Naga babu Indirect Counters on Varma | టీడీపీ ఇన్ ఛార్జి వర్మపై నాగబాబు పరోక్ష కౌంటర్లు | ABP Desam
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం చాలా ముందుగానే ఖరారైపోయిందని...ఎవరైనా పవన్ గెలుపు కు కారణం నేనే అని చెప్పుకునే వాళ్లుంటే అది వాళ్ల ఖర్మ అన్నారు ఎమ్మెల్సీ నాగబాబు. పరోక్షంగా పిఠాపురం టీడీపీ ఇన్ ఛార్జ్ వర్మపైనే నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారా అన్న సందేహాలను రేకెత్తిస్తున్నాయి. ఇటీవల కాలంలో వర్మ కాస్త స్వరం మార్చి కూటమి నేతలపైనే అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలుసుకున్న జనసేన అప్పటి నుంచి వర్మపై ఆచితూచి మాట్లాడుతూనే వస్తోంది. పవన్ కు ఎమ్మెల్యే సీటు త్యాగం చేయటం ద్వారా పోటీ చేయలేకపోయిన వర్మకు ఎన్నికల సమయంలో పవన్ బహిరంగ హామీ ఇచ్చారు. తను గెలిచి పార్టీ అధికారంలోకి వస్తే వర్మను సముచితంగా గౌరవించుకుంటామని అప్పుడే ప్రకటించిన పవన్ కళ్యాణ్...ఆ తర్వాత వర్మను పట్టించుకోవటం లేదనేది ఆ రెండు వర్గాల మధ్య మాటల దాడికి కారణమవుతోంది. ఇప్పుడు ఇదే విషయంపై నాగబాబు కామెంట్స్ చేయటంతో మళ్లీ కూమిటలో సెగలు రేగించటం ఖాయంగా కనిపిస్తోంది.





















