Income Tax: ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు- దరఖాస్తు, ఎంపిక వివరాలు
హైదరాబాద్‌లోని ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలు స్పోర్ట్స్ కోటాలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతుంది.

Recruitment of Meritorious Sports Persons: హైదరాబాద్‌లోని ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలు స్పోర్ట్స్ కోటాలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 56 పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుంచి మెట్రిక్యులేషన్, 12వ తరగతి, డిగ్రీ లేదా తత్సమానం కలిగిన వారికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
స్పోర్ట్స్ విభాగాలు: అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్, బాస్కెట్‌బాల్, బాడీ బిల్డింగ్, బ్రిడ్జి, క్యారమ్స్, చెస్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, స్వ్కాష్, స్విమ్మింగ్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 56
⏩ స్టెనోగ్రాఫర్-గ్రేడ్-2: 02 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమానం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.25,500 - రూ.81,100.
⏩ ట్యాక్స్ అసిస్టెంట్: 28 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా తత్సమానం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.25,500 - రూ.81,100.
⏩ మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్): 26 పోస్టులు
అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.18,000 - రూ.56,900.
స్పోర్ట్స్ విభాగాల వారీగా ఖాళీలు..
➥ అథ్లెటిక్స్(పురుషులు- 03, మహిళలు- 03)
➥ బ్యాడ్మింటన్(పురుషులు- 02, మహిళలు- 02)
➥ బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్(పురుషులు- 01)
➥ బాస్కెట్‌బాల్(పురుషులు- 04)
➥ బాడీ బిల్డింగ్(పురుషులు- 01)
➥ బ్రిడ్జి(పురుషులు- 01, మహిళలు- 01)
➥ క్యారమ్స్(పురుషులు- 01, మహిళలు- 01)
➥ చెస్(పురుషులు- 01, మహిళలు- 01)
➥ క్రికెట్(పురుషులు- 04)
➥ ఫుట్‌బాల్(పురుషులు- 04)
➥ హాకీ(పురుషులు- 04)
➥ కబడ్డీ(పురుషులు- 04)
➥ స్వ్కాష్(పురుషులు- 01, మహిళలు- 01)
➥ స్విమ్మింగ్(పురుషులు- 02, మహిళలు- 02)
➥ టెన్నిస్(పురుషులు- 02, మహిళలు- 02)
➥ టేబుల్ టెన్నిస్(పురుషులు- 02, మహిళలు- 02)
➥ వాలీబాల్(పురుషులు- 04)
దరఖాస్తు విదానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేయాల్సిన సర్టిఫికెట్లు..
➥ వయస్సు రుజువు కోసం మెట్రిక్యులేషన్/ఎస్ఎస్సీ లేదా తత్సమాన సర్టిఫికేట్.
➥ విద్యా అర్హతల సర్టిఫికెట్లు. (పోస్టు అవసరాలకు అనుగుణంగా)
➥ నోటిపికేషన్‌లో పేర్కొన్న విధంగా క్రీడలు/ఆటల సర్టిఫికెట్లు.
➥ ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ కమ్యూనిటీ సర్టిఫికేట్.
➥ చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు (ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్ లేదా ఓటరు ID)
ఎంపిక విధానం: నిబంధనల ప్రకారం.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05.04.2025.
Notification
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

