Revanth Reddy News: స్టేషన్ ఘన్‌పూర్‌లో రూ. 800 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి - వాటి పూర్తి వివరాలివే
Station Ghanpur News Today | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రూ.800 కోట్ల పలు అభివృద్ధి పనులు వర్చువల్ గా ప్రారంభించారు.

Revanth Reddy at Station Ghanpur in Jangaon | స్టేషన్ ఘన్‌పూర్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రూ. 800 కోట్ల అభివృద్ధి పనులను వర్చువల్ గా ప్రారంభించారు. జనగామ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రూ.102.1 కోట్లతో మహిళాశక్తి పథకం (Mahila Shakti) ద్వారా స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేసిన 7 ఆర్టీసీ బస్సులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం స్టేషన్ ఘనపూర్ శివారు శివునిపల్లిలో ప్రజా పాలన సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన అభివృద్ధి పనుల వివరాలు
- రూ.200 కోట్లతో జాఫర్‌గఢ్ మండలంలోని కోనాయాచలం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్
- రూ.5.5 కోట్లతో ఘన్‌పూర్ లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు
- రూ.45. 5 కోట్లతో ఘన్‌పూర్ లో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు
- రూ.26 కోట్లతో ఘన్‌పూర్ లో ఇంటిగ్రేటెడ్ డివిజనల్ లెవల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం
- రూ.148.76కోట్లతో దేవాదుల రెండో దశ
- RS ఘన్‌పూర్ లో 12.650 నుంచి 31.20(T.E) కిలోమీటర్ల మధ్య RS ఘన్‌పూర్ ప్రధాన కాలువకు CC లైనింగ్, ప్రధాన కాలువలు మరియు CM&CD పనుల నిర్మాణం
- రూ.25.6 కోట్లతో 512 ఇందిరమ్మ ఇండ్ల(యూనిట్‌కు రూ.5 లక్షలు) మంజూరు
- 274 ఇండ్లు ఘన్‌పూర్ నియోజకవర్గ మండలాలకు
- 238 ఇండ్లు ధర్మసాగర్ & వేలైర్ మండలాలకు
- రూ.15 కోట్లతో R/F NH రహదారి నుండి మల్లన్నగండి నుండి తాటికొండ, జిట్టగూడెం (Stn)నుంచి తరిగొప్పుల వరకు రహదారి విస్తరణ (ఇంటర్మీడియట్ లేన్).
- రూ.23.5 కోట్లతో గ్రామీణ రహదారుల నిర్వహణ-BT పునరుద్ధరణ (36.30KMలు)
- R/F జనగాం నుంచి జీడికల్, లింగాల ఘపూర్ (M) (14KMs)
- R/o జఫర్‌గఢ్ X రోడ్డు నుంచి జఫర్‌గఢ్ మండలం వెబ్కటపూర్ X రోడ్డు (14.70 కిమీలు)
- R/F నిడిగొండ నుంచి క్విలేషాపూర్, రఘునాథపల్లి (M) (7.60 KMs)
- రూ. 1 కోటితో స్టేషన్ ఘన్‌పూర్‌లో NPDCL డివిజనల్ ఆఫీస్ కమ్ ERO ఆఫీస్ భవనం నిర్మాణం
- రూ.2.26 కోట్లతో రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామంలో 33/11 KV సబ్ స్టేషన్ ఏర్పాటు
- రూ.2.29 కోట్లతో జఫర్‌గఢ్ మండలం సాగరం గ్రామం వద్ద 33/11 సబ్ స్టేషన్ ఏర్పాటు
- రూ.2.5 కోట్లతో చిల్పూర్ మండలం కొండాపూర్ గ్రామం వద్ద 33/11 సబ్ స్టేషన్ ఏర్పాటు
- రూ.2.48 కోట్లతో రఘునాథపల్లెలోని ఫతేషాపూర్ గ్రామం వద్ద 33/11 సబ్ స్టేషన్ ఏర్పాటు
- రూ.1.48 కోట్లతో ధర్మసాగర్ మండలంలోని రాయగూడెం సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం
- రూ.2 కోట్లతో బంజారా భవన్ నిర్మాణం
- రూ.11.9 కోట్లతో గోవర్దనగిరి నుంచి చర్లతండా వరకు రోడ్డు నిర్మాణం
- .3.7కోట్లతో నక్కపొక్కల తండా సామ్యకుంట తండా నుంచి రఘునాథపల్లిలోని దుర్గాతండా పోతరాజుగండి తండా వయా నిర్మించిన బీటీ రోడ్డు ప్రారంభోత్సవం
- రూ.3.49 కోట్లతో సేవ్య తండా & అబ్దుల్ నగర్ మీదుగా ఫతేపూర్ నుండి కచేర్ తండా వరకు నిర్మించిన బీటీ రోడ్డు ప్రారంభోత్సవం
- రూ.2.8 కోట్లతో ఫతేషాపూర్ గ్రామం లక్ష్మి తండా మీదుగా, రఘునాథపల్లి మండలంలోని రామచంద్ర గూడెం వరకు నిర్మించిన బీటీ రోడ్డు ప్రారంభోత్సవం
- స్టేషన్ ఘన్‌పూర్ గ్రామపంచాయితీని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేయడం
-రూ.1.76 కోట్లతో కుడా ఆధ్వర్యంలో పెద్దపెండ్యాల గ్రామంలో రోడ్ల విస్తరణకు ప్రతిపాదనలు
- రూ.102.1 కోట్లతో మహిళా శక్తి కింద7 RTC బస్సులు మంజూరు (రూ.2.10 కోట్లు), స్వయం సహాయ సంఘాలకు రూ.100 కోట్ల బ్యాంక్ లింకేజ్
- రూ.0.65 కోట్లతో ఘన్‌పూర్ లో తెలంగాణ నూనె గింజల సంస్థ ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్ సేకరణ కేంద్రం ఏర్పాటు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

