Bullet Coffee : బుల్లెట్ కాఫీతో బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే.. రెసిపీ చూసేద్దాం
Morning Drink : ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు ఉందా? అయితే మీ రెగ్యులర్ కాఫీకి బదులుగా బుల్లెట్ కాఫీ తాగండి. దీనివల్ల బరువు తగ్గడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయట. అవేంటంటే..

Benefits of Bullet Coffee : బుల్లెట్ కాఫీ గురించి కాఫీ లవర్స్ కచ్చితంగా వినే ఉంటారు. అయితే కాఫీ కంటే బుల్లెట్ కాఫీనే బెటర్ అని కొందరు నిపుణులు చెప్తున్నారు. మీకు రోజూ కాఫీ తాగే అలవాటు ఉంటే దానిని దీనితో రిప్లేస్ చేయమని సూచిస్తున్నారు. ఇది ఎన్నో బెనిఫిట్స్ ఇవ్వడంతో పాటు బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుందట. ఇంతకీ ఈ బుల్లెట్ కాఫీ వల్ల కలిగే లాభాలు ఏంటో.. దానిని ఏ విధంగా తయారు చేయాలో.. ఉదయాన్నే తీసుకుంటే కలిగే బెనిఫిట్స్ ఏంటో చూసేద్దాం.
బుల్లెట్ కాఫీ
బుల్లెట్ కాఫీని కూడా కాఫీ పౌడర్‌తోనే తయారు చేస్తారు. కానీ ఇది హెల్తీ ఫ్యాట్స్‌తో నిండి ఉంటుంది. మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెతో దీనిని తయారు చేస్తారు. హెల్తీ ఫ్యాట్స్‌గా నెయ్యిని తీసుకుంటారు.
తయారీ ఎలా అంటే..
ఓ గ్లాస్ నీటిలో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని వేసి దానిలో నెయ్యి వేయాలి. మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్ (MCT oil) నూనెను లేదా కొబ్బరి నూనెను వేసి దీనిని బాగా బ్లెండ్ చేయాలి. ఇది క్రీమీగా రెడీ అవుతుంది. అంతే బుల్లెట్ కాఫీ రెడీ.
బుల్లెట్ కాఫీతో కలిగే ప్రయోజనాలు ఇవే..
బుల్లెట్ కాఫీ శక్తిని, మానసిక స్పష్టతను ప్రమోట్ చేస్తుంది. కాబట్టి ఉదయాన్నే దీనిని తీసుకుంటే రోజంతా యాక్టివ్‌గా ఉండడంతో పాటు చేయాల్సిన పనిపై ఫోకస్ పెడతారు. ఇది రోజంతా మీకు శక్తిని అందిస్తుంది. కాఫీలోని కెఫిన్.. నెయ్యి, నూనె నుంచి హెల్తీ ఫ్యాట్స్ విడుదలై.. క్రాష్ లేకుండా ఎక్కువ కాలం మీ శరీరానికి, మనసుకు శక్తిని అందిస్తాయి.
ఫోకస్ పెంచుతుంది..
బుల్లెట్ కాఫీ శరీరంలోని కార్బోహైడ్రట్లకు బదులుగా.. కొవ్వును ఎనర్జీ కోసం వినియోగించుకుంటుంది. ఇది మీరు యాక్టివ్‌గా ఉండేలా చేసి.. పనిపై ఫోకస్‌ని పెంచుతుంది. పైగా మీకు బ్రేక్ ఫాస్ట్ చేసే సమయం దొరకనప్పుడు ప్రత్యామ్నాయంగా దీనిని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది మీరు ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.
బరువు తగ్గడానికి..
ఈ బుల్లెట్ కాఫీ ప్రధానంగా బరువు తగ్గడానికి బాగా ప్రసిద్ధి చెందింది. బుల్లెట్ కాఫీలోని కొవ్వులు కీటోసిస్‌ను ప్రోత్సాహించడంలో హెల్ప్ చేస్తాయి. దీనివల్ల శరీరం కార్బోహైడ్రేట్లకు బదులుగా కొవ్వును బర్న్ చేసి శక్తిని విడుదల చేస్తుంది. దీనివల్ల బరువు తగ్గుతారు. మెటబాలీజం పెరుగుతుంది. ఫిట్నెస్ గోల్స్ రీచ్ అయ్యేందుకు దీనిని బూస్టర్‌గా మీ డైట్లో చేర్చుకోవచ్చు.
జీర్ణ సమస్యలు..
జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవారికి కూడా ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. శరీరంలో మంటను తగ్గించి.. గట్ హెల్త్‌ను ప్రమోట్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ను దూరం చేస్తుంది. గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ఇది ప్రోత్సాహిస్తుంది.
సైడ్ ఎఫెక్ట్స్
కొందరికి సెన్సిటివిటీ ఉంటుంది. దానివల్ల కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశముంది. కాఫీలో కెఫిన్ కంటెంట్ హృదయ స్పందనలో కాస్త ఇబ్బందులు కలిగిస్తోంది. కెఫిన్, నూనె కలయిక కొందరిలో రక్తపోటును పెంచుతుంది. మరికొందరికి వికారం, వాంతులు అయ్యే అవకాశముంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మీరు బుల్లెట్ కాఫీని డైట్లో చేర్చుకోవాలనుకుంటే తక్కువ మోతాదులో స్టార్ట్ చేస్తే మంచిది. నూనెను అర టీస్పూన్ తీసుకోవాలి. నాణ్యత కలిగిన పదార్థాలు ఎంచుకుంటే మంచిది. బుల్లెట్ కాఫీలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు తర్వాత తీసుకునే కేలరీలపై శ్రద్ధ పెట్టండి. లేదంటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. బుల్లెట్ కాఫీలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటే మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

