అన్వేషించండి

Pawan Kalyan Latest News: అవగాహన లేకే నాపై దుష్ప్రచారం- ప్రకాశ్‌రాజ్‌పై పవన్ పంచ్‌లు !

Pawan Kalyan Latest News: పిఠాపురం వేదికగా జరిగిన ఆవిర్భావ సభలో హిందీ వివాదంపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రకాశ్ రాజ్ విమర్శలు చేశారు. వీటిపై పవన్ మరోసారి కౌంటర్ ఇచ్చారు.

Pawan Kalyan Latest News: త్రిభాష విధానంపై గతంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్‌ ఆధారంగా విమర్శలు చేస్తున్న వారికి క్లారిటీ ఇచ్చారు.తాను ఎప్పుడూ హిందీని భాషగా వ్యతిరేకించలేదని అన్నారు. నూతన జాతీయ విద్యావిధానం 2020 పేరుతో హిందీన్ని బలవంతగా రుద్దుతారేమో అని ఆందోళన వ్యక్తి చేసినట్టు వెల్లడించారు. 

ఒక భాషను బలవంతంగా రుద్దడం, లేదా భాషను గుడ్డిగా వ్యతిరేకించడం రెండూ తప్పే అని చెప్పిన పవన్ కల్యాణ్‌ దేశ సమగ్రతకు ఇది మంచిది కాదని సోషల్ మీడియా వేదికలో వివరణ ఇచ్చారు. "ఒక భాషను బలవంతంగా రుద్దడం లేదా ఒక భాషను గుడ్డిగా వ్యతిరేకించడం; రెండూ మన భారతదేశం జాతీయ, సాంస్కృతిక సమగ్రత లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడవు."

హిందీని తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు పవన్ కల్యాణ్. దాన్ని తప్పనిసరిగా నేర్చుకోవాలనే వాదనను మాత్రమే తప్పుపట్టినట్టు తెలిపారు. "నేను ఎప్పుడూ హిందీని ఒక భాషగా వ్యతిరేకించలేదు. దానిని తప్పనిసరి చేయడాన్ని మాత్రమే వ్యతిరేకించాను. NEP 2020లో హిందీని అమలు చేయడం లేదు. కానీ బలవంతంగా రుద్దుతున్నారనే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు."

కొత్తగా అమలు చేస్తున్న న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం విద్యార్థులు ఏవైనా రెండు భారతీయ భాషలు నేర్చుకోవచ్చని తెలిపారు. ఇందులో వారి మాతృభాష కూడా ఉంటుందని వివరించారు. "NEP 2020 ప్రకారం, విద్యార్థులు విదేశీ భాషతోపాటు ఏవైనా రెండు భారతీయ భాషలను(వారి మాతృభాషతో సహా) నేర్చుకునే వెసులుబాటు ఉంది. వారు హిందీని నేర్చుకోము అంటే, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, సంస్కృతం, గుజరాతీ, అస్సామీ, కాశ్మీరీ, ఒడియా, బెంగాలీ, పంజాబీ, సింధీ, బోడో, డోగ్రీ, కొంకణి, మైథిలి, మెయిటీ, నేపాలీ, సంతాలి, ఉర్దూ లేదా ఏదైనా ఇతర భారతీయ భాష ఎంచుకోవచ్చు." 

భాషా వైవిధ్యాన్ని పెంచడం కోసం జాతీయ ఐక్యత పెంపొందించడం కోసం ఈ మల్టీలాంగ్వేజ్‌ పాలసీ తీసుకొచ్చారని అభిప్రాయపడ్డారు పవన్ కల్యాణ్. ఇందులో రాజకీయాలు జొప్పించి ప్రజలను తప్పుదారి పట్టించడమే కాకుండా పవన్ మాట మార్చారని విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు. "బహుళ భాషా విధానం విద్యార్థులకు శక్తిని ఇవ్వడానికి, జాతీయ ఐక్యతను ప్రోత్సహించడానికి, భారతదేశ భాషా వైవిధ్యాన్ని కాపాడటానికి రూపొందించారు. ఈ విధానాన్ని రాజకీయ అజెండాల కోసం తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ తన వైఖరి మార్చుకున్నారని విమర్శిస్తూ అవగాహనా లోపాన్ని బహిర్గతం చేసుకుంటున్నారు. ప్రతి భారతీయుడికి భాషా స్వేచ్ఛ, విద్యా ఎంపిక సూత్రానికి జనసేన ఎప్పుడూ దృఢంగా కట్టుబడి ఉంది."

పిఠాపురంలో పవన్ చేసిన ప్రసంగంపై రాత్రి నుంచి ప్రకాశ్‌ రాజు వరసపెట్టి ట్వీట్‌లు చేస్తున్నారు. గతంలో ఆయన చేసిన కామెంట్స్ గుర్తు చేస్తూ భజన సేనగా మారాడని విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో పవన్ ఇలా రియాక్ట్ అయ్యారు. అయితే ఎక్కడ కూడా ప్రకాశ్‌ రాజ్ పేరు కానీ తనను విమర్శించే వారి ప్రస్తావన లేకుండా పవన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.  

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
Pak nationals in Hyderabad: హైదారాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులు..  వీసాల తనిఖీలు చేస్తున్న పోలీసులు
హైదారాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులు..  వీసాల తనిఖీలు చేస్తున్న పోలీసులు
War Condoms:  కండోమ్స్‌తోనే పాకిస్తాన్‌ను ఓడించిన సైన్యం - 1971 యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా ?
కండోమ్స్‌తోనే పాకిస్తాన్‌ను ఓడించిన సైన్యం - 1971 యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా ?
Pahalgam Terror Attack: ఏపీ, తెలంగాణ సీఎంలకు అమిత్ షా ఫోన్.. పాక్ పౌరులను గుర్తించాలని ఆదేశాలు జారీ
ఏపీ, తెలంగాణ సీఎంలకు అమిత్ షా ఫోన్.. పాక్ పౌరులను గుర్తించాలని ఆదేశాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs SRH Match preview IPL 2025 | ఆరుకు ఆరు మ్యాచ్ లు గెలవాలి..ఓడితే ఇక ఇంటికే | ABP DesamVirat Kohli 70 Runs vs RR IPL 2025 | ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చిన విరాట్ కొహ్లీ | ABP DesamJosh Hazlewood Bowling vs RR IPL 2025 | హేజిల్ వుడ్ బౌలింగ్ పై ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ | ABP DesamRCB vs RR Match Highlights IPL 2025 | పట్టు బిగించి చివర్లో మ్యాచ్ ను లాగేసుకున్న ఆర్సీబీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
Pak nationals in Hyderabad: హైదారాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులు..  వీసాల తనిఖీలు చేస్తున్న పోలీసులు
హైదారాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులు..  వీసాల తనిఖీలు చేస్తున్న పోలీసులు
War Condoms:  కండోమ్స్‌తోనే పాకిస్తాన్‌ను ఓడించిన సైన్యం - 1971 యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా ?
కండోమ్స్‌తోనే పాకిస్తాన్‌ను ఓడించిన సైన్యం - 1971 యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా ?
Pahalgam Terror Attack: ఏపీ, తెలంగాణ సీఎంలకు అమిత్ షా ఫోన్.. పాక్ పౌరులను గుర్తించాలని ఆదేశాలు జారీ
ఏపీ, తెలంగాణ సీఎంలకు అమిత్ షా ఫోన్.. పాక్ పౌరులను గుర్తించాలని ఆదేశాలు జారీ
Pahalgam Terror Attack: పాకిస్థాన్‌లో భయం భయం- విదేశాలకు చెక్కేసిన ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కుటుంబం
పాకిస్థాన్‌లో భయం భయం- విదేశాలకు చెక్కేసిన ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కుటుంబం
Koragajja: 'కాంతార'కు భిన్నంగా సుధీర్ అత్తవర్ కొత్త సినిమా 'కొరగజ్జ'...
'కాంతార'కు భిన్నంగా సుధీర్ అత్తవర్ కొత్త సినిమా 'కొరగజ్జ'...
Pahalgam Attack: పహల్గాంలో ఉగ్రదాడి చేసిన వారు స్వాతంత్య్ర సమరయోధులు- పాక్ డిప్యూటీ ప్రధాని సంచలనం
పహల్గాంలో ఉగ్రదాడి చేసిన వారు స్వాతంత్య్ర సమరయోధులు- పాక్ డిప్యూటీ ప్రధాని సంచలనం
Gold Price : బంగారం ధర లక్షన్నర?  బ్రోకరేజ్ సంస్థల అంచనా
బంగారం ధర లక్షన్నర? బ్రోకరేజ్ సంస్థల అంచనా
Embed widget