Limit: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
AP Congress new incharge: ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు - పీసీ మోహన్ రాకతో జాతకం మారుతుందా? ఓటు బ్యాంకు తిరిగొస్తుందా?
ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు - పీసీ మోహన్ రాకతో జాతకం మారుతుందా? ఓటు బ్యాంకు తిరిగొస్తుందా?
Saifabad పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
Dhiraj Bommadevara Wins Gold: స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
Gannavaram News: గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
Telangana Assembly Protest Case: పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
Vinayaka Chavithi At Chandrababu Home: ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు Photos చూశారా
Hyderabad Crime News: అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
Embed widget