Pawan Kalyan Speech At Janasena Plenary: పిఠాపురం జయకేతనంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ గర్జన
Pawan Kalyan Speech At Janasena Plenary : జయకేతనంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గర్జించారు. అదిరిపోయే స్పీచ్‌తో అదరగొట్టారు. పిఠాపురంలో ఆయన ఇచ్చిన ప్రసంగానికి తెలుగు రాష్ట్రాలు కంపించాయి.

Pawan Kalyan Speech At Jana Sena plenary : చాలా భయాలు, బాధ్యతలుండే సగటు మధ్య తరగతి వ్యక్తిగా ఎదిగి, ప్రజల కోసం పని చేయాలనే తలంపుతో జనసేన పార్టీని ప్రారంభించి వంద శాతం స్ట్రయిక్ రేటు సాధించడం ప్రజల ఆశీర్వాదం, దేవుడి రాత అన్నారు. తప్పును తప్పు అని, ఒప్పును ఒప్పు అని చెప్పడమే నా సిద్ధాంతం అని పేర్కొన్నారు. పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం ‘జయ కేతనం’ సభలో పవన్ ప్రసంగించారు.
"జనసేన ఏర్పాటు టైంలో చెప్పిన ఇల్లేమో దూరం అన్న డైలాగ్‌ను మరోసారి చెప్పారు. అన్ని ఒక్కడినే అయ్యి... 2014లో జనసేన పార్టీని స్థాపించాను. భావ తీవ్ర ఉంది కనుకే 2018లో పోరాట యాత్ర చేశాం. ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశాం. ఓడినా అడుగు ముందుకే వేసాం. మనం నిలబడ్డం పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కున్నాం... నాలుగు దశాబ్ధాల టీడీపీని నిలబెట్టాం..."
"మనం ఓడిపోయినప్పుడు మీసాలు మెలేశారు. తొడలు కొట్టారు. జబ్బలు చరిచారు. మన ఆడపడుచులను హింసించారు. ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఇదేం న్యాయం అనిడిగితే కేసులు పెట్టారు. జైళ్లో పెట్టారు. నిర్బందంలోకి తోశారు. నాలుగు దశాబ్ధాల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసుల్లో పెట్టారు. టీడీపీ కేడర్‌ను బయటకు రాకుండా భయపెట్టారు. నాలాంటి నాయకుడిని అడ్డుకోవడానికి చేయని కుట్రలేదు. వేయని కుతంత్రం లేదు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అని ఛాలెంజ్ చేసిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం."
"దేశమంతా తలతిప్పి చూసేలా వంద శాతం స్ట్రైక్ రేటుతో ఘన విజయం సాధించాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం. ఇవాళ జయకేతనం ఎగరేస్తున్నాం. "
భరత భూమి నేర్పిందో ప్రజాకోటి ఇచ్చిందో తెలియదు కానీ అంటూ దాశరథి చెప్పిన మాటతో తన అసలు ప్రసంగం ప్రారంభించారు. మబ్బుల్లో పరుగెత్తే పిడుగులు వేట కోసం బయటకొచ్చిన కొదమ సింహాల్లా దాష్టిక ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని నిలిపారు అని జనసైనికులను ప్రశంసించారు.
"కోటి దివిటీల కాంతి జ్యోతి తెలంగాణకు కరెంటు షాక్ తగిలి చనిపోయిన నాకు కొండగట్టు ఆంజనేయ దీవెన, ప్రజల దీవెనతో నాకు పునర్జన్మ ఇచ్చిన తెలంగాణకు నా వందనాలు. మా ఆడపడుచుల పోరాట స్ఫూర్తిని మర్చిపోలేను. అందరి దృష్టిలో మీరు రాణి రుద్రమ్మలు, వీరనారి గున్నమ్మలు, మా జనసేన ఆడపడుచులు లేలేత కాంతి కిరణాలు, తేడా వస్తే కాల్చి బూడిద చేసే లేజర్ బీమ్‌లు వాళ్లకు నేను రుణపడి ఉంటాను."
"మన ఆవిర్భావ దినోత్సవం రోజున హోలీ రావడం దైవ సంకల్పం. దేశ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు"
"తమిళనాడు పర్యటనకు వెళ్తే అందరూ నాకు ఎంతో ప్రేమను ఇచ్చారు. తమిళనాడులో పెరిగిన వాడిని." తమిళనాడు ప్రజలందరికీ నమస్కారాలు చెబుతూ తమిళ కవిత్వం చదివి వినిపించారు.
"మహారాష్ట్రలో రాజకీయ అభిమానులు ఉంటారని వెళ్లేంత వరకు తెలియదు. నన్ను రమ్మని 2014ను అడుగుతున్నారు కుదర్లేదు. మొన్న మాత్రం కచ్చితంగా రావాలని చెప్పారు. ఈసారి ప్రచారం చేశాను. ఈసారి మనం ప్రచారం చేసిన ఒక్కసీటు తప్ప అన్ని ప్రాంతాల్లో గెలిచింది ఎన్డీఏ. " చత్రపతి శివాజీకి సంబంధించిన మరాఠీ పంక్తిని చదివి వినిపించారు.
"2014 ఒక్కడినే కూర్చొని ఆలోచించాను. రాజకీయాలపై అంతకు ముందు కసరత్తు చేయలేదు. 2003లో నాన్నకు చెప్పాను. రాజకీయాల్లోకి వెళ్తనని అంటే మంచి కెరీర్ పెట్టుకొని ఈ పని ఏంటని అనుకున్నారు. సినిమా నాకు ఉపకరణం అయ్యింది. సమాజం చూసి పెరిగాను అనే విషయం అప్పుడు చెప్పలేకపోయాను. గద్దరు ఎలా పరిచయం అంటే.. ఖుషి సినిమా చూసి మా అన్నయ్యను పట్టుకొని నన్ను కలిశారు. మా అన్నయ్య ఫోన్ చేసి గద్దర్ నిన్ను కలుస్తారని అన్నారు. నీ భావన అర్థమైందని ఆరోజు చెప్పారు. అప్పటి నుంచి ఆయనతో నాకు స్నేహం ఏర్పడింది. 2006లో పుస్తకాలు చదువుతూ సినిమాలు చేశాను. అందుకే నా సినిమాలు అప్పట్లో మీకు నచ్చకపోవచ్చు. అప్పుడు ప్రకాశం జిల్లాకు చెందిన ప్రొఫెసర్ ఢిల్లీలో పని చేస్తున్న వ్యక్తి నన్ను కలిసి రాజకీయాల్లోకి వస్తారా అని అడిగారు. మీరు సంసిద్ధమంటే మేం రెడీ అన్నారు. ఇన్ని కోట్ల మందిని కట్టిపడేసే మెచ్యూరిటీ నాకు లేదని అప్పుడు చెప్పాను. ఆయన ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఫ్రొపెసర్ తిరుపతి రాముడు. ఆయన ఎప్పుడూ నాకు తోడుగా నిలబడ్డారు. అలాంటి వ్యక్తికి నేను ఇవ్వగలిగింది ఒకటే నా గుండెల నుంచి ప్రేమను మాత్రమే ఇవ్వగలను."
"చంటీ సినిమాలో హీరోయిన్‌ను ఎలా పెంచారో మా ఇంట్లో నన్ను అలా పెంచారు. వీడికి ఆస్త్మా ఉందని ఎక్కడికీ పంపించలేదు. ఒకరోజు చెన్నైలో అన్నా నగర్‌లో కంప్యూటర్ కోర్సు చేసే వాడిని. ఇంటికి వెళ్లడం లేట్ అయింది. ఇంట్లో ఆడిపిల్ల కనిపించకపోతే ఎలా ఉంటుందో అలా ఉంది."
"అలాంటి నేను పాలిటిక్స్ చేస్తానని సినిమాలు చేస్తానని ఎవరూ ఊహించలేదు. 18 లేదా 20 ఏళ్ల వయసులో లేటుగా వచ్చానంటే అర్థం చేసుకోవచ్చు. తొలిప్రేమ చేస్తున్న టైంలో కూడా సంగీత్ థియేటర్‌లో సినిమాకు వెళ్లాను. సెకండ్ షో చూసి ఇంటికి వచ్చే సరికి నాన్న దారుణంగా తిట్టారు. నేను హీరోను అన్న సంగతి మర్చిపోకు అంటే ఎక్కువ తిట్టాడు. అర్థరాత్రి తిరుగుల్లేంటి అని తిట్టారు.
అలాంటి నేను ఇలా రాజకీయాలు చేయాలంటే భగవంతుడు రాసిన రాత కాకపోతే ఏంటీ. ఇదంతా భగవంతుడు మాయ తప్ప నాది కాదని నాకు తెలుసు. నాలోని భావతీవ్రత పార్టీ పెట్టేలా చేసింది. కొంత జ్ఞానం వచ్చాక నేను ఊరికే కూర్చుంటాను అంటే జీవితం అలా ఉండనివ్వదు. అలా పాలిటిక్స్‌లోకి వచ్చాను."
"సగటు మనిషి చాలా భయాలు, బాధ్యతల మధ్య జీవితం కొనసాగించాలి. సన్నని గీత మధ్య బతకాలి. అరిటాకు లాంటి జీవితం. అలాంటి కోట్లాది మందిని ప్రభావితం సినిమా కానీ, రాజకీయాలు కానీ బాధ్యతను ఇచ్చాను. అలాంటి సినిమాలు కూడా చాలా ఆలోచించి చేశాను."
"నేను జనసేన కోసం ప్రతిపాదించిన ఏడు సిద్ధాంతలు మథించి మీ ముందు పెట్టాను. వ్యాధి చికిత్స కంటే వ్యాధి నివార చాలా మేలు అని నమ్ముతాను. చెగువేరా డాక్టర్ అయి ఉండి ఆ వృత్తిని వదిలి ప్రజల కోసం పోరాడిన విధానం నాకు ఇష్టం."
"భిన్నమైన వ్యక్తుల్లో ఏకత్వాన్ని చూడటం పవన్ ఐడియాలజీ. ఒక్కొక్కరిలో నచ్చిన అంశాన్ని తీసుకొని వ్యక్తిగతంగా బలపడటం నేర్చుకున్నాను. అందరిలా చదువుకోకపోవచ్చు. జ్ఞానాన్ని సంపాదించడం ఇప్పటి వరకు ఎప్పుడూ ఆపలేదు. ఇంత అవగాహన, సామాజిక పరిజ్ఞానం సిమాలు చేసుకునే వాడికి ఎలా ఉంటుందనే మీ అభిప్రాయమా. తెల్లగెడ్డంతో సామాన్యుడికి అర్థం కాని భాషలో మాట్లాడాలా. పోనీ పార్టీ పెట్టాలంటే... నాన్న సీఎ అయ్యి ఉండాలా... మామయ్య కేంద్రమంత్రి అయ్యిఉండాలి. బాబాయ్‌ను చంపేంచి ఉండాలని ఎక్కడా రాసి లేదు కదా."
"దశాబ్ధం పాటు ఒంటరిగా పార్టీని మోయాలి అంటే ఎన్ని తిట్లు ఎన్ని అవామానాలు భరించాలి. ఎన్ని పోగట్టుకోవాలి. వ్యక్తిగత జీవితం నుంచి నా ఆరోగ్యం వరకు ఎన్ని పోగొట్టుకోవాలి. అందుకే జయకేతనం ఆనందాన్ని ఇచ్చింది. రెండో కుమారుడిని కూడా ఎత్తుకోలేనంతగా బలహీనపడిపోయాను. రాజకీయాల్లో ఉండాలి అంటే రెండు ఉండాలి... పవర్ హంగ్రీ ఉండాలి. లేదా సైద్ధాంతిక బలం ఉండాలి. వ్యక్తిగతా ఎదగాలి పదవే ముఖ్యం. దౌర్జన్యాలు చేసి కూడా రాజకీయాల్లోకి రావచ్చు కానీ నేను సైద్ధాంతిక మార్గాన్ని ఎంచుకున్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అలానే బతికాను. అందుకే నేను సమాజ సమతౌల్యత, భావితరాల భవిష్యత్, దేశ అంతరింగ భద్రత, శతృదేశాల దాడులు చూసి ఆలోచించి దశాబ్దం నలిగి గుండె రగిలి అందరిలోనూ చైతన్యం రగిలించి ఇవాళ జనసేన చైతన్యం ఎగరేస్తున్నాం. "
"నదే అనేక రకాలుగా మారుతుంది. చాలా విభిన్నంగా చూడాలి. నేను మార్పు కోసం వచ్చిన వాడిని ఓట్ల కోసం వచ్చే వాడిని కాదు. ఎవరో వస్తారని నేను ఏదీ చేయను. మార్పు సహజం. ఎప్పుడూ అనాలోచితంగా అడుగు వేయను. పదేళ్లలో నిలబడ్డాం. బలపడ్డాం. నన్ను బూతులు తిట్టి ప్రసార మాధ్యమాల్లో డిబేట్స్ పెడితే ఇంతకు మించిన సమస్యలు లేవా అని అనుకునే వాడిని. పీహెచ్‌డీలు చదివి ఉద్యోగాలు రాకపోతే రాజకీయాల్లో ఉన్న వాళ్ల వద్దకు వేల కోట్లు ఎలా వచ్చాయనే ఆలోచన చేయాలి. ఒక్కడికి కోపం వస్తే జనసేన పుట్టింది మరి లక్షల మందికి కోపం వస్తే మార్పు ఎలా ఉంటుందో చూసుకోండి. భవిష్యత్‌లో ఎలా ముందుకెళ్లాలనేది ఆలోచించాలి. "





















