Horoscope Today: ఈ రాశులవారు భావోద్వేగంపై కన్నా ప్రాక్టికాలిటీపై దృష్టి పెట్టాలి!
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మార్చి 16 రాశిఫలాలు
మేష రాశి
ఈ రాశివారు పెద్దలను విస్మరించకూడదు. గుండె రోగులు ఒత్తిడి తీసుకోకుండా ఉండాలి. మీ మాటలను మీ జీవిత భాగస్వామితో పంచుకోండి. జీవితంలో వచ్చే ఇబ్బందులకు పరిష్కారం ఉంటుంది. చట్టపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఉండవచ్చు. ( మేష రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
వృషభ రాశి
వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. ఆర్ట్ ఫీల్డ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులకు రోజు మంచిది. సాయంత్రం ఎలాంటి చర్చలు పెట్టుకోవద్దు. సానుకూల శక్తి ప్రభావం మీపై ఉంటుంది. ఆరాధన, ధ్యానంపై ప్రత్యేక ఆసక్తి పెరుగుతుంది. (వృషభ రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
మిథున రాశి
వ్యాపారంలో కొన్ని అడ్డంకులు ఉండవచ్చు. జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలుంటాయి. కుటుంబానికి తగినంత సమయం ఇవ్వండి లేకపోతే ఇబ్బంది తప్పదు. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఫైనాన్స్ -సంబంధిత కార్యకలాపాలు ప్రయోజనకరంగా ఉంటాయి. (మిథున రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
కర్కాటక రాశి
ఈ రాశివారు మంచి ఆఫర్లు పొందుతారు. భావోద్వేగాల కన్నా ప్రాక్టికాలిటీని అవలంబించండి. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన గొడవలు ఓ కొలిక్కి వస్తాయి. విద్యార్థులకు శుభసమయం. మతపరమైన ప్రయాణం చేయాల్సి వస్తుంది (కర్కాటక రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
సింహ రాశి
సింహ రాశివారి ప్రవర్తన భాగస్వామితో సరిగ్గా ఉండాలి. గొంతుకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారంలో మీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగులపై ఉన్నతాధికారులు కోపంగా ఉండొచ్చు (సింహరాశి ఉగాది 2025 ఫలితాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
కన్యా రాశి
ఈ రోజు మీరు చెడు వార్తలు వినాల్సి రావొచ్చు. ఇంటి పునరుద్ధరణకోసం ప్లాన్ చేస్తారు. ఆదాయంలో నిశ్చయత ఉంటుంది. విద్యార్థులు అధ్యయనాలతో ఏదైనా కొత్త శైలిని నేర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఆరోగ్యం గురించి నిర్లక్ష్యంగా ఉండకండి.
తులా రాశి
ఈ రోజు కొత్త ఆలోచన ప్రభావం మీపై ఉంటుంది. కుటుంబంలో ఉండే సమస్యలను పరిష్కరించుకుంటారు. ప్రణాళికల ప్రకారం, మీరు పని పూర్తయినందుకు సంతోషంగా ఉంటారు. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది.
వృశ్చిక రాశి
ఈ రోజు ప్రణాళికాబద్ధంగా చేసే పనులు ప్రయోజనకరంగా ఉంటాయి. మీరున్న రంగంలో కష్టపడాల్సి వస్తుంది. చట్టపరమైన విషయాల గురించి జాగ్రత్త వహించండి. ఆస్తులకు సంబంధించిన విషయాలపై ఆసక్తి ఉంటుంది
ధనస్సు రాశి
ఈ రోజు ఇంట్లో అసమ్మతి ఉంటుంది. విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచండి. మహిళలుఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు తప్పు అలవాట్ల వైపు వెళ్లకుండా జాగ్రత్త వహించండి. ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉంటుంది.
మకర రాశి
ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ప్రభావవంతమైన వ్యక్తులతో సంబంధాలు బలంగా ఉంటాయి. మీకు అదృష్టానికి పూర్తి మద్దతు లభిస్తుంది. వైవాహిక జీవితం చాలా శృంగారభరితంగా ఉంటుంది. శత్రువులు మిమ్మల్ని నిరాశపరిచేందుకు ప్రయత్నిస్తారు.
కుంభ రాశి
ఈ రోజు అధిక ఒత్తిడి తీసుకోకుండా ఉండాలి. సాహిత్యంతో సంబంధం ఉన్న వ్యక్తుల పట్ల గౌరవం పెరుగుతుంది. ఫీల్డ్‌లో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇంట్లో ఒక వేడుక కోసం సన్నాహాలు ఉండవచ్చు. ప్రయాణాలకు రోజు మంచిది. ఉద్యోగ ఇంటర్వ్యూలో విజయం సాధించవచ్చు.
మీన రాశి
ఈ రాశివారికి స్నేహితుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. కుటుంబ పనులతో బిజీగా ఉంటారు. ఆగిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. తగినంత నిద్ర అవసరం.
గమనిక: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

