Taapsee Pannu : టాలీవుడ్ ఇండస్ట్రీపై ప్రశంసలు - సౌత్ ఇండస్ట్రీపై ఆరోపణలతో విమర్శలు... హీరోయిన్ తాప్సీ యూటర్న్
Taapsee Pannu Reaction : హీరోయిన్ తాప్సీ తన కామెంట్స్‌పై వెనక్కు తగ్గారు. సౌత్ ఇండస్ట్రీపై రీసెంట్‌గా ఆరోపణలు చేయగా విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీపై ప్రశంసలు కురిపించారు.

Taapsee Pannu Reaction About Comments On South Industry : హీరోయిన్ తాప్సీ రీసెంట్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీపై చేసిన కామెంట్స్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తం కాగా... తాజాగా ఆమె యూటర్న్ తీసుకున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లిన ఆమె... అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలనే ఉద్దేశంతో ప్యాడెడ్ బ్రా ధరించాలంటూ సౌత్ ఫిల్మ్ మేకర్స్ తనపై ఒత్తిడి తెచ్చే వారని ఆరోపణలు చేశారు.
వీటిపై తీవ్ర విమర్శలు వ్యక్తం కాగా... తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీపై తాప్సీ ప్రశంసలు కురిపించారు. తెలుగు సినిమాలో నటనకు ఎక్కువ ప్రాధాన్యం ఉండే పాత్రలు ఉంటాయని అన్నారు. 'తెలుగుతో పోలిస్తే తమిళంలో అలాంటి రోల్స్ చాలా తక్కువ. టాలీవుడ్ అందించినన్న మంచి పాత్రలు నాకు తమిళ సినిమా అందించలేదు. టాలీవుడ్ ఆడియన్స్‌కు నేనంటే చాలా అభిమానం. టాలీవుడ్‌లో వచ్చిన చాన్సెస్ నా విలువ పెంచాయి. అవి నా కెరీర్‌కు చాలా ఉపయోగపడ్డాయి.' అంటూ చెప్పారు.
Also Read : విజయ్ దేవరకొండ తాళి కట్టు శుభవేళ... రష్మిక ఎమోషనల్ - బెస్ట్ మూమెంట్ ఫర్ ఎవర్
అసలేం జరిగిందంటే?
తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ కోర్ట్ రూం డ్రామా 'అస్సీ' ప్రమోషన్లలో భాగంగా సౌత్ ఇండస్ట్రీపై రీసెంట్‌గా తాప్సీ కొన్ని కామెంట్స్ చేశారు. 'గ్లామర్ సీన్స్, సాంగ్స్‌కు సంబంధించి మరింత అందంగా కనిపించాలనే ఉద్దేశంతో ప్యాడెడ్ బ్రా ధరించాలని ఫిల్మ్ మేకర్స్ చెప్పేవారు. అలా ఒత్తిడి తెచ్చేవారు. షూటింగ్ సెట్‌లో అందరి ముందు అలాంటి మాటలు చెప్తే ఎంత అసౌకర్యంగా ఉంటుందో నాకు తెలుసు.
ఏదైనా సాంగ్స్ చేస్తున్నప్పుడు ఎవరైనా గమనిస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సౌత్, భోజ్ పురి సినీ ఇండస్ట్రీల్లో హీరోయిన్ల నాభిపై ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అసలు అక్కడ ఎందుకు ఎక్కువ ఫోకస్ చేస్తారో అర్థం కావడం లేదు. హిందీ సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్‌లో నాభిపై ఫోకస్ ఉండదని నేను చెప్పడం లేదు. సౌత్ సినిమాల్లో ఉన్నంతగా ఉండదని మాత్రం నేను చెప్పగలను.' అంటూ కామెంట్స్ చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు రాగా తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీని ప్రశంసించారు.
ఇక సినిమాల విషయానికొస్తే... టాలీవుడ్‌కు బ్రేక్ ఇచ్చిన తాప్సీ రీసెంట్‌గా బాలీవుడ్‌లో 'అస్సీ' మూవీలో నటించారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'ఝుమ్మంది నాదం' మూవీతో తాప్సీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా అవకాశాలు అందుకున్నారు. లాస్ట్‌గా 2022లో 'మిషన్ ఇంపాజిబుల్' మూవీలో ఆమె నటించారు. ఆ తర్వాత బాలీవుడ్‌కు షిఫ్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆమె 'భారత భాగ్య విధాత' అనే పొలిటికల్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు.
























