అన్వేషించండి

AI Teaching In Telangana: తెలంగాణలో ఒకటో తరగతి నుంచి AI బోధన - 13 బడుల్లో పైలట్ ప్రాజెక్టు అమలు 

Telangana Latest News: మార్చి 15 నుంచి నాగర్‌కర్నూల్ జిల్లాలోని 13 పాఠశాలల్లో AI బోధన ప్రారంభించనుంది తెలంగాణ ప్రభుత్వం. చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది.

Telangana Latest News: తెలంగాణలో ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఒకటో తరగతి నుంచి అర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌ ద్వారా బోధించాలని నిర్ణయించింది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఈ బోధన చేపట్టనున్నారు. మారుతున్న టెక్నాలజీని అందిపుకొచ్చని విద్యలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. 15వ తేదీ నుంచి నాగర్‌కర్నూల్ జిల్లాలోని 13 పాఠశాలలను ఎంపిక చేసి ఈ AIతో  పాఠాలు బోధించబోతున్నారు. 

నాగర్ కర్నూల్ జిల్లాలోని పది మండలాల్లో 13 పాఠశాలలను ఈ AI సాఫ్ట్‌వేర్‌తో బోధించేందుకు ఎంపిక చేశారు. పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టే ఈ ఏఐ బోధన విజయవంతం అయితే దీన్ని రాష్ట్రవ్యాప్తంగా స్కూల్స్‌కు అప్లై చేయనున్నారు. ఇప్పటికే ఆయా స్కూల్స్‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 1200 మంది పిల్లలకు ఏఐ విద్య నేర్పిస్తారు. దీని కోసం ఒక్కో స్కూల్‌కి పది వరకు కంప్యూటర్లు పంపిణీ చేశారు. ఆయా పాఠశాలలో ఉన్న విద్యార్థులను బట్టి వారికి డెస్క్‌టాప్‌లు సరఫరా చేశారు. 13 బడులకు 70కిపైగా కంప్యూటర్లు ఇతర ఎక్ససిరీస్‌ అందజేశారు.  

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఏఐ బోధనకు ఎంపికైన పాఠశాలలు ఇవే:- 
1. వట్టెం ప్రాథమిక పాఠశాల(బిజినపల్లి మండలం) 
2. జూపల్లి ప్రాథమిక పాఠశాల(చారగొండ మండలం) 
3. కొండ్రావుపల్లి ప్రాథమిక పాఠశాల(కోడేరు మండలం)  4. ఎల్లూరు ప్రాథమిక పాఠశాల(కొల్లాపూర్ మండలం) 
5. ఎన్మనబెట్ల ప్రాథమిక పాఠశాల(కొల్లాపూర్ మండలం)  6. గండ్రావుపల్లి ప్రాథమిక పాఠశాల(పెద్దకొత్తపల్లి మండలం) 
7. చంద్రకల్ ప్రాథమిక పాఠశాల(పెద్దకొత్తపల్లి మండలం) 
8. కొండూరు ప్రాథమిక పాఠశాల(పెంట్లవెల్లి మండలం) 
9.ఐతోల్ ప్రాథమిక పాఠశాల(తాడూరు మండలం) 
10. ఆలేరు ప్రాథమిక పాఠశాల(తెలకపల్లి మండలం) 
11. మారేపల్లి ప్రాథమిక పాఠశాల(తిమ్మాజిపేట మండలం) 
12. చేగుంట ప్రాథమిక పాఠశాల(తిమ్మాజిపేట మండలం) 
13. వంగూర్ ప్రాథమిక పాఠశాలను (వంగూరు మండలం)

విద్యార్థులను గ్రూప్‌గా చేసి ఏఐ ద్వారా బోధిస్తారు. వాళ్ల సిలబస్‌లో ఉన్న పాఠాలనే ఈ కోర్సులో చేర్చారు. వాళ్లకు అర్థమయ్యే సరళమైన భాషలో నేర్పిస్తారు. వాళ్లకు అర్థం కాకుంటే ఇంకా మరింత సులభంగా నేర్పించనున్నారు. భిన్నమైన వెర్షన్స్‌లో పిల్లలకు ఈ కోర్సు అందిస్తారు. ఈకే-స్టెప్ అనే కంపెనీ తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌తోనే ఈ బోధన చేపట్టనున్నారు.   

చాలా పాఠశాలల్లో విద్యార్థులు చదువుల్లో వెనుకబడుతున్నారు. కొందరికి చదవడం, రాయడం రావడం లేదు. మరికొందరు లెక్కల్లో వీక్‌గా ఉంటున్నారు. అలాంటి వారిని ఎంపిక చేసి ఈ ఏఐద్వారా బోధిస్తారు. పాఠాలు పిల్లలకు అర్థమయ్యే ఈజీ లాంగ్వేజ్‌లో ఈ పాఠాలు ఉంటాయి. వీటి ద్వారా చదువులో వెనుకబడిన పిల్లల్లో మార్పు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. 

ప్రాథమిక విద్యా స్థాయిలో AI ఆధారిత టూల్స్ ఉపయోగించి విద్యార్థుల్లో రాసే, చదివే స్కిల్స్‌ను మెరుగుపరచనున్నారు. వారిలో చిన్న చిన్న లెక్కలు చేసుకునేలా అవగాహన కల్పించనున్నారు. కాస్త మెరుగ్గా ఉన్న విద్యార్థులకు అడ్వాన్స్డ్ విషయాలను నేర్పిస్తారు. వారిలో బలహీనతలు గుర్తించి వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలు కూడా తెలియజేస్తారు. దీని ద్వారా అందరి విద్యార్థలకు లెవల్‌ప్లేయింగ్‌ ఫీల్డ్ సెట్ చేయనున్నారు. ఇందులో ఉపాధ్యాయులకి కూడా కొన్ని సూచలు సలహాలు ఇవ్వబోతున్నారు. బోధనలో టెక్నాలజీ వాడకంపై వాళ్లకు శిక్షణ ఇస్తారు. 

 విద్యాబోధనలో లెటెస్ట్ టెక్నాలజీ వాడకంపై వివిధ రాష్ట్రాల్లో అమలు అవుతున్న విధానాలపై ప్రభుత్వం స్టడీ చేసింది. ముఖ్యంగా కేరళలో అమలు చేస్తున్న విధానాల గురించి అధ్యయనం చేసింది. అన్ని ప్రాంతాల్లో అమల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్‌ను అడాప్ట్ చేసుకొని ప్రయోగాత్మకంగా ఇక్కడ అమలు చేయబోతోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget