పోలీసులు స్మార్ట్‌ఫోన్‌లను ఎలా ట్రాక్ చేస్తారు! ఈ విధానం మీకు తెలుసా?
Published by: Shankar Dukanam
Image Source: Pixabay
ప్రతి ఫోన్ కు ఒక ప్రత్యేకమైన ID నంబర్ IMEI (International Mobile Equipment Identity) ఉంటుంది. పోయిన లేదా దొంగిలించిన ఫోన్లను ట్రాక్ చేయడానికి పోలీసులు ఈ నంబర్ను ఉపయోగిస్తారు.
Image Source: Pixabay
స్మార్ట్ ఫోన్ లలో వాడుతున్న సిమ్ కార్డు ల లొకేషన్‌ను టవర్ సిగ్నల్స్ ద్వారా గుర్తిస్తారు.
Image Source: Pixabay
ఫోన్ లోని GPS యాక్టివ్ గా ఉన్నప్పుడు, పోలీసులు ా ఫోన్ ఖచ్చితమైన లొకేషన్ ను తెలుసుకోవచ్చు.
Image Source: Pixabay
ఫోన్ ఏ మొబైల్ టవర్ కు కనెక్ట్ అయిందనే సమాచారం పోలీసులకు ఫోన్ లొకేషన్, కదలికలను గుర్తించడంలో సహాయపడుతుంది.
Image Source: Pixabay
ఫోన్ లో గూగుల్ అకౌంట్ లాగిన్ అయి, లొకేషన్ సర్వీస్ ఆన్ లో ఉంటే పోలీసులు గూగుల్ లొకేషన్ హిస్టరీ ద్వారా కదలికల్ని తెలుసుకోవచ్చు.
Image Source: Pixabay
ఫోన్ ఇంటర్నెట్ ఆన్లో ఉంటే పోలీసులు సోషల్ మీడియా ఖాతాలు, ఇన్‌స్టాల్ చేసిన యాప్స్ నుంచి లొకేషన్, యాక్టివిటీ వివరాలను పొందవచ్చు
Image Source: Pixabay
బహిరంగ స్థలాల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల ద్వారా పోలీసులు వినియోగదారుడి ఫోన్ లొకేషన్ ను తెలుసుకోవచ్చు.
Image Source: Pixabay
పోలీసులు కాల్, మెసేజ్ వివరాలు (CDR) తీసి ఫోన్ ఎక్కడ నుండి కాల్, మెసేజ్ చేస్తోందని చూస్తారు.
Image Source: Pixabay
ఒకవేళ ఫోన్ డివైజ్ డేటాను ఏదైనా క్లౌడ్ సర్వీస్ (ఉదాహరణకు ఐక్లౌడ్, గూగుల్ డ్రైవ్) లో భద్రపరిస్తే, పోలీసులు దానిని యాక్సెస్ చేసి లొకేషన్ గుర్తిస్తారు.
Image Source: Pixabay
ఫోన్లో యాంటీ- థెఫ్ట్ యాప్స్ (ఉదాహరణకు Find My Device లేదా Find My iPhone) ఇన్‌స్టాల్ చేస్తే.. పోలీసులు వాటి సహాయంతో ఫోన్ లొకేషన్ ట్రాక్ చేయవచ్చు.