అన్వేషించండి

Morning Routine : చిన్న మార్పులతో మీలోని బెస్ట్ వెర్షన్​ని లోడ్ చేసేయండిలా.. ఉదయాన్నే ఈ 5 సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి

Small Changes Big Impact : ఉదయాన్నే అలసటగా.. మైండ్ అంతా ఫాగ్​గా అనిపిస్తుందా? అయితే మీ డేని ఇలా స్టార్ట్ చేయండి.. సింపుల్ రిజల్ట్స్​తో బెస్ట్ వెర్షన్​ని చూస్తారు. 

Morning Habits to Boost Your Mind and Body : ఉదయాన్నే త్వరగా నిద్రలేస్తారు కానీ.. రోజుని యాక్టివ్​గా ఉంచుకోలేరు కొందరు. బెడ్​పై నుంచి దిగినా.. మైండ్ ఇంకా నిద్ర దగ్గరే ఆగిపోతూ ఉంటుంది. దీంతో వారు రోజంతా మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ అన్నట్టే ఉంటారు. లేదంటే ఏమి చేయకపోయినా అలసిపోయినట్లు ఫీల్ అవుతూ.. చేయాల్సిన పనిపై ఫోకస్ చేయకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు కూడా వారిలో ఒకరా? అయితే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి. 

చిన్న చిన్న మార్పులే జీవితంలో పెద్ద ఫలితాన్ని ఇస్తాయని గుర్తించుకోవాలి. అయితే ఈ చిన్న పనిని చేయడం కష్టంగా అనిపించొచ్చు. కానీ ఫాలో అయితే వర్త్ వర్మ వర్త్ అంటారు. మీ ఉదయాన్ని ప్రశాంతంగా.. రోజుని యాక్టివ్​గా.. వర్క్​లో ఫోకస్ ఉండేలా మిమ్మల్ని మీరు మార్చుకోవాలనుకుంటే ఈ 5 సింపుల్ టిప్స్​ని ఫాలో అయిపోండి. ఇంతకీ ఆ టిప్స్ ఏంటి? వాటి వల్ల కలిగే మార్పు ఏంటో చూసేద్దాం. 

డోపమైన్ డిటాక్స్ (Dopamine Detox)

చాలామంది ఉదయాన్నే చేసే మిస్టేక్ ఏంటి అంటే ఫోన్​తో ప్రారంభిస్తారు. దీనివల్ల మీ మైండ్​కి నిద్రలేచి ప్రాసెస్ అయ్యే టైమ్ ఉండదు. పైగా నెగిటివ్ ఆలోచనలు పెరిగే అవకాశం చాలా ఎక్కువ. ఉదయం నిద్రలేచిన వెంటనే ఫోన్ జోలికి వెళ్లకుండా ఓ ఐదు నిమిషాలు నిటారుగా కూర్చోంది. మీ బ్రెయిన్ కామ్ అవ్వడానికి.. రోజుని ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు లేకుండా మొదలు పెట్టడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. జస్ట్ ఏమి చేయకుండా రిలాక్స్ అవ్వడానికి ట్రై చేయండి. ఇది మీకు పాజిటివిటీని ఇచ్చి.. మెదడు రష్ అవ్వకుండా క్లియర్​గా ఉండేలా హెల్ప్ చేస్తుంది.

హైడ్రేషన్ (Hydration Boost)

మీ డేని కాఫీ, టీలతో ప్రారంభించే బదులు.. ఓ పెద్ద గ్లాసు నీటితో ప్రారంభించండి. కుదిరితో దానిలో ఓ చిటికెడు ఉప్పు, నిమ్మరసం కూడా వేసుకుని తాగొచ్చు. ఇది మీ శరీరాన్ని రీహైడ్రేట్ చేస్తుంది. నిద్ర తర్వాత శరీరానికి కావాల్సిన హైడ్రేషన్​ని అందించి యాక్టివ్​గా ఉండేలా  చేస్తుంది. రాగి గ్లాసులో రాత్రంతా నీరు ఉంచి ఉదయం తాగినా మంచిదే. 

సూర్యకాంతి.. (Natural Light Exposure)

నిద్రలేచిన తర్వాత చాలామంది రూమ్​లోనే ఉంటారు. అలా కాకుండా.. సహజమైన కాంతి కోసం బాల్కనీలోకి వెళ్లాలి. కనీసం ఇంటి నుంచి బయటకు వస్తే సహజమైన సూర్యకాంతి మీ సొంతమవుతుంది. ఓ పదినిమిషాలు సూర్యరశ్మిని తీసుకోండి. దీనివల్ల సిర్కాడియన్ రిథమ్ రెగ్యులేట్ అవుతుంది. సంతోషాన్ని ఇచ్చే డోపమైన్​ హార్మోన్​ను రిలీజ్ చేస్తుంది. ఇది మీ డేకి కిక్​ స్టార్ట్ అని చెప్పవచ్చు. 

ఒక్క మూమెంట్.. (Explosive Movement)

రోజూ ఒక హై ఇంటెన్సిటీ మూవ్ చేయండి. జంప్ స్క్వాట్, క్లాప్ పుష్ అప్ వంటివి చేయొచ్చు. కనీసం రోజుకు 10 నుంచి 15 సెకన్లు ఈ మూవ్స్​లో ఏదొకటి చేయడానికి ట్రై చేయండి. రోజూ వ్యాయామం చేస్తే మరీ మంచిది. కానీ చేయడానికి సమయం దొరకని వాళ్లు కనీసం రోజులో బాడీ మొత్తాన్ని కదల్చగలిగే ఒక్క మూమెంట్ చేస్తూ ఉండండి. మీ ఎనర్జీ రీసెట్ అవుతుంది. బ్రెయిన్​కి ఆక్సిజన్ అంది యాక్టివ్​గా ఉంటారు. 

కోల్డ్ షాక్ (Cold Shock Reset)

వీలైనంత వరకు ఉదయాన్నే ఫ్రెష్ అయి.. స్నానం చేసేయండి. చాలామంది రిలాక్స్ అవ్వడం కోసం వేడి నీళ్లతో స్నానం చేస్తూ ఉంటారు. మీరు కూడా అలాంటి వారు అయితే.. చివర్లో మాత్రం చల్లని నీటిని ఒంటిపై పోసుకోండి. దీనిని కోల్డ్ షాక్ అంటారు. దీనివల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుంది. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. మైండ్, బాడీ రెండూ యాక్టివ్ అవుతాయి. 

ఇవన్నీ చాలా సింపుల్ టిప్స్. కానీ రోజూ చేస్తూ ఉంటే మీలోని మార్పులు కచ్చితంగా మీకు తెలుస్తాయి. మీ బెటర్ వెర్షన్​ని చూసుకోవాలనుకుంటే రోజూ వీటిని ఫాలో అవ్వండి. పనిపై ఫోకస్ పెరగడంతో పాటు.. రోజంతా ఎనర్జిటిక్​గా ఉంటారు. శారీరకంగా, మానసికంగా హెల్తీ లైఫ్​ని లీడ్ చేయడానికి ఇవి బేబి స్టెప్స్​ అనుకోండి. మంచి ఫలితాలు తప్పక వస్తాయి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
Hair Oiling Tips : జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
Bugs in Rice : బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget