అన్వేషించండి

Shiv Shakti Aksh Rekha: కేదార్‌నాథ్ to రామేశ్వరం ఒకే సరళరేఖపై ఉన్న 7 శివాలయాల గురించి మీకు తెలుసా!

Shiv Shakti Rekha: వేల సంవత్సరాల క్రితం కట్టిన ఈ ఏడు శివాలయాలును.. పురాతన వాస్తుశిల్పులు ఎలాంటి ఉపగ్రహ సాంకేతికత లేని కాలంలో ఈ ఆలయాలను 79° రేఖాంశాల వద్ద కచ్చితంగా స్థాపించారు.

Shiv Shakti Aksh Rekha:మన దేశంలో ఎన్నో పురాతన ఆలయాలున్నాయి. వాటి నిర్మాణాల్లో అంతుచిక్కని రహస్యాలు ఇప్పటికీ అలానే ఉండిపోయాయి. వాటిలో ముఖ్యంగా ఉత్తరాదిన ఉన్న కేదార్ నాథ్ ఆలయం నుంచి దక్షిణాదిన ఉన్న రామేశ్వరం మధ్య లోతైన రహస్యం ఉందంటారు. ఈ రెండూ శివాలయాలే..రెండూ జ్యోతిర్లింగాలే. వీటి మధ్య దూరం 2383 కిలోమీటర్లు. ఈ రెండింటిని కలుపుకుని మొత్తం 7  శివాలయాలు ఒకే సరళరేఖపై న్నాయి.

శివశక్తి అక్షరేఖ

పంచభూత లింగాలు, జ్యోతిర్లింగాలు కొలువైన ఈ క్షేత్రాలు 4 వేల ఏళ్లక్రితం నిర్మించారు. ఆ కాలంలో ఓ ప్రదేశం అక్షాంశం, రేఖాంశాలను కొలిచేందుకు ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో లేదు. అయినా కూడా ఈ ఆలయాలు స్పష్టమైన సరళ రేఖలో నిర్మించారు.  ఇవన్నీ వేర్వేరు సమయాల్లో నిర్మించారు. మరి ఒకే సరళరేఖపైకి వచ్చేలా ప్రత్యేకమైన ఆలోచనతో నిర్మించారా లేదంటే యాదృశ్చికంగా ఇలా జరిగిందా అన్నది ఎవరూ చెప్పలేరు. ఈ  ఆలయాలను కలిపే రేఖని ‘శివశక్తి అక్షరేఖ’ అని పిలుస్తారు. ఉత్తర దక్షిణాన్ని కలిపే ఈ రేఖకు ఓ చివర కేదార్ నాథ్ ఉండగా మరో చివర రామేశ్వరం ఉంటుంది. అవే.. కేదార్‌నాథ్, కాళేశ్వరం, శ్రీ కాళహస్తి, కాంచీపురం, అరుణాచలం, చిదంబరం , రామేశ్వరం 

కేదార్‌నాథ్ ఆలయం  (Kedarnath)

ఉత్తరాఖాండ్‌ రుద్ర ప్రయాగ్ జిల్లా కేదార్‌నాథ్ లో ఉంది ఈ ఆలయం. దీనిని అర్థ జ్యోతిర్లింగం అంటారు. జనమేజయుడు నిర్మించి ఈ ఆలయాన్ని ఆది శంకరాచార్యలు పునర్ నిర్మించారని చెబుతారు. ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది ఈ ఆలయం. మిగిలిన ఆరు నెలలు మూసి ఉంటుంది. ఇది 79.0669 డిగ్రీల రేఖాంశంలో ఉంటుంది.

కాళేశ్వరం (Kaleshwaram) 

తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గోదావరి తీరంలో ఉంది కాళేశ్వరం. త్రిలింగదేశంగా శంకరుడు ఇక్కడ పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయం 79.9067° డిగ్రీల రేఖాంశంలో ఉంది. 

శ్రీకాళహస్తీశ్వర ఆలయం (Kalahasti)

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఉంది పంచభూత క్షేత్రం. తిరుమలను దర్శించుకునే భక్తులు శ్రీ కాళహస్తి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆలయం 79.7037 డిగ్రీల రేఖాంశంలో ఉంది.

కాంచీపురం (Ekambareshwaram)

పంచభూత లింగాల్లో ఒకటైన ఏకాంబరేశ్వరుడు కొలువైన ప్రదేశం ఇది. పల్లవ రాజులు నిర్మించిన ఈ ఆలయాన్ని చోళులు, విజయనగర రాజులు మెరుగులు దిద్దారు. ఈ ఆలయం 79.7036 డిగ్రీల రేఖాంశంలో ఉంది.

అరుణాచలం ( Thiruvannaikaval)  

శంకరుడే కొండగా వెలసిన క్షేత్రం అరుణాచలం. ఈ కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేస్తే సాక్షాత్తూ శివుడి చుట్టూ గిరి ప్రదక్షిణ చేసినట్టే అని భక్తుల విశ్వాసం. తమిళనాడులో ఉన్న ఈ క్షేత్రాన్ని చోళులు నిర్మించారు. పౌర్ణమి తిథి ఇక్కడ అత్యంత ప్రత్యేకం. ఇది  79.0747 డిగ్రీల రేఖాంశంలో ఉంది

నటరాజస్వామి ఆలయం (Chidambaram) 

తమిళనాడు చిదంబరంలో ఉన్న నటరాజ ఆలయంలో శివుడిని నటరాజస్వామిగా కొలుస్తారు. ఈ ఆలయం 79.6954 డిగ్రీల రేఖాంశంలో ఉంది.

రామేశ్వరం (Rameshwaram)

రామేశ్వరంలో ఉన్న శివలింగాన్ని శ్రీరామచంద్రుడు ప్రతిష్టించాడని, పాండవులు పునర్ నిర్మించారని పురాణాల్లో ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో  ఇదొకటి. ఈ ఆలయం  79.3129 డిగ్రీల రేఖాంశంలో ఉంది.

2025-2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది ఫలితాలు తెలుసుకునేందుకు Abp Desam ఆధ్యాత్మికం లింక్ క్లిక్ చేయండి.. ఇందులో మీ రాశి వార్షిక ఫలితాలు చూసుకోవచ్చు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan:  వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్ !
వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్ !
Revanth Reddy Japan Tour: ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌- జపాన్‌ కంపెనీ అంగీకారం
ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌- జపాన్‌ కంపెనీ అంగీకారం
AP DSC 2025: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఏజ్‌ లిమిట్ పెంచుతూ ఉత్తర్వులు 
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఏజ్‌ లిమిట్ పెంచుతూ ఉత్తర్వులు 
Telangana Group 1: తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు బ్రేక్-కీలక ఆదేశాలు జారీ చేసిన  హైకోర్టు
తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు బ్రేక్-కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MI vs SRH Match Highlights IPL 2025 | సన్ రైజర్స్ హైదరాబాద్ పై 4వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విక్టరీ | ABP DesamMitchell Starc vs Yashasvi Jaiswal in IPL 2025 | స్టార్క్ వర్సెస్ జైశ్వాల్  | ABP DesamAxar Patel Kuldeep Yadav vs RR | IPL 2025 లో ఢిల్లీ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న అక్షర్, కుల్దీప్DC vs RR Super Over Failure | IPL 2025 లో తొలి సూపర్ ఓవర్..చేతులారా నాశనం చేసుకున్న RR

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan:  వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్ !
వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్ !
Revanth Reddy Japan Tour: ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌- జపాన్‌ కంపెనీ అంగీకారం
ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌- జపాన్‌ కంపెనీ అంగీకారం
AP DSC 2025: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఏజ్‌ లిమిట్ పెంచుతూ ఉత్తర్వులు 
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఏజ్‌ లిమిట్ పెంచుతూ ఉత్తర్వులు 
Telangana Group 1: తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు బ్రేక్-కీలక ఆదేశాలు జారీ చేసిన  హైకోర్టు
తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు బ్రేక్-కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు
AP Liquor Scam News:  లిక్కర్ స్కాంలో పోలీసులతో గేమ్ ఆడుతున్న నిందితులు - ఎన్ని నోటీసులిచ్చినా ఒక్కరూ రారే - సీఐడీ ఎం చేయబోతోంది ?
లిక్కర్ స్కాంలో పోలీసులతో గేమ్ ఆడుతున్న నిందితులు - ఎన్ని నోటీసులిచ్చినా ఒక్కరూ రారే - సీఐడీ ఎం చేయబోతోంది ?
IPL 2025 MI VS SRH Update: పిచ్ తో స‌న్ ను బోల్తా కొట్టించిన ముంబై.. వ‌రుస‌గా రెండో విక్ట‌రీ.. జాక్స్ ఆల్ రౌండ్ షో.. స‌న్ రైజ‌ర్స్ కు ఐదో ఓట‌మి
పిచ్ తో స‌న్ ను బోల్తా కొట్టించిన ముంబై.. వ‌రుస‌గా రెండో విక్ట‌రీ.. జాక్స్ ఆల్ రౌండ్ షో.. స‌న్ రైజ‌ర్స్ కు ఐదో ఓట‌మి
Pakistan vs India Military Power: పాకిస్తాన్‌, భారత్‌లో ఎవరి వద్ద ఎక్కువ సైనిక శక ఉంది?  గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఏం చెబుతోంది?
పాకిస్తాన్‌, భారత్‌లో ఎవరి వద్ద ఎక్కువ సైనిక శక ఉంది? గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఏం చెబుతోంది?
Preeti Reddy : తెలంగాణలో కాంగ్రెస్‌ను దేవుడు కూడా కాపాడలేడు; రేవంత్ ప్రభుత్వంపై మల్లారెడ్డి కోడలు ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్‌ను దేవుడు కూడా కాపాడలేడు; రేవంత్ ప్రభుత్వంపై మల్లారెడ్డి కోడలు ఆసక్తికర వ్యాఖ్యలు
Embed widget