Secunderabad Kavach Center: సికింద్రాబాద్లో కవచ్ రీసెర్చ్ సెంటర్ - శంషాబాద్ ఎయిర్ పోర్టులాగ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్: కిషన్ రెడ్డి
Secunderabad Railway Station News | సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటు కానుందని, తెలంగాణకు తలమానికంగా నిలవబోతుందనీ కిషన్ రెడ్డి అన్నారు.

Redeveloped Begumpet Railway Station in Secunderabad | హైదరాబాద్: దేశంలో తొలి కవచ్ ఎక్స్‌లెన్స్ సెంటర్‌ను దక్షిణ మధ్య రైల్వే విభాగంలో ఏర్పాటు చేయాలని నరేంద్ర మోదీ నిర్ణయించారు. సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఈ సెంటర్ తెలంగాణకు తలమానికంగా నిలవబోతుందనీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఏం కే స్టాలిన్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏబీసీడీలు కూడా తెలియకుండా స్టాలిన్ కేంద్రంపై యుద్ధం చేస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం, వచ్చే ఎన్నికల్లో లబ్ధి కోసం తమిళ ప్రజలతో పాటు దక్షిణాది రాష్ట్రాల వారిని రెచ్చగొడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఈ ప్రాంత ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉన్నారని, ఏ విషయంపై ఎలా వ్యవహరించాలో వారికి తెలుసని కిషన్ రెడ్డి అన్నారు.
బేగంపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రాలపై సైతం హిందీ భాషను బలవంతంగా రుద్దాలని చూడలేదని పేర్కొన్నారు. కానీ ఎన్నికల కోసం తమిళ ప్రజలను స్టాలిన్ రెచ్చగొడుతున్నారు. దక్షిణాది ప్రజలను సైతం స్టాలిన్ రెచ్చగొడితే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని భాషలను ఆదరిస్తుందని.. ఏ రాష్ట్రం వారికి వారి మాతృభాష మీద మక్కువ ఉంటుంది. తమిళ ప్రభుత్వం డీఎంకే పార్టీ ఎమ్మెల్యే కుమారుడు ఉదయ్ కుమార్ రూపొందించిన రూపాయి గుర్తును తొలగించడం సబబు కాదు.
సికింద్రాబాద్లో కవచ్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటు కానుంది. దేశంలో తొలి కవచ్ ఎక్స్‌లెన్స్ సెంటర్‌ను దక్షిణ మధ్య రైల్వే విభాగంలో ఏర్పాటు చేయాలని నరేంద్ర మోదీ (@narendramodi) నిర్ణయించారు. ఈ సెంటర్ తెలంగాణకు తలమానికంగా నిలవబోతుంది. pic.twitter.com/ENYLk4kUbe
— G Kishan Reddy (@kishanreddybjp) March 15, 2025
మోదీ నాయకత్వంలోనే ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఉత్తరాది సినిమాలను దక్షిణ దిన ఆదరిస్తున్నారు. తెలుగు తమిళం కన్నడ మలయాళం సినిమాలను ఉత్తర భారత దేశంలో ప్రజాధరణ పొందుతున్నాయి. స్టాలిన్ అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలి. అంతేగాని ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే వాళ్లు మరింత చైతన్యవంతమై ఎదురు తిరుగుతారు' అన్నారు.
Glimpses from inspection of the redeveloped Begumpet Railway Station in Secunderabad.
— G Kishan Reddy (@kishanreddybjp) March 16, 2025
𝐁𝐮𝐝𝐠𝐞𝐭: 𝐑𝐬. 𝟑𝟖 𝐜𝐫𝐨𝐫𝐞𝐬
𝐖𝐨𝐫𝐤𝐬 𝐬𝐭𝐚𝐭𝐮𝐬: 𝟗𝟎% 𝐜𝐨𝐦𝐩𝐥𝐞𝐭𝐞𝐝
The station being is taking shape in mission mode and will soon be ready to provide the best passenger… pic.twitter.com/oqgruIjmVT
సికింద్రాబాద్లో కవచ్ రీసెర్చ్ సెంటర్
స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం కవచ్ కు సంబంధించిన పరిశోధన కేంద్రాన్ని కేంద్రపాలిలో నెలకొల్పుదామని కిషన్ రెడ్డి అన్నారు. రైలు ప్రమాదాలను అడ్డుకునేందుకు కవచ టెక్నాలజీని కేంద్ర ప్రభుత్వం వినియోగిస్తుంది. వచ్చే ఏడాది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ తరహాలో అందుబాటులోకి వస్తుంద న్నారు. ఏ అభివృద్ధి పనులకు మొదటి విడతలో 717 కోట్లు కేటాయింపులు జరిగాయి. 26 కోట్లతో బేగంపేట స్టేషన్ తొలి విడత పనులు పూర్తికాగా మరో 12 కోట్ల వ్యయంతో పనులు జరుగుతున్నాయని తెలిపారు.
తెలంగాణలో కొత్త రైల్వే లైనులకు సంబంధించి 22 ప్రాజెక్టులు, 39,300 కోట్ల ఖర్చుతో మనం జరుగుతుందన్నారు. కేంద్ర బడ్జెట్లో ఈ ఏడాది రాష్ట్రానికి 5,337 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఎన్డీఏ హయాంలో 453 ఫ్లై ఓవర్లు, అండర్ బ్రిడ్జిలను రైల్వే లైనులకు అనుసంధానంగా నిర్మించినట్లు తెలిపారు. సికింద్రాబాద్ తో పాటు తెలంగాణలో వివిధ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్రం సంపూర్ణంగా సహకరిస్తోంది. ఇటీవల ప్రారంభించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ కు అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ పూర్తి చేసి ఇవ్వాలని కోరారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

