ఉగాది 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఫలితాలు!
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మిథున రాశివారికి యోగదాయకంగా ఉంటుంది, ఆలోచనా శక్తి, సామర్థ్యం, తెలివితేటలు మీ సొంతం
మిథున రాశి ఉద్యోగులకు ఈ ఏడాది కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు
రాజకీయ నాయకులకు ప్రజాదరణ ఉంటుంది. పదవికోసం ఎదురుచూస్తున్న వారి నిరీక్షణ ఫలిస్తుంది. డబ్బు భారీగా ఖర్చు చేస్తారు.
జన్మంలో గురు సంచారం వల్ల కళాకారులకు టైమ్ కలసిరాదు. మంచి అవకాశాలు చేజారిపోతాయి
విద్యార్థులకు కూడా కష్టాలు తప్పవు. ఎంతో కష్టపడితే సాధారణ ఫలితాలు సాధిస్తారు. క్రీడాకారుల పరిస్థితి ఇంతే..
మిథున రాశి వ్యాపారులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం భారీ లాభాలు అందిస్తుంది. అన్ని వ్యాపారాలు కలిసొస్తాయి
వ్యవసాయదారులకు అద్భుతంగా ఉంటుంది. అన్ని రకాల వ్యవసాయ పంటలు లాభాలనిస్తాయి
సంఘంలో గౌరవం పెరుగుతుంది కానీ వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది పెడతాయి
ఇతరుల మేలు కోసం ఆలోచించడం, చిన్న విషయానికే ఆందోళన చెంది ప్రశాంతత పోగొట్టుకోవడం జరుగుతుంది
చిన్న చిన్న ఇబ్బందులున్నా ఓవరాల్ గా మిథున రాశివారికి మంచి ఫలితాలే ఉన్నాయ్...