శ్రీ విశ్వావసు నామ సంవత్సరం లో సింహరాశివారికి మంచి చెడు సమానంగా ఉంటుంది
రాహువు, కేతువు, శని ఈ గ్రహాలు ప్రతికూల సంచారం వల్ల చికాకులుంటాయి.. మంచి ఫలితాలు పొందలేరు
బయటకు ధైర్యంగా ఉన్నా లోలోపల భయం వెంటాడుతుంది..సొంత విషయాలపై కన్నా ఇతరుల పనులపై శ్రద్ధ పెరుగుతుంది
సింహ రాశి ఉద్యోగులకు కష్టానికి తగిన ఫలితాలుండలు, నిరుద్యోగులకు వెయిటింగ్ తప్పదు
ఈ ఏడాది డబ్బు ఖర్చు అవడం తప్ప ఆశించిన పదవులు, గౌరవం దక్కదు
అష్టమంలో శని సంచారం సింహ రాశి కళాకారులకు అడుగడుగునా నిరాశే. ఆర్థిక ఇబ్బందులు తప్పవు
వ్యాపారులకు టైమ్ కలసిరాదు. పెట్టుబడులు లాభాలనివ్వవు. నిర్మాణ రంగం, వడ్డీ వ్యాపారం చేసేవారికి కలిసొస్తుంది
గ్రహాల బలం లేకపోవడంతో విద్యార్థులకు జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది..చదువుపై కన్నా ఇతర విషయాలపై శ్రద్ధ పెడతారు
సింహ రాశి వ్యవసాయదారులకు రెండో పంట కలిసొస్తుంది. అప్పులు తీరవు..
జన్మంలో కేతువు, సప్తమంలో రాహువు ప్రభావంతో మీరు అప్రమత్తంగా ఉండకపోతే కష్టాలు తప్పవు