Revanth Reddy: రెండో సారీ నేనే ముఖ్యమంత్రి - పథకాల లబ్దిదారులే మా ఓటర్లు - రేవంత్ చిట్‌చాట్
Telangana: మీడియా ప్రతినిధులతో రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు.రెండో సారి కూడా తానే సీఎం అవుతానని ధీమా వ్యక్తం చేశారు.

Revanth Reddy Chitchat: రెండో సారి తాను ముఖ్యమంత్ర అవుతానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన అంశాలపై స్పందించారు. సంక్షేమపథకాల లబ్దిదారులే తమ ఓటర్లు అన్నారు. వారు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడకపోవచ్చు కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం వారు తమకే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామన్నారు. స్టేచర్ కాదని.. స్టేట్ ఫ్యూచర్ చాలా ముఖ్యమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొదటి సారి కాంగ్రెస్ పార్టీకి.. బీార్ఎస్ పై వ్యతిరేకతతో ఓటు వేశారని అన్నారు. వచ్చే సారి మాత్రం తమపై ప్రేమతో ఓటు వేస్తారని అన్నారు.
గత ఎన్నికలకు ముందు తాను ఎం చెప్పానో అదే జరిగిందని.. తర్వాత కూడా తాను చెప్పేదే జరుగుతుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా కోటి మంది మహిళలకు లబ్ది చేకూరుస్తామన్నారు. మా పని మీద ధైర్యంతో ముందుకు వెళ్తున్నామని రేవంత్ చెప్పారు. ఇరవై ఐదు లక్షల మందికి రుణమాఫీ జరిగిందన్నారు. డీలిమిటేషన్ కు కేంద్రం సిద్ధమవుతోందని.. దక్షిణాదికి అన్యాయం జరగకుండా తమ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిపారు.
అంతకు ముందు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కేటీఆర్ దుబాయ్ ఫైల్స్ గుట్టు బయటపెడతానన్నారు. అప్పట్లో.. జన్వాడ ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీలో ఎవరు దొరికారని ప్రశ్నించారు. మొన్నటికి మొన్న మొయినాబాద్ ఫాంహౌస్‌లో జరిగిన కోడి పందాలు, క్యాసినోలో ఎవరు దొరికారో అందరికీ తెలుసన్నారు. దుబాయ్‌లో డ్రగ్స్ తీసుకుని చనిపోయిన వ్యక్తి ఎవరికి మిత్రుడని.. దుబాయ్‌లో మిత్రుడు చనిపోతే మృతదేహాన్ని కూడా తెలంగాణకు తీసుకురాకుండా.. దుబాయ్ వెళ్లి మరీ అంత్యక్రియలు చేయించి వచ్చిన చరిత్ర ఎవరిదని రేవంత్ ప్రశ్నించారు. దీపావళి పండుగ రోజు అందరూ టపాసులు కాల్చుతుంటే.. వీళ్లు మాత్రం ఫాంహౌస్‌లో కొకైన్, డ్రగ్స్, మందు పార్టీలు చేసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. డ్రగ్స్ పార్టీపై పోలీసులు దాడి చేస్తే.. తమ బామ్మర్ది ఇంటికి వెళ్లారా అంటూ కేటీఆర్ అడుగుతున్నారన్నారు. డ్రగ్స్ పార్టీలు చేసుకుంటే పోలీసులు ఎందుకు వెళ్లకూడదని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. తన బామ్మర్ది కళ్లల్లో ఆనందం కోసం ఆయన ఏమైనా చేయొచ్చని.. కానీ తెలంగాణ గడ్డపై ఇలాంటి వ్యవహారాలను కాంగ్రెస్ ప్రభుత్వం క్షమించదు, ఉపేక్షించదు అంటూ రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
రెండో సారి సీఎం అయ్యే విషయంలో రేవంత్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా రెండో సారి చాన్సిస్తారని అంటున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మొదట టీడీపీకి రెండు సార్లు తర్వాత కాంగ్రెస్ పార్టీకి రెండు సార్లు.. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ కు రెండు సార్లు చాన్సిచ్చారని .. ఇప్పుడు కూడా తనకు మరోసారి చాన్సిస్తారని రేవంత్ గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే సంక్షేమ పథకాలపై ఎక్కువగా దృ,ష్టి పెడుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

