స్మార్ట్‌ఫోన్‌లు అవసరమైన ఈ రోజుల్లో అందరూ ఖరీదైన ఫోన్‌లు వాడలేరు. అందుకే లోబడ్జెట్ ఫోన్‌లు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇవి తక్కువ ధరకు రావడమే కాదు అద్భుతమైన లక్షణాలు కలిగి ఉన్నాయి.
ఇక్కడ ప్రపంచంలోని కొన్ని చౌకైన మొబైల్ ఫోన్‌ల గురించి చెబుతున్నాము, వాటిలో కొన్ని ₹1,000 కంటే తక్కువ ధరలో ఉంటాయి.
ఐటెల్ 1112 అనేది కాల్స్, మెసేజింగ్ కోసం రూపొందించిన లోబడ్జెట్ ఫోన్. దీని ధర సుమారు ₹900-₹950. ఇది 1.8-అంగుళాల డిస్ప్లే, 800 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది రెండు సిమ్ కార్డులకు సపోర్టు చేస్తుంది.
లావా కెప్టెన్ N1 కూడా బడ్జెట్‌లో వచ్చే ఫోన్. దీని ధర సుమారు ₹1,200-₹1,500. ఇది 2.4-అంగుళాల కలర్ స్క్రీన్, ఫోల్డబుల్ కీప్యాడ్, FM రేడియో ఫీచర్స్ ఉన్నాయి.
నోకియా 105 మోడల్ ధర సుమారు ₹1,200-₹1,400. ఇది 1.8-అంగుళాల డిస్ప్లే, FM రేడియో, డ్యూయల్-సిమ్ సపోర్ట్, 800 mAh బ్యాటరీని కలిగి ఉంది.
మైక్రోమ్యాక్స్ X1i మోడల్ ధర సుమారు ₹1,500. ఇది 2.4-అంగుళాల డిస్ప్లే, కెమెరా సపోర్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ కలిగి ఉంది.
₹1,000 కంటే తక్కువ ధరకే లభించే iTel 2160 డ్యూయల్-సిమ్ సపోర్ట్ 1.8-అంగుళాల స్క్రీన్, మంచి బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది.
ఈ ఫోన్‌ల అతిపెద్ద ప్రయోజనాలు ఏమిటంటే అవి లోబడ్జెట్ ఫోన్లు, మన్నికైనవి ఉపయోగించడానికి సులభమైనవి. దీర్ఘ బ్యాటరీ లైఫ్, డ్యూయల్ సిమ్ సపోర్ట్,ఈజీ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉన్నాయి.
మీరు బడ్జెట్‌లో కాల్ చేయడానికి, మెసేజ్‌లు పంపడానికి ఫోన్ కావాలనుకుంటే, ఇవే ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఫోన్లు. ఈ ఫోన్లు తక్కువ ధరకే నమ్మకమైన మన్నికైన ఆప్షన్‌లు అందిస్తాయి.
వృద్ధులు లేదా పిల్లలు అయినా, ఈ ఫోన్లు ప్రతి ఒక్కరూ ఉపయోగించడానికి సులభం, సౌకర్యవంతంగా ఉంటాయి.